10, సెప్టెంబర్ 2017, ఆదివారం

ఉండవెల్లి మండలం (Undavelli Mandal)

జిల్లా జోగులాంబ గద్వాల జిల్లా
రెవెన్యూ డివిజన్గద్వాల
అసెంబ్లీ నియోజకవర్గంఆలంపూర్
లోకసభ నియోజకవర్గంనాగర్‌కర్నూల్
ఉండవెల్లి జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన మండలం. ఇది అక్టోబరు 11, 2016న కొత్తగా ఏర్పడింది.అదివరకు మానోపాడు మరియు ఆలంపూర్ మండలాలలో ఉన్న 15 గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని ఏర్పాతుచేశారు. 44వ నెంబరు జాతీయ రహదారి మరియు సికింద్రాబాదు-డోన్ రైలుమార్గం మండలం గుండా వెళ్ళుచున్నాయి. ఈ మండలం గద్వాల రెవెన్యూ డివిజన్, ఆలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. మండలం దక్షిణ సరిహద్దు గుండా తుంగభద్ర నది ఉత్తర సరిహద్దు గుండా కృష్ణానది ప్రవహిస్తున్నాయి. తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి ఈ మండలానికి చెందినవారు.

సరిహద్దులు:
ఈ మండలానికి తూర్పున ఆలంపూర్ మండలం, పశ్చిమాన మానోపాడ్ మండలం, ఉత్తరాన వనపర్తి జిల్లా, దక్షిణాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి. మండలం దక్షిణ సరిహద్దు గుండా తుంగభద్ర నది ఉత్తర సరిహద్దు గుండా కృష్ణానది ప్రవహిస్తున్నాయి.

మండలంలోని గ్రామాలు:
ఏ.బూర్దిపాడ్ (A.Burdipad), బస్వాపూర్ (Baswapur), భైరాపూర్ (Bhairapur), బొంకూర్ (Bonkur), చిన్న ఆముదాలపాడు (Chinna amudyala Padu), ఇటిక్యాలపాడు (Itkyalpadu), కలుగొట్ట (Kalgotla), కంచుపాడు (Kanchupadu), మారమునగాల (Maramunagala), మెన్నిపాడు (Mennipadu), ప్రాగటూరు (Pragatoor), పుల్లూర్ (Pullur), సేరిపల్లి (Seripalle), తక్కశిల (Thakkasila), ఉండవెల్లి (Undavelli)

ఇవి కూడా చూడండి:

విభాగాలు: జోగులాంబ గద్వాల జిల్లా మండలాలు,  ఉండవెల్లి మండలము, ఆలంపూర్ రెవెన్యూ డివిజన్, గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Mahabubnagar Dist, 2008,
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • మహబూబ్‌నగర్ జిల్లా సర్వస్వము (రచన- బి.ఎన్.శాస్త్రి),
  • బ్లాగు రచయిత పర్యటించి తెలుసుకున్న విషయాలు, 
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య (G.O.Ms.No) 244 తేది 11-10-2016

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక