1, ఏప్రిల్ 2014, మంగళవారం

ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం (Ibrahimpatnam Assembly Constituency)

ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం రంగారెడ్డి జిల్లాకు చెందిన 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ సెగ్మెంట్ భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది.

నియోజకవర్గ పరిధిలోని మండలాలు:
2009 నియోజకవర్గాల పునర్విభజన ఈ నియోజకవర్గం ప్రకారం పరిధిలో 4 మండలాలు కలవు.
  • ఇబ్రహీంపట్నం,
  • హయాత్‌నగర్‌,
  • మంచాల,
  • యాచారం,
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1999 కె.పుష్పలీల తెలుగుదేశం పార్టీ ఏ.జి.కృష్ణ కాంగ్రెస్ పార్టీ
2004 మస్కు నరసింహ సి.పి.ఎం. నర్రా రవికుమార్ తెలుగుదేశం పార్టీ
2009 ఎం.కిషన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మల్‌రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ
2014 ఎం.కిషన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మల్‌రెడ్డి రాంరెడ్డి ఇండిపెండెంట్
2018 ఎం.కిషన్ రెడ్డి తెరాస మల్‌రెడ్డి రంగారెడ్డి బీఎస్పీ

2009 ఎన్నికలు:
2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎం.కిషన్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టికి చెందిన మల్‌రెడ్డి రంగారెడ్డిపై 9216 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ప్రజారాజ్యం పార్టీ తరఫున టి.దేవేందర్ గౌ, భాజపా తరఫున పి.నర్సింహారెడ్డి పోటీచేశారు.

2014 ఎన్నికలు:
2014 శాసనసభ ఎన్నికలలో ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన సిటింగ్ ఎమ్మెల్యే ఎం.కిషన్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, ఇండిపెండెంటుగా పోటీచేసిన మల్‌రెడ్డి రాంరెడ్డీపై 11182 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

2018 ఎన్నికలు:
2018 ఎన్నికలలో తెరాస తరఫున మంచిరెడ్డి కిషన్ రెడ్డి, భాజపా తరఫున కొత్త అశోక్ గౌడ్, జనకూటమి తరఫున తెలుగుదేశం పార్టీకి చెందిన సామ రంగారెడ్డి పోటీచేశారు. తెరాసకు చెందిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, బీఎస్పీకి చెందిన మల్‌రెడ్డి రంగారెడ్డి పై 376 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

విభాగాలు: రంగారెడ్డి జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, భువనగిరి లోకసభ నియోజకవర్గం, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక