3, ఏప్రిల్ 2014, గురువారం

నక్రేకల్ అసెంబ్లీ నియోజకవర్గం (Nakrekal Assembly Constituency)

నక్రేకల్ అసెంబ్లీ నియోజకవర్గం నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గ పరిధిలో 6 మండలాలున్నాయి. ఈ సెగ్మెంట్ భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. పునర్విభజనలో ఈ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది.
ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు:
  • నకిరేకల్
  • రామన్నపేట, 
  • చిట్యాల, 
  • నార్కెట్‌పల్లి, 
  • కట్టంగూరు, 
  • కేతెపల్లి,
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2004 నోముల నరసింహయ్య సి.పి.ఎం. కటికం సత్తయ్య గౌడ్‌ తెలుగుదేశం పార్టీ
2009 టి.లింగయ్య కాంగ్రెస్ పార్టీ మామిడి నర్సయ్య సీపీఎం
2014 వీరేశం తెరాస టి.లింగయ్య కాంగ్రెస్ పార్టీ

2004 ఎన్నికలు:2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుండి సి.పి.ఎం. పార్టీకి చెందిన నోముల నరసింహయ్య తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కటికం సత్తయ్య గౌడ్‌పై 24222 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నర్సిహ్మయ్య 66999 ఓట్లు పొందగా, సత్తయ్య గౌడ్ 42777 ఓట్లు సాధించారు.

2009 ఎన్నికలు:
2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టి.లింగయ్య తన సమీప ప్రత్యర్థి, సీపీఎంకు చెందిన మామిడి నర్సయ్యపై 12176 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాసకు చెందిన వీరేశం తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన లింగయ్యపై 2370 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు.


విభాగాలు: నల్గొండ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, భువనగిరి లోకసభ నియోజకవర్గం, నక్రేకల్ నియోజకవర్గం,   

= = = = = 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక