16, మార్చి 2018, శుక్రవారం

వేములపల్లి మండలం (Vemulapally Mandal)

వేములపల్లి మండలం
జిల్లా నల్గొండ
రెవెన్యూ డివిజన్ మిర్యాలగూడ
అసెంబ్లీ నియోజకవర్గంమిర్యాలగూడ
లోకసభ నియోజకవర్గంనల్గొండ
వేములపల్లి నల్గొండ జిల్లాకు చెందిన మండలము. ప్రముఖ రాజకీయ నాయకుడు చకిలం శ్రీనివాసరావు ఈ మండలమునకు చెందినవారు. కాకతీయుల కాలంలో సామంతరాజ్య రాజధానిగా ఉన్న ఆమనగల్ ఈ మండలంలోనే ఉంది. ఈ మండలం మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్, మిర్యాలగూడ  అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2016 జిల్లాల పునర్విభజన సమయంలో మండలంలోని 10 గ్రామాలను విడదీసి కొత్తగా ఏర్పాటుచేసిన మాడుగులపల్లి మండలంలో కలిపారు. ప్రస్తుతం మండలంలో 13 రెవెన్యూ గ్రామాలు కలవు.

సరిహద్దులు:
ఈ మండలం నల్గొండ జిల్లాలో తూర్పువైపున సూర్యాపేట జిల్లా సరిహద్దులో ఉంది. మండలానికి దక్షిణాన మిర్యాలగూడ మండలం, పశ్చిమాన మాడుగులపల్లి మండలం, ఉత్తరాన కేతెపల్లి మండలం, తూర్పున సూర్యాపేట జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. మండలం తూర్పు సరిహద్దు గుండా మూసీనది ప్రవహిస్తోంది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 43003. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 44460. ఇందులో పురుషులు 22295, మహిళలు 22165.
మండలంలోని గ్రామాలు:
Amanagallu, Annapureddy Guda, Buggabaviguda, Chalichimalapalem, Itikyala, Kamepally, Molkapatnam, Mundlapadu, Ravulapenta, Salkunoor, Settipalem, Thimmareddygudem, Vemulapally
ముఖ్యమైన గ్రామాలు
ఆమనగల్లు (Amangal):
ఈ గ్రామం కాకతీయుల కాలంలో వైభవంగా వెలుగొందినది. కాకతీయ సామతరాజులకు రాజధానిగా కూడా పనిచేసిన ఈ గ్రామంలో అప్పటి శిల్పకళా నైపుణ్యాలు దర్శనమిస్తాయి. ఈ గ్రామం రేచర్ల రెడ్డి వంశీయులకు జన్మస్థానంగా కూడా చెప్పబడుతుంది.
వేములపల్లి (Vemulapally):
ప్రముఖ రాజకీయ నాయకుడు చకిలం శ్రీనివాసరావు ఈ గ్రామమునకు చెందినవారు.

ఇవి కూడా చూడండి:

ఫోటో గ్యాలరీ
c
c
c c


హోం,
విభాగాలు: నల్గొండ జిల్లా మండలాలు,  వేములపల్లి మండలము, మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్, మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గం, 
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Nalgonda Dist, 2012,
  • Handbook of Census Statistics, Nalgonda District, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 245 తేది: 11-10-2016 
  • నల్గొండ జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర


tags: Vemulapalli Vemulapally Mandal Amangal Nalgonda Dist (district) Mandal in telugu, nalgonda Dist Mandals in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక