2, ఏప్రిల్ 2014, బుధవారం

నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం (Nagarjunasagar Assembly Constituency)

నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. 2009 ఎన్నికల ముందు చేయబడిన పునర్విభజనలో ఇది ఇది కొత్తగా ఏర్పడింది. ఈ నియోజకవర్గ పరిధిలో 5 మండలాలున్నాయి. ఈ సెగ్మెంట్ నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది.
ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు:
  • గుర్రంపోడు,
  • పెద్దవూర,
  • అనుముల,
  • త్రిపురారం,
  • నిడమానూరు,
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 కుందూరు జానారెడ్డి కాంగ్రెస్ పార్టీ టి.చిన్నపరెడ్డి తెలుగుదేశం పార్టీ
2014 కుందూరు జానారెడ్డి కాంగ్రెస్ పార్టీ నర్సింహయ్య తెరాస
2018 నోముల నర్సింహయ్య తెరాస కుందూరు జానారెడ్డి కాంగ్రెస్ పార్

2009 ఎన్నికలు:
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, రాష్ట్ర మంత్రి కుందూరు జానారెడ్డి తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీకి చెందిన టి.చిన్నపరెడ్డిపై 234 ఓట్ల స్వల్ప ఆధిక్యతతో విజయం సాధించారు.

2014 ఎన్నికలు:
2014 శాసనసభ ఎన్నికలలో ఇక్కడి నుంచి సిటింగ్ ఎమ్మెల్యేగా పోటీచేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డి తన సమీప ప్రత్యర్థి, తెరాసకు చెందిన నర్సింహయ్యపై 16559 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

2018 ఎన్నికలు:
2018 ఎన్నికలలో తెరాస తరఫున నోముల నర్సిహ్మయ్య, భాజపా తరఫున కంకణాల నివేదిత, ప్రజాకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన కె.జానారెడ్డి పోటీచేశారు. తెరాసకు చెందిన నోముల నర్సిములు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన సింటింగ్ ఎమ్మెల్యే కుందూరు జానారెడ్డి పై 7726 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. డిసెంబరు 1, 2020న నోముల నర్సింహయ్య మరణించారు..

విభాగాలు: నల్గొండ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, నల్గొండ లోకసభ నియోజకవర్గం, నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక