6, అక్టోబర్ 2017, శుక్రవారం

నార్కెట్‌పల్లి మండలం (Narketpally Mandal)

జిల్లానల్గొండ జిల్లా
జనాభా50962 (2011)
రెవెన్యూ డివిజన్నల్గొండ
అసెంబ్లీ నియో.నక్రేకల్ అ/ని,
లోకసభ నియో.భువనగిరి లో/ని,
నార్కెట్‌పల్లి నల్గొండ జిల్లాకు చెందిన మండలము. పూనా-విజయవాడ (9వ నెంబరు) జాతీయ రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. ఈ మండలం నల్గొండ రెవెన్యూ డివిజన్, నక్రేకల్ అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. చెర్వుగట్టులో శ్రీపార్వతీ జడల రామలింగేశ్వరాలయం, గోపలాయపల్లిలో శ్రీవారిజాల వేణుగోపాలస్వామి ఆలయం ఉన్నాయి. నార్కెట్ పల్లి ప్రాంతంలో వేల సంఖ్యలో ప్రాచీనకాలపు సమాధురాళ్ళు బయటపడ్డాయి. రాజకీయ నాయకులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరియు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ మండలానికి చెందినవారు.

భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలం నల్గొండ జిల్లా ఉత్తర భాగంలో యాదాద్రి భువనగిరి జిల్లా సరిహద్దులో ఉంది. తూర్పున శాలిగౌరారం మరియు కట్టంగూరు మండలాలు, దక్షిణాన నల్గొండ మండలం, పశ్చిమాన చిట్యాల మండలం, నైరుతిన మునుగోడ్ మండలం, ఉత్తరాన మరియు వాయువ్యాన యాదాద్రి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 46150, 2011 నాటికి జనాభా 4812 పెరిగి 50962 కు చేరింది. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 50962. ఇందులో పురుషులు 25988, మహిళలు 24974.

రవాణా సౌకర్యాలు:
65వ నెంబరు జాతీయ రహదారి (పాతపేరు NH-9) మరియు సికింద్రాబాదు గుంటూరు రైల్వేమార్గం మండలం గుండా వెళ్ళుచున్నాయి.
మండలంలోని గ్రామాలు:
అక్కినేనిపల్లి (Akkinepalli), అక్కినేనిపల్లివారి లింగోటం (Akkinepallivari Lingotam), అమ్మనబోలు (Ammanabolu), ఔరవాని (Auravani), బ్రాహ్మణ వెల్లంల (Brahmana Vellemla), చెర్వుగట్టు (Chervugattu), చిప్పలపల్లి (Chippalapalli), చౌడంపల్లి (Choudampally), మాడ యడవల్లి (Mada Yadavelli), మంద్ర (Mandra), నక్కలపల్లి (Nakkalapally), నార్కెట్‌పల్లి (Narketpally), నెమ్మని (Nemmani), పోతినేనిపల్లి (Pothinenipally), సబ్బిగూడెం (Sabbidigudem), షాపల్లి (Shapally), తిరుమలగిరి (Thirumalagiri), తొండల్వాయి (Thondalvai), ఎల్లారెడ్డిగూడ (Yellareddyguda)
downloaded from https://cckraopedia.blogspot.com


ప్రముఖ గ్రామాలు:
బ్రాహ్మణవెల్లంల (Brahmana Vellamla):
బ్రాహ్మణవెల్లంల నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలమునకు చెందిన గ్రామము. ప్రముఖ రాజకీయ నాయకులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరియు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ గ్రామానికి చెందినవారు.

ఇవి కూడా చూడండి:
  • కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,
  • కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,

ఫోటో గ్యాలరీ



విభాగాలు: నల్గొండ జిల్లా మండలాలు, నార్కెట్‌పల్లి మండలము,


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 245 తేది 11-10-2016
  • Handbook of Statistics, Nalgonda Dist, 2015-16



Tags:Nalgonda District Mandsls information in Telugu, Narketpally Mandal in Telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక