14, ఫిబ్రవరి 2018, బుధవారం

బ్రెజిల్ (Brazil)

ఖండందక్షిణ అమెరికా
రాజధానిబ్రసిలియా
వైశాల్యం85 లక్షల చకిమీ
జనాభా20.8 కోట్లు
బ్రెజిల్ దక్షిణ అమెరికా ఖండానికి చెందిన ప్రముఖ దేశము. 85 లక్షల చకిమీ వైశాల్యంతో ప్రపంచంలో ఐదవ పెద్ద దేశంగా ఉన్న బ్రెజిల్ ఉత్తర మరియు దక్షిణ అమెరికాఖండాలలో పెద్ద దేశము. 20.8 కోట్ల జనాభాతో ఆరవ అత్యధిక జనాభా కల దేశంగా ఉంది. దేశ రాజధాని బ్రసిలియా కాగా అత్యధిక జనాభా కల నగరం సావోపోలో. పోర్చుగీసు అధికార భాష కలిగిన దేశాలలో బ్రెజిల్ పెద్దది మరియు లాటిన్ అమెరికాలో ఏకైక దేశం.

ఈ దేశానికి తూర్పున సుమారు 7500 కిమీ పొడవైన అట్లాంటిక్ మహాసముద్రం తీరరేఖ ఉంది. మిగితావైపులా ఈక్వెడార్ మరియు చిలీ మినహా దక్షిణ అమెరికాకు చెందిన అన్ని దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి. దక్షిణ అమెరికా ఖండంలోనే ఈ దేశ వైశాల్యం వాటా 47.3% కలిగియుంది. ప్రపంచంలోనే పెద్ద నది అమేజాన్ నది దేశం గుండా ప్రవహిస్తుండగా ప్రపంచ ప్రసిద్ధి అమేజాన్ అడవులు ఈ దేశంలో ఉన్నాయి.సావోపోలో, రియోడిజనీరో, బ్రసిలియా, సాల్వడార్, విటోరియా, ఫోర్టాలెజ ఈ దేశంలోని ప్రముఖ నగరాలు.
బ్రెజిల్ జాతీయ పతాకం

1808 వరకు బ్రెజిల్ పోర్చుగీసు వలస దేశంగా ఉండేది. 1815లో రాజధాని లిసన్ నుంచి రియో డి జనీరోకు మార్చబడింది. 1822లో దేశానికి స్వాతంత్ర్యం లభించింది. 1824లో రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ప్రస్తుతం దేశంలో 26 రాష్ట్రాలు, 5570 పురపాలక సంఘాలు ఉన్నాయి.
బ్రెజిల్ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 8వ పెద్దదిగా పరిగణించబడుతుంది. BRICS, G20, Union of South American Nations, Mercosul, Organization of American States, Organization of Ibero-American States and the CPLPలలో ఈ దేశం సభ్యదేశంగా ఉంది. ఐక్యరాజ్యసమితిలో ఇది సంస్థాపక దేశం. కాఫీ పంటకు బ్రెజిల్ ప్రసిద్ధి చెందింది. క్రీడలలో ఫుట్‌బాల్ ఆట ఇక్కడి ప్రాధాన్యత కల క్రీడ. 5 సార్లు ఫీఫా కప్‌ను కూడా ఈ దేశం సాధించింది. 2014 ఫీఫా ప్రపంచకప్, 2016లో ఒలింపిక్స్ మరియు పారాలింపిక్స్ క్రీడలను ఈ దేశం నిర్వహించింది.

విభాగాలు: ప్రపంచ దేశాలు, బ్రెజిల్, దక్షిణ అమెరికా,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక