24, జనవరి 2013, గురువారం

మల్డకల్ మండలము (Maldakal Mandal)

జిల్లా జోగులాంబ గద్వాల జిల్లా
రెవెన్యూ డివిజన్ గద్వాల
జనాభా52646 (2011)
అసెంబ్లీ నియోజకవర్గంగద్వాల
లోకసభ నియోజకవర్గంనాగర్‌కర్నూల్
పర్యాటక ప్రాంతాలువేంకటేశ్వరస్వామి ఆలయం (మల్డకల్),
ముఖ్య పంటలువేరుశనగ,
మల్డకల్ జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన మండలము. గద్వాల, అయిన మండలాల మధ్యలో ఉంది. ఈ మండలం గద్వాల రెవెన్యూ డివిజన్, గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండల కేంద్రంలో ఆదిశిలా క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. మల్డకల్ మండలం పండ్లతోటల పెంపకానికి ప్రసిద్ధి. మండలంలో 19 రెవెన్యూ గ్రామాలు, 18 గ్రామపంచాయతీలున్నాయి. లెక్కల ప్రకారం మండల జనాభా 52646.

సరిహద్దులు:
ఈ మండలమునకు ఉత్తరమున ధరూర్, గద్వాల మండలములు, తూర్పున గద్వాల, ఇటిక్యాల మండలములు, దక్షిణమున ఐజ మండలము, పశ్చిమాన ఘట్టు మండలము సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 52646. ఇందులో పురుషులు 26397, మహిళలు 26249. జనాభాలో ఇది జిల్లాలో 39వ స్థానంలో ఉంది. అక్షరాస్యత శాతం 41.99%. ఇది జిల్లాలో అత్యధిక అక్షరాస్యత శాతం కల మండలాలలో చివరి నుంచి మూడవ స్థానంలో ఉంది.

రవాణా సౌకర్యాలు:
గద్వాల నుంచి అయిజా మీదుగా మంత్రాలయం వెళ్ళు రహదారి మండలం మీదుగా వెళ్ళుచున్నది. మండల కేంద్రం నుంచి ఘట్టు, ఇటిక్యాలకు కూడా రహదారి సౌకర్యం ఉంది. మండలానికి రైలుసౌకర్యం లేకున్ననూ గద్వాల స్టేషన్ మండలవాసులకు అందుబాటులో ఉన్నది.

రాజకీయాలు:
ఈ మండలము గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2006 జడ్పీటీసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన అరుణమ్మ విజయం సాధించారు.

గద్వాల నియోజకవర్గంలో
మల్డకల్ మండల స్థానం (ఆకాశం రంగు)
విద్యాసంస్థలు:
2008-09 నాటికి మండలంలో 28 ప్రాథమిక పాఠశాలలు (26 మండల పరిషత్తు, 2 ప్రైవేట్), 11 ప్రాథమికోన్నత పాఠశాలలు (6 మండల పరిషత్తు, 5 ప్రైవేట్), 7 ఉన్నత పాఠశాలలు (1 ప్రభుత్వ, 6 జడ్పీ), ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉన్నది. బిజ్వార్, పాల్వాయి, అమరవాయి, మల్డకల్, ఎల్కూరు, విఠలాపూర్. 

వ్యవసాయం, నీటిపారుదల:
మండలం మొత్తం విస్తీర్ణం 22342 హెక్టార్లలో 70% భూమి వ్యవసాయ యోగ్యంగా ఉన్నది. మండలంలో పండించే ప్రధాన పంట వేరుశనగ, పండ్లతోటలు. వరి, ప్రత్తి కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 575 మిమీ. మండలంలో సుమారు 5400 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది.

మల్డకల్ మండలంలోని గ్రామపంచాయతీలు
1.అడవిరావులచెరువు7.నాగర్ దొడ్డి13.బిజ్వార్
2.అమరవాయి8.నీలిపల్లి14.మద్దెలబండ
3.ఉలిగేపల్లి9.నేతినోనిపల్లి15.మల్డకల్ (మేజర్)
4.ఎల్కూరు10.పాల్వాయి16.మల్లందొడ్డి
5.కుర్తిరావులచెరువు11.పెద్దపల్లి17.విఠలాపుర్
6.తాటికుంట12.పెద్దొడ్డి18.సద్దలోనిపల్లి


విభాగాలు: జోగులాంబ గద్వాల జిల్లా మండలాలు,  మల్డకల్ మండలము, గద్వాల రెవెన్యూ డివిజన్, గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం,
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Mahabubnagar Dist, 2008,
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • మహబూబ్‌నగర్ జిల్లా సర్వస్వము (రచన- బి.ఎన్.శాస్త్రి),
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక