20, అక్టోబర్ 2017, శుక్రవారం

రాజేంద్రనగర్ మండలం (Rajendranagar Mandal)

జిల్లా రంగారెడ్డి జిల్లా
రెవెన్యూ డివిజన్ రాజేంద్రనగర్
జనాభా307317 (2011)
అసెంబ్లీ నియోజకవర్గంరాజేంద్రనగర్
లోకసభ నియోజకవర్గంచేవెళ్ళ
రాజేంద్రనగర్ రంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం.44వ నెంబరు జాతీయ రహదారి, డోన్ రైలుమార్గం మండలం మీదుగా వెళ్ళుచున్నాయి. ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం (పాతపేరు ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం),  వినోబాభావే విడిది చేసిన శివరాంపల్లి, పారిశ్రామికవాడ కాటేదాన్ ఈ మండలంలో ఉన్నాయి. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా మండలకేంద్రం జిల్లా కేంద్రంగా మారింది.

సరిహద్దులు:
ఈ మండలం రంగారెడ్డి జిల్లాలో ఉత్తరంవైపున హైదరాబాదు జిల్లా సరిహద్దులో ఉంది. దక్షిణాన బాలాపూర్ మరియు శంషాబాద్ మండలాలు, పశ్చిమాన మొయినాబాద్ మండలం, వాయువ్యాన గండిపేట మండలం, ఉత్తరాన మరియు తూర్పున హైదరాబాదు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 188299. ఇందులో పురుషులు 98076, మహిళలు 90233. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 307317. ఇందులో పురుషులు 280974, మహిళలు 266474. అక్షరాస్యుల సంఖ్య 208860. పట్టణ జనాభా 282825, గ్రామీణ జనాభా 24492.

రవాణా సౌకర్యాలు:
దేశంలోనే అతి పొడవైన 44వ నెంబరు (పాతపేరు నెంబర్ 7) జాతీయ రహదారి మరియు సికింద్రాబాదు-డోన్ రైలుమార్గం మండలం మీదుగా వెళ్ళుచున్నాయి. బుద్వేల్‌లో రైల్వేస్టేషన్ ఉంది.

మండలంలోని గ్రామాలు:
అత్తాపూర్ (Attapur), బొంరుకుందౌలా (Bomrukundowla), బుద్వేల్ (Budwel), గగన్‌పహాడ్, (Gaganpahad), హైదర్‌గూడ (Hyderguda), కాటేదాన్ (Katedhan), లక్ష్మీగూడ (Lakshmiguda), మాదన్నగూడ (Madannaguda), మైలార్‌దేవ్‌పల్లి (Mailardevpally), పల్లెచెరువు (Pallecheruvu), ప్రేమవతిపేట్ (Premavathipet), సగ్‌బౌలి (Sagbowli), శివరాంపల్లి జాగీర్ (Shivarampally Jagir), శివరాంపల్లి పైగా (Shivarampally Paiga), సొగ్‌బౌలి (Sogbowli), ఉప్పరపల్లి (Upperpally)


ఫోటో గ్యాలరీ


విభాగాలు: రంగారెడ్డి జిల్లా మండలాలు,  రాజేంద్రనగర్  మండలము, రాజేంద్రనగర్  రెవెన్యూ డివిజన్, కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం, 
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Mahabubnagar Dist, 2008,
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 250 తేది: 11-10-2016


Tags:Rajendranagar Mandal in telugu, rangareddy Dist Mandals information in telugu, Jayashankar Agricultural University

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక