1, ఏప్రిల్ 2015, బుధవారం

సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar)

 సచిన్ టెండుల్కర్
జననంఏప్రిల్ 24, 1973
స్వస్థలంముంబాయి
రంగంక్రికెటర్
అవార్డులుభారతరత్న
ప్రపంచ క్రికెట్ క్రీడా చరిత్రలో ప్రఖ్యాతి గాంచిన భారతీయ ఆటగాడు సచిన్ రమేష్ టెండుల్కర్ ఏప్రిల్ 24, 1973 న జన్మించాడు. క్రికెట్ క్రీడలో తన బ్యాటింగ్‌తో లెక్కలేనన్ని రికార్డులు సృష్టించి తిరుగులేని క్రికెటర్‌గా పేరుగాంచి భారత ప్రభుత్వం నుంచి భారతరత్న పురస్కారం కూడా పొందిన తొలి క్రీడాకారుడు టెండుల్కర్. భారత జట్టుకు ఆపద్భాందవుడిగా ఎన్నో విజయాలు అందజేసిన ఈ ముంబాయి క్రికెటర్ యొక్క ఆటతీరు, ఆట లోని నైపుణ్యం ఎంత చూసిననూ తనవి తీరేది కాదని అభిమానుల నమ్మేవారు. అతను అవుటైన వెంటనే టి.వి.లను కట్టేసిన సందర్భాలు, స్టేడియం నుంచి ప్రేక్షకులు వెళ్ళిన సందర్భాలు కోకొల్లలు. టెస్ట్ రికార్డులు చూసిననూ, వన్డే రికార్డులు చూసిననూ అడుగడుగునా అతని పేరే కన్పిస్తుంది.

క్రీడా ప్రస్థానం:
తన గురువు రమాకాంత్ అచ్రేకర్ శిక్షణలో రాటుదేలిన సచిన్ పాఠశాలలో ఉన్నప్పుడు హరీష్ షీల్డ్ పోటీలో వినోద్ కాంబ్లీ తో కలిసి 1988 లో 644* పరుగుల పాట్నర్‌షిప్ రికార్డు సృష్టించాడు. ఆ ఇన్నింగ్సులో సచిన్ బౌలర్లపై విరుచుకుపడి పరుగుల వరద సాదించి 320 కి పైగా పరుగులు చేశాడు. ఆ టోర్నమెంట్ లో సచిన్ వెయ్యికి పైగా పరుగులు సాధించాడు. 2006 వరకు ఇది రికార్డుగా కొనసాగింది. అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రవేశించాక 1994 నుంచి అతని ప్రతిభ మారుమ్రోగింది. అదే ఏడాది తొలి టెస్ట్ సెంచరీ సాధించాడు. 1996 ప్రపంచకప్ టోర్నీ అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. 2000 దశకంతో ఆస్ట్రేలియా బౌలర్ షేర్ వార్న్ తన బౌలింగ్‌తో అందరినీ భయబ్రాంతులు చేసే సమయంలో సచిన్ తన బ్యాటింగ్‌తో వార్న్‌కు చెమటలు పట్టించాడు. కలలో సైతం సచిన్ వచ్చి భయపట్టించిన సంఘటనను స్వయంగా వార్న్ వెల్లడించాడు. 2011 ప్రపంచకప్‌లో విజయం సాధించిన పిదప సహచరులు సచిన్‌ను భుజాలప మోస్తూ స్టేడియం చుట్టు తిరగడం మరపురాని సంఘటనగా చెప్పవచ్చు.

అత్యధిక టెస్ట్ సెంచరీలు, అత్యధిక వన్డే సెంచరీలు, అత్యధిక అర్థసెంచరీలు, వన్డేలలో తొలి డబుల్ సెంచరీ, అత్యధిక సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సీరీస్ అవార్డులు, అత్యధిక టెస్ట్ పరుగులు, వన్డే పరుగులు తదితర రికార్డులు సచిన్ పేరిట ఉన్నాయి.

వ్యక్తిగతంగా సచిన్ పలు రికార్డులు సృష్టించిననూ కెప్టెన్‌గా మాత్రం రాణించలేకపోయాడు. అలాగే ట్రిపుల్ సెంచరీ సైతం కలగానే మిగిలిపోయింది.
సచిన్ టెండుల్కర్ జనరల్ నాలెడ్జి




విభాగాలు: భారత క్రికెట్ క్రీడాకారులు, భారతరత్న అవార్డు గ్రహీతలు, మహారాష్ట్ర ప్రముఖులు, ముంబాయి, 1973లో జన్మించినవారు.


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక