2, జులై 2014, బుధవారం

నల్గొండ జిల్లా (Nalgonda Dist)

నల్గొండ జిల్లా
వైశాల్యం14,200 చకిమీ
జనాభా34,83,648
మండలాలు59
రెవెన్యూ డివిజన్లు5
నల్గొండ జిల్లా తెలంగాణా రాష్ట్రంలోని 10 జిల్లాలలో ఒకటి. జిల్లా పరిపాలన కేంద్రము నల్గొండ. ఉద్యమాల పురిటిగడ్డగా పేర్కొనే నల్గొండ జిల్లాలో ఎందరో దేశభక్తులు, స్వాతంత్ర్యసమరయోధులు, నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించిన పోరాటయోధులు జన్మించారు. రజాకార్లను ఎదిరించిన కోదాటి నారాయణరావు, ప్రముఖ గాంధేయవాది రావి నారాయణరెడ్డి, స్వాతంత్ర్య సమరయోధుడు పులిజాల రంగారావు, ఆర్యసమాజ ప్రముఖుడు నూతి విశ్వామిత్ర, కమ్యూనిస్టు యోధుడు బొమ్మగాని ధర్మభిక్షం, రజాకార్ల దురాగతాలను ఎదిరించిన ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, నిజాం వ్యతిరేక పోరాట యోధుడు కాసాని నారాయణ, ప్రముఖ సినీనటుడు కాంతారావు ఈ జిల్లాకు చెందినవారే. కృష్ణానది, డిండి నది, మూసి నది, పాలేరు నది జిల్లాలో ప్రవహించే ముఖ్య నదులు. పూణె-విజయవాడ జాతీయ రహదారి జిల్లా గుండా వెళ్ళుచున్నది. జిల్లా వైశాల్యం 14,200 చకిమీ. 2011 లెక్కల ప్రకారం జనాభా 34,83,648. రాష్ట్రంలోనే పెద్దదైన నాగార్జున సాగర్ ప్రాజెక్టు, ప్రముఖ అధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట, ప్రముఖమైన భువనగిరి, దేవరకొండ దుర్గాలు, ప్రాచీనమైన దేవాలయం కొలువైన పిల్లలమర్రి ఈ జిల్లాకు చెందినవి. జిల్లాలో 59 మండలాలు, 5 రెవెన్యూ డివిజన్లు, 12 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 లోకసభ నియోజకవర్గాలు ఉన్నాయి.

భౌగోళికం, సరిహద్దులు:
నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ సరిహద్దులో ఉంది. ఈ జిల్లాకు ఉత్తరాన వరంగల్ జిల్లా, తూర్పున ఖమ్మం జిల్లా, పశ్చిమాన రంగారెడ్డి జిల్లా మరియు మహబూబ్ నగర్ జిల్లాలు, దక్షిణాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి. జిల్లా వైశాల్యం 14,200 చదరపు కిలోమీటలు.

చరిత్ర:
నాగార్జునసాగర్ ప్రాజెక్టు
నల్గొండ జిల్లాలో పాతరాతియుగం నాటి వస్తువులెన్నో లభించాయి (నాగార్జునకొండ, ఏలేశ్వరం, ఇంద్రపాల నగరం, జానకీపురం, రాయగిరి, నార్కెట్ పల్లి, సిరిపురం తదితర ప్రాంతాలలో). నార్కెట్ పల్లి ప్రాంతంలో వేల సంఖ్యలో సమాధిరాళ్ళు కనిపిస్తాయి. దేవరకొండ సమీపంలోని హుముతాలపల్లిలో బూడిదకుప్పలు అసంఖ్యాకంగా ఉన్నాయి. ఏలేశ్వరం ప్రాంతంలో ఏనుగు ఆకారంలో తయారుచేసిన మృణ్మయ సమాధి పెట్టెలు ఉన్నాయి. రామాయణంలో పేర్కొనబడిన బదరికారణ్యం నల్గొండలోనిదేనని చరిత్రకారుల అభిప్రాయం. జీడికల్లులోని నీటి ఊట రామాయణ కాలం నాటిదేననే అభిప్రాయం ఉంది. బౌద్ధకాలం నాటి చైత్యాలు ఫణిగిరిలో లభించాయి. ఆనాటి జైన సంప్రదాయానికి పటంచెరు, కొలనుపాక నిలయాలు.

జనాభా:
2011 జనాభా గణాంకాల ప్రకారం జిల్లా జనాభా 34,83,648. ఇందులో పురుషులు 17,58,061, మహిళలు 17,25,587. జిల్లా అక్షరాస్యత శాతం 57.84%. 

విభాగాలు: తెలంగాణ జిల్లాలు, నల్గొండ జిల్లా,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక