12, నవంబర్ 2017, ఆదివారం

కూసుమంచి మండలం (Kusumanchi Mandal)

జిల్లాఖమ్మం
జనాభా59971 (2011)
అసెంబ్లీ నియోపాలేరు  అ/ని
లోకసభ నియోఖమ్మం లో/ని
కూసుమంచి ఖమ్మం జిల్లాకు చెందిన మండలము. మండలంలో 17 ఎంపీటీసి స్థానాలు, 41 గ్రామపంచాయతీలు, 18 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ మండలం ఖమ్మం రెవెన్యూ డివిజన్, పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం, ఖమ్మం లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. నవంబరు 11, 2017న తెలంగాణ రాష్ట్ర డిజిపిగా బాధ్యతలు చేపట్టిన మహేందర్ రెడ్డి ఈ మండలమునకు చెందినవారు. మండలంలో భక్తరామదాసు ప్రాజెక్టు, పాలేరు జలాశయం ఉన్నాయి.

భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలం ఖమ్మం జిల్లా పశ్చిమం వైపున సూర్యాపేట జిల్లా సరిహద్దులో ఉంది. మండలానికి ఉత్తరాన తిరుమలాయపాలెం మండలం, తూర్పున ఖమ్మం గ్రామీణ మండలం, దక్షిణాన నేలకొండపల్లి మండలం, పశ్చిమాన సూర్యాపేట జిల్లా సరిహద్దులుగా ఉ

జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 59971. ఇందులో పురుషులు 30146, మహిళలు 29825.
 
రాజకీయాలు:
ఈ మండలం పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం, ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో భాగము.

కాలరేఖ:
  • 2016, ఆగస్టు 22: కూసుమంచి మండలం నాయకన్‌గూడెం వద్ద నాగార్జునసాగర్ ఎడమకాల్వలో బస్సు బోల్టాపడి 10 మంది మృతి
  • 2016, డిసెంబరు 31: ఎర్రగడ్డతండా వద్ద భక్తరామదాసు ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు
  • 2017, నవంబరు 11: ఈ మండలమునకు చెందిన మహేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర డిజిపిగా బాధ్యతలు చేపట్టారు.


ప్రముఖ గ్రామాలు / పట్టణాలు

కిష్టాపూర్ (Kistapur):
కిష్టాపూర్ ఖమ్మం జిల్లా కూసుమంచి మండలమునకు చెందిన గ్రామము. నవంబరు 11, 2017న తెలంగాణ రాష్ట్ర డిజిపిగా బాధ్యతలు చేపట్టిన మహేందర్ రెడ్డి ఈ గ్రామమునకు చెందినవారు.
కూసుమంచి (Kusumanchi):
కూసుమంచి ఖమ్మం జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. కూసుమంచి సమీపంలో వెయ్యేళ్ళ క్రితం కాకతీయ గణపతిదేవుడు నిర్మించిన కూసుమంచి శివాలయం ఉంది. పెద్దపెద్ద బండరాళ్లను ఒకదానిపై ఒకటి పెట్టి వాటిపై శిల్పులు తీర్చిదిద్దిన కళాఖండాలు ఉన్నాయి. సుమారు 55 అడుగుల ఎత్తయిన శివలింగం చెక్కబడి ఉంది.
పాలేరు (Paleru):
పాలేరు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలమునకు చెందిన గ్రామము. గ్రామంలో పాలేరు సరస్సు పర్యాటకంగా పేరుపొందింది.


ఇవి కూడా చూడండి:
  • కూసుమంచి శివాలయం,
  • పాలేరు సరస్సు,
  • మహేందర్ రెడ్డి (మాజీ డిజిపి),


ఫోటో గ్యాలరీ
c
c
c c


హోం
విభాగాలు: ఖమ్మం జిల్లా మండలాలు,  కూసుమంచి మండలము,
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Khammam Dist, 2016,
  • Handbook of Census Statistics, Khammam District, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 236 తేది: 11-10-2016 
  • ఖమ్మం జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర,
  • https://khammam.telangana.gov.in/te/ (Official Website of Khammam Dist)


Singareni Mandal in Telugu, Khammam Dist (district) Mandals in telugu, Khammam Dist Mandals in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక