22, ఆగస్టు 2016, సోమవారం

శంషాబాద్ జిల్లా (Shamshabad District)

మండలాలు16
వైశాల్యం
జనాభా


శంషాబాద్ జిల్లా తెలంగాణలో కొత్తగా అవతరించనున్న జిల్లా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 22, 2016న విడుదల చేసిన ఉత్తర్వు GO Rt No 367 ప్రకారం ఈ జిల్లా 16 మండలాలతో అవతరించనుంది. ఇందులో 3 కొత్తగా అవతరించనున్న మండలాలు మరియు 4 మండలాలు మహబూబ్‌నగర్ జిల్లాకు మిగితా మండలాలు రంగారెడ్డి జిల్లాకు చెందినవి. అంతర్జాతీయ విమానాశ్రయం నెలకొనియున్న శంషాబాద్ ఈ జిల్లాకు పరిపాలన కేంద్రం కానుంది. 7వ నెంబరు (కొత్తపేరు 44), 9వ నెంబరు (65) జాతీయ రహదారులు మరియు సికింద్రాబాదు-డోన్ రైలుమార్గం జిల్లా గుండా వెళ్ళుచున్నవి.

సరిహద్దులు:
ఈ జిల్లాకు తూర్పున యాదాద్రి మరియు నల్గొండ జిల్లాలు, దక్షిణాన నాగర్‌కర్నూల్ జిల్లా, పశ్చిమాన రంగారెడ్డి జిల్లా, నైరుతిన మహబూబ్‌నగర్ జిల్లా, వాయువ్యాన సంగారెడ్డి జిల్లా, ఉత్తరాన హైదరాబాదు జిల్లా సరిహద్దులుగా ఉంటాయి.

డివిజన్లు - మండలాలు:
ఇబ్రహీంపట్నం డివిజన్: కందుకూరు మండలం, మహేశ్వరం మండలం, ఇబ్రహీంపట్నం మండలం, మంచాల మండలం, యాచారం మండలం, అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, సరూర్‌నగర్ మండలం, బాలాపుర్ మండలం (కొత్తగా ఏర్పాటు).
రాజేంద్రనగర్ డివిజన్: శంషాబాదు మండలం, శేరిలింగంపల్లి మండలం, రాజేంద్రనగర్ మండలం, గండిపేట మండలం (కొత్తగా ఏర్పాటు), కొందుర్గ్ మండలం, ఫరూఖ్ నగర్ మండలం, కొత్తురు మండలం, కేశంపేట మండలం.


విభాగాలు: తెలంగాణ జిల్లాలు, శంషాబాద్ జిల్లా,

 = = = = =


మల్కాజ్‌గిరి జిల్లా (Malkajgiri District)

మండలాలు10
వైశాల్యం
జనాభా


మల్కాజ్‌గిరి జిల్లా తెలంగాణలో కొత్తగా అవతరించనున్న జిల్లా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 22, 2016న విడుదల చేసిన ఉత్తర్వు GO Rt No 367 ప్రకారం ఈ జిల్లా 10 మండలాలతో అవతరించనుంది. ఇందులో 2 కొత్తగా అవతరించనున్న మండలాలు. అన్ని మండలాలు ఇప్పటి రంగారెడ్డి జిల్లా లోనివే. గ్రేటర్ హైదరాబాదులో భాగంగా ఉన్న మల్కాజ్‌గిరి ఈ జిల్లాకు పరిపాలన కేంద్రం కానుంది. ఈ ప్రతిపాదిత జిల్లాకు సిద్ధిపేట జిల్లా మరియు హైదరాబాదు జిల్లాలు సరిహద్దులుగా ఉంటాయి.

డివిజన్లు - మండలాలు:
మల్కాజ్‌గిరి డివిజన్: మేడ్చల్ మండలం, మల్కాజ్‌గిరి మండలం, కుత్బుల్లాపూర్ మండలం, దుండిగల్ మండలం (కొత్తగా ఏర్పాటు), బాలానగర్ మండలం.
కీసర డివిజన్ (కొత్తగా ఏర్పాటు): ఉప్పల్ మండలం, కీసర మండలం, ఘట్‌కేసర్ మండలం, షామిర్‌పేట్ మండలం, జవహర్‌నగర్ మండలం (కొత్తగా ఏర్పాటు).

రవాణా సౌకర్యాలు:
సికింద్రాబాదు నుంచి నిజామాబాదు వెళ్ళు రైలుమార్గం మరియు కాజీపేట వెళ్ళు రైలుమార్గం జిల్లా గుండా వెళ్ళుచున్నది. 7వ నెంబరు (కొత్తపేరు 44) మరియు 202 నెంబరు జాతీయ రహదారులు కూడా జిల్లాపై నుంచి వెళ్తున్నాయి.


విభాగాలు: తెలంగాణ జిల్లాలు, మల్కాజ్‌గిరి జిల్లా,


 = = = = =


హన్మకొండ జిల్లా (Hanmakonda District)

మండలాలు18
వైశాల్యం2481 Sq KM
జనాభా11,52,579


హన్మకొండ జిల్లా తెలంగాణలో కొత్తగా అవతరించనున్న జిల్లా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 22, 2016న విడుదల చేసిన ఉత్తర్వు GO Rt No 363 ప్రకారం ఈ జిల్లా 18 మండలాలతో అవతరించనుంది. ఇందులో 4 కొత్తగా అవతరించనున్న మండలాలు. హన్మకొండ జిల్లాలోని అన్ని మండలాలు ఇప్పటి వరంగల్ జిల్లా లోనివే. వరంగల్ నగరపాలక సంస్థలో భాగంగా ఉన్న హన్మకొండ  ఈ జిల్లాకు పరిపాలన కేంద్రంగా ఉంటుంది. ఈ జిల్లాలొ వరంగల్ మరియు హుజురాబాదు డివిజన్లుగా ఉంటాయి.

రాష్ట్రంలోనే ప్రముఖ రైల్వేజంక్షన్ కాజీపేట ఈ జిల్లాలోనే ఉంది. ప్రముఖ కవి పాల్కురికి సోమనాథుడు, సహజకవి బమ్మెర పోతన, గణితవేత్త చుక్కారామయ్య ఈ జిల్లాకు చెందినవారు

జిల్లా సరిహద్దులు:
ప్రతిపాదన ప్రకారం జిల్లా ఏర్పడితే ఈ జిల్లాకు ఉత్తరాన పెద్దపల్లి జిల్లా, తూర్పున వరంగల్ జిల్లా, ఈశాన్యాన జయశంకర్ జిల్లా, పశ్చిమాన సిద్ధిపేట మరియు యాదాద్రి జిల్లాలు సరిహద్దులుగా ఉంటాయి.

డివిజన్లు - మండలాలు:
హన్మకొండ డివిజన్: హన్మకొండ మండలం, కాజీపేట మండలం (కొత్తగా ఏర్పాటు), ధర్మసాగర్ మండలం, చిల్పూర్ మండలం (కొత్తగా ఏర్పాటు), వేలేరు మండలం (కొత్తగా ఏర్పాటు), ఘన్‌పూర్ మండలం, రాయపర్తి మండలం, జప్గర్‌గఢ్ మండలం, నర్మెట్ట మండలం, రఘునాథపల్లి మండలం, పాలకుర్తి మండలం, కొడకండ్ల మండలం, దేవరుప్పల మండలం.
హుజురాబాదు డివిజన్: హుజురాబాదు మండలం, ఎల్కతుర్తి మండలం, భీమదేవరపల్లి మండలం, కమలాపూర్ మండలం, జమ్మికుంట మండలం, ఇల్లందకుంట మండలం (కొత్తగా ఏర్పాటు).విభాగాలు: తెలంగాణ జిల్లాలు, హన్మకొండ జిల్లా,


 = = = = =Tags:Hanmakonda Dist in Telugu, telugulo hanmakonda jilla, hanmakonda zilla telugulo, 27 dists in telugu information,

పెద్దపల్లి జిల్లా (Peddapally DIstrict)


పెద్దపల్లి జిల్లా
మండలాలు12
వైశాల్యం2203 Sq KM
జనాభా7,91,836


పెద్దపల్లి జిల్లా తెలంగాణలో కొత్తగా అవతరించనున్న జిల్లా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 22, 2016న విడుదల చేసిన ఉత్తర్వు GO Rt No 362 ప్రకారం ఈ జిల్లా 12 మండలాలతో అవతరించనుంది. ఇందులో ఒకటి కొత్తగా అవతరించనున్న మండలం. పెద్దపల్లి జిల్లాలోని అన్ని మండలాలు ఇప్పటి కరీంనగర్ జిల్లా లోనివే. పెద్దపల్లి పట్టణం ఈ జిల్లాకు పరిపాలన కేంద్రంగా ఉంటుంది.

ప్రాచీనకాలం నాటి అవశేషాలు లభ్యమైన పెద్దబొంకూరు, ప్రాచీన బౌద్ధస్తూపం లభించిన వడ్కాపుర్, ధూళికట్ట బౌద్ధస్తూపం, తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే రామగుండం ఈ జిల్లాలో కలవు. 

జిల్లా సరిహద్దులు:
ప్రతిపాదన ప్రకారం జిల్లా ఏర్పడితే ఈ జిల్లాకు ఉత్తరాన కొమురంభీం తూర్పున మరియు ఈశాన్యాన జయశంకర్ జిల్లా, పశ్చిమాన జగిత్యాల మరియు కరీంనగర్ జిల్లాలు, దక్షిణాన హన్మకొండ జిల్లా సరిహద్దులుగా ఉంటాయి.

డివిజన్లు - మండలాలు:
పెద్దపల్లి డివిజన్: పెద్దపల్లి మండలం, ఓడెల మండలం, సుల్తానాబాదు మండలం, జూలపల్లి మండలం, ఎలిగేడ్ మండలం, ధర్మారం మండలం.
మంథని డివిజన్: రామగుండం మండలం, అంతర్గాం మండలం (కొత్తగా ఏర్పాటు), శ్రీరాంపూర్ మండలం, కమాన్‌పూర్ మండలం, మంథని మండలం, ముత్తారం మండలం.విభాగాలు: తెలంగాణ జిల్లాలు, పెద్దపల్లి జిల్లా,


 = = = = =Tags: Peddapalli dist in telugu, telugulo peddapalli jilla, peddapalli zilla in telugu, 27 dist in telanagana information in telugu

19, ఆగస్టు 2016, శుక్రవారం

సాక్షి మాలిక్ (Sakshi Malik)

జననంసెప్టెంబరు 3, 1992
జన్మస్థానంరోహ్‌టక్‌
రంగంరెజ్లింగ్ క్రీడాకారిణి
భారతదేశానికి చెందిన రెజ్లింగ్ క్రీడాకారిణి సాక్షి మాలిక్ సెప్టెంబరు 3, 1992న హర్యానాలోని రోహ్‌టక్‌లో జన్మించింది. 2016 రియో ఒలింపిక్ క్రీడలలో కాంస్యపతకం సాధించి రెజ్లింగ్‌లో ఒలింపిక్ పతకం సాధించిన తొలి భారతీయురాలిగా అవతరించింది.


క్రీడాప్రస్థానం:
 • 2010లో జూనియర్ వరల్డ్ చాంప్‌లో కాంస్యపతకం సాధించింది.
 • 2014లో దావెషుల్ట్జ్ అంతర్జాతీయ టోర్నీలో స్వర్ణం సాధించింది
 • 2014 గ్లాస్గో కామన్వెల్త్ క్రీడలలో రజతపతకం సాధించింది
 • 2015లో దోహా ఆసియా చాంప్ పోటీలలో కాంస్యం సాధించింది
 • 2016 రియో ఒలింపిక్ పోటీలలో కాంస్యం సాధించింది

2016 ఒలింపిక్స్:
2016 ఒలింపిక్స్ రేసులోనే లేని సాక్షిమాలిక్ ఒలింపిక్స్‌లోకి అడుగుపెట్టడమే కాకుండా పతకం సాధించే అంచనాలు లేని దశ నుంచి ఈ ఒలింపిక్స్‌లో దేశానికి తొలి పతకం సాధించి పెట్టింది. ప్రిక్వార్టర్స్‌లో ఓడిననూ అందులో ఓడించిన ప్రత్యర్థి ఫైనల్‌కు వెళ్ళడంతో రెపిచేజ్‌కు అర్హత సాధించి కాంస్య పతకంకై జరిగిన పోరులో టినిబెకావో ఐసులు (కిర్గిస్తాన్)పై విజయం సాధించి పతకం సాధించడమే కాకుండా రెజ్లింగ్‌లో ఒలింపిక్ పతకం సాధించిన తొలి భారతీయురాలిగా అవతరించింది

విభాగాలు: భారతదేశ క్రీడాకారులు, హర్యానా ప్రముఖులు, 1992లో జన్మించినవారు, ఒలింపిక్ పతకం సాధించిన భారతీయులు,


 = = = = =


8, ఆగస్టు 2016, సోమవారం

నిర్మల్ జిల్లా (Nirmal District)

 నిర్మల్ జిల్లా
మండలాలు13
వైశాల్యం3608 Sq KM
జనాభా7,09,418


నిర్మల్ జిల్లా తెలంగాణలో కొత్తగా అవతరించనున్న జిల్లా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 22, 2016న విడుదల చేసిన ఉత్తర్వు GO Rt No 361 ప్రకారం ఈ జిల్లా 13 మండలాలతో అవతరించనుంది. నిర్మల్ జిల్లాలోని అన్ని మండలాలు ఇప్పటి ఆదిలాబాదు జిల్లాలోనివే. రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన జ్ఞాసరసరస్వతీ ఆలయం, కడెం ప్రాజెక్టు ఈ జిల్లాలో కలవు. కూచిపూడి నాట్యంలో ప్రపంచప్రసిద్ధి చెందిన రాధారాజారెడ్డిలు ఈ జిల్లాకు చెందినవారు.

జిల్లా సరిహద్దులు:
ప్రతిపాదన ప్రకారం జిల్లా ఏర్పడితే ఈ జిల్లాకు ఉత్తరాన ఆదిలాబాదు జిల్లా, దక్షిణాన నిజామాబాదు మరియు జగిత్యాల జిల్లాలు, తూర్పున కొమురంభీం జిల్లాలు సరిహద్దులుగా ఉంటాయి. ఈ జిల్లాకు దక్షిణాన గోదావరి నది ప్రవహిస్తుంది.

డివిజన్లు - మండలాలు:
నిర్మల్ డివిజన్: నిర్మల్ మండలం, దిలావర్‌పూర్ మండలం, కడెం మండలం, ఖానాపూర్ మండలం, మామడ మండలం, లక్ష్మణ్‌చాందా మండలం, సారంగాపూర్ మండలం.
భైంసా డివిజన్ (కొత్తగా ఏర్పాటు): కుభీర్ మండలం, కుంటాలా మండలం, భైంసా మండలం, ముధోల్ మండలం, లోకేశ్వరం మండలం, తానూరు మండలం.

జిల్లా ప్రత్యేకతలు:
తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధిచెందిన జ్ఞానసరస్వతి ఆలయం, కొయ్యబొమ్మలకు మరియు పెయింటింగ్‌లకు పేరుగాంచిన నిర్మల్ పట్టణం, కాల్వ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, కడెం ప్రాజెక్టు ఈ జిల్లా ప్రత్యేకతలు.


విభాగాలు: తెలంగాణ జిల్లాలు, నిర్మల్ జిల్లా,


 = = = = =Tags: Nirmal District in Telugu, 27 Dists of Telangana in Telugu, telugulo nirmal jilla, nirmal zilla in telugu

30, జులై 2016, శనివారం

విభాగము: తెలంగాణ కోటలు (Portal: Telangana Forts)

విభాగము: తెలంగాణ కోటలు 
(Portal: Telangana Forts)
 1. చంద్రగఢ్ కోట (Chandragadh Fort)
 2. గద్వాల కోట (Gadwal Fort),
 3. గోల్కొండ కోట (Golkonda Fort),
 4. ఖమ్మం ఖిల్లా (Khammam Fort),
 5. ఖిలాషాపూర్ కోట (Khila Shapur Fort)
 6. కోయిలకొండ కోట (Koilkonda Fort),
 7. పానగల్ కోట (Pangal Fort),
 8. రామగిరి ఖిల్లా (Ramagiri Fort),

విభాగాలు: తెలంగాణ, భారతదేశ కోటలు,
------------ 

Tags: telangana Forts, Forts in Telangana, Telangana Forts in Telugu language, forts information in telugu,

గోల్కొండ కోట (Golkonda Fort)

ప్రాంతంహైదరాబాదు
నిర్మాణకాలం10-13 శతాబ్దాల మధ్యన


గోల్కొండ కోట హైదరాబాదు నగరంలో ఎత్తయిన నల్లరాతి కొండపై ఉంది. కోట రక్షణార్ధం దాని చుట్టూ పెద్ద బురుజు కూడా నిర్మించబడింది. 1083 నుండి 1323 వరకు పాలించిన కాకతీయుల కాలంలో ఇది నిర్మించబడినట్లు చరిత్రకారులు నిర్థారించారు. కాకతీయుల పతనం తర్వాత గోల్కొండ కోట ఢిల్లీసుల్తానుల అధీనంలో కొంతకాలం ఉండి తర్వాత 1326లో ముసునూరి నాయకులు మహమ్మద్ బీన్ తుగ్లక్ సైన్యాన్ని ఓడించి గోల్కొండను తిరిగి సాధించారు. 1371లో ముసునూరి కాపానీడు గోల్కొండను సంధిలో భాగముగా బహమనీ సుల్తాను మహమ్మదు షా వశము చేశాడు. 1512 తరువాత ముస్లిము సుల్తానుల రాజ్యములో రాజధానిగా చేయబడినది.

గోల్కొండ నాలుగు వేర్వేరు కోటల సముదాయం, ఒకదానిని చుట్టి మరొకటి నిర్మించబడ్డాయి. మట్టికోటను రాతికోటగా మలిచినది కుతుబ్‌షాహిలే. దుర్గం చుట్టూ గుట్టలు పెట్టని కోటలవలె ఉన్నాయి. ఈ కోట 87 అర్ధ చంద్రాకారపు బురుజులతోకూడిన 10 కి.మీ. పొడవు గోడను కలిగి ఉంది. ఇంకా 8 సింహద్వారములు, రాచమందిరాలు, మసీదులు, దేవాలయాలు, అశ్వశాలలు మొదలగునవి ఉండేవి. సింహద్వారములలో అన్నిటికంటే కిందది మరియు అన్నిటికంటే బయట ఉండేది ఫతే దర్వాజా (విజయ ద్వారము). ఔరంగజేబు విజయము తరువాత ఈ ద్వారము గుండానే తన సైన్యమును నడిపించాడు. ఏనుగుల రాకను ఆడ్డుకోవటానికి ఆగ్నేయము వైపున పెద్ద పెద్ద ఇనుప సువ్వలు ఏర్పాటు చేసారు. ఫతే దర్వాజా నిర్మించటానికి ధ్వనిశాస్త్రమును ఔపోసన పట్టినట్లున్నారు. గుమ్మటం కింద ఒక నిర్ణీత ప్రదేశమునందు చప్పట్లు కొడితే కిలోమీటరు ఆవల గోల్కొండలో అతి ఎత్తయిన ప్రదేశములో ఉన్న "బాలా హిస్సారు" వద్ద వినిపిస్తుంది. ఈ విశేషమును ఒకప్పుడు ఇక్కడి నిర్వాసితులు ప్రమాదసంకేతములు తెలుపుటకు ఉపయోగించేవారు. ఇప్పుడు మాత్రం సందర్శకులకు వినోదం పంచేదిగా మిగిలిపోయింది.


విభాగాలు: తెలంగాణ కోటలు, హైదరాబాదు, 


 = = = = =Tags: Golkonda Fort in Telugu, Telangana Forts, Hyderabad information, Telangana Tousism, Hyderabad Tourism,

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక