3, ఏప్రిల్ 2014, గురువారం

తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం (Tungaturthy Assembly Constituency)

తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గ పరిధిలో 6 మండలాలున్నాయి. ఈ సెగ్మెంట్ భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. పునర్విభజనలో ఈ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది. ప్రముఖ తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు మల్లు స్వరాజ్యం ఇక్కడ నుంచి 2 సార్లు విజయం సాధించింది.
ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు:
  • తుంగతుర్తి, 
  • మోత్కూరు, 
  • తిరుమలగిరి, 
  • శాలిగౌరారం, 
  • జాజిరెడ్డిగూడెం, 
  • నూతన్‌కల్,
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1994 సంకినేని వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ

1999



2004 రాంరెడ్డి దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సంకినేని వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ
2009 ఎం.నర్సింహులు తెలుగుదేశం పార్టీ జి.నర్సయ్య కాంగ్రెస్ పార్టీ
2014 జి.కిశోర్ తెరాస ఎ.దయాకర్ కాంగ్రెస్ పార్టీ
2018 గ్యాదరి కిశోర్ తెరాస ఎ.దయాకర్ కాంగ్రెస్ పార్టీ

2004 ఎన్నికలు:
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన రాంరెడ్డి దామోదర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావుపై 13184 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినారు. దామోదర్ రెడ్డికి 68821 ఓట్లు రాగా, వెంకటేశ్వరరావుకు 55637 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు:
2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎం.నర్సింహులు తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జి.నర్సయ్యపై 12162 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాసకు చెందిన జి.కిశోర్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎ.దయాకర్ పై 2379 ఓట్ల మెజారిటితో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు.

2018 ఎన్నికలు:
2018 ఎన్నికలలో తెరాస తరఫున గ్యాదరి కిశోర్ కుమార్, భాజపా తరఫున కడియం రాంచంద్రయ్య, ప్రజాకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన అద్దంకి దయాకర్ పోటీచేశారు. తెరాసకు చెందిన గ్యాదరి కిశోర్ కుమార్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన అద్దంకి దయాకర్ పై 1847 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

విభాగాలు: నల్గొండ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, భువనగిరి లోకసభ నియోజకవర్గం, తుంగతుర్తి నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక