2, మార్చి 2014, ఆదివారం

మహబూబ్‌నగర్ పురపాలక సంఘము (Mahabubnagar Muncipality)

మహబూబ్‌నగర్ పురపాలక సంఘము
స్థాపన1952
జిల్లామహబూబ్‌నగర్
వార్డులు41
చైర్మెన్రాధా అమర్
మహబూబ్‌నగర్ పట్టణ పాలక సంస్థ అయిన మహబూబ్‌నగర్ పురపాలక సంఘము జిల్లాలోని 11 పురపాలక/నగర పంచాయతీలలో పెద్దది. 1952లో మూడవశ్రేణి పురపాలక సంఘంగా ఏర్పడింది. 1959లో రెండోగ్రేడుగా, 1983లో మొదటి గ్రేడుగా, 2004లో స్పెషల్ గ్రేడుగా అప్‌గ్రేడ్ చెందింది. 2012లో సమీపంలోని 10 పంచాయతీలు ఈ పురపాలక సంఘం పరిధిలో చేర్చి సెలెక్షన్ గ్రేడు పురపాలక సంఘంగా మార్చారు. దీన్ని నగరపాలక సంస్థగా చేయాలనే ప్రతిపాదనను కూడా ప్రభుత్వానికి పంపిననూ వాస్తవరూపం దాల్చలేదు. ప్రస్తుతం పురపాలక సంఘంలో 41 వార్డూలున్నాయి. ఈ పురపాలక సంఘంలో కౌన్సిలర్లుగా, చైర్మెన్లుగా పనిచేసిన పలువురు తదనంతర కాలంలో శాసనసభ్యులుగా, మంత్రులుగా, పార్టీ జిల్లా అధ్యక్షులుగా రాణించారు.

చరిత్ర:
ఈ పురపాలక సంఘానికి పెద్ద శంకర్ రావు తొలి చైర్మెన్‌గా పనిచేశారు. రెండో చైర్మెన్‌గా పనిచేసిన స్వాతంత్ర్య సమరయోధుడు ఆర్.శ్రీనివాసరావు పాలమూరు పురపాలక సంఘం పితామహుడిగా పరిగణించబడతారు. ఆ తర్వాత చైర్మెన్‌గా పనిచేసిన ఇబ్రహీం అలీ అన్సారి రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. పురపాలక సంఘం స్వర్ణోత్సవాల సమయంలో చైర్మెన్‌గా ఉన్న ముత్యాల ప్రకాష్ డీసిసి అధ్యక్షులుగా పనిచేశారు. కౌన్సిలర్‌గా పనిచేసిన పి.చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీ తరఫున 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడమే కాకుండా రాష్ట్ర మంత్రిగానూ బాధ్యతలు చేపట్టారు.

జనాభా:
పురపాలక సంఘం పరిధిలో 2001 నాటికి జనాభా 130986 కాగాం 2011 నాటికి 157902కు పెరిగింది.

ఆదాయము:
2010-11 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ సంఘం ఆదాయం 703.70 లక్షలు, వ్యయము 603.28 లక్షలు.

ప్రస్థానం:
1952లో 15 వార్డులతో ఏర్పడిన పాలమూరు పురపాలక సంఘం అప్పట్లో మూడవ గ్రేడు పురపాలక సంఘంగా ఉండేది. 1959లో రెండవ గ్రేడు హోదా పొందింది. 1983లో ప్రథమ శ్రేణి గ్రేడు పొంది 2004లో స్పెషన్ గ్రేడ్ హోదాకు అప్‌గ్రేడ్ చేయబడింది. 2012 నాటికి 38 వార్డులు ఉండగా సమీపంలోని 10 గ్రామపంచాయతీలను విలీనం చేయడంతో విస్తీర్ణం, జనాభా పెరగడమే కాకుండా వార్డూల సంఖ్య కూడా పెరిగి 41కు చేరింది.

ఈ పురపాలక సంఘానికి 1952లో తొలిసారిగా ఎన్నికలు జరుగగా కాంగ్రెస్ పార్టికి చెందిన శంకర్ రావు తొలి చైర్మెన్‌గా ఎన్నికయ్యారు. అప్పటినుంచి 10 సార్లు ఎన్నికలు జరిగాయి. 2014, మార్చి 30న మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 

2000 ఎన్నికలు: 
2000లో జరిగిన పురపాలక సంఘం ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ 9 స్థానాలలో విజయం సాధించగా, కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలలో గెలుపొందినది. భారతీయ జనతాపార్టీ 6, ఎంఐఎం 2, ఇతరులు 7 స్థానాలలో విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముత్యాల ప్రకాష్ చైర్మెన్‌గా ఎన్నికైనారు. వీరి హయంలోనే 2002లో పాలమురు పురపాలక సంఘం స్వర్ణోత్సవాలు జరుపుకుంది.

2005 ఎన్నికలు:
2005 అక్టోబరులో జరిగిన పురపాలక సంఘం ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ సీట్లు రాగా ఒబేదుల్లా కొత్వాల్ చైర్మెన్‌గా, పులి అంజనమ్మ వైస్-చైర్మెన్‌గా ఎన్నికయ్యారు.

2014 ఎన్నికలు:
2014 మార్చి 30న ఎన్నికలు జరుగగా మే 12న కౌంటింగ్ జరిగింది. 41 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ 14, తెలంగాణ రాష్ట్ర సమితి 7, భారతీయ జనతాపార్టీ 6, ఎంఐఎం 6, తెలుగుదేశం పార్టీ 3, వైకాపా 1. ఇతరులు 4 స్థానాలలో విజయం సాధించాయి.

Mahabubnagar Muncipality Councilors names
వార్డు సంఖ్య , కౌన్సిలర్ పేరు. వార్డు సంఖ్య , కౌన్సిలర్ పేరు.
  • 1. ఆంజనేయులు
  • 2. కె.జ్యోతి
  • 3. కె.వనజ
  • 4. శివశంకర్
  • 5. రవికిషన్ రెడ్డి
  • 6. పి.అనిత
  • 7. విఠల్ రెడ్డి
  • 8. కనీస్ సుల్తానా
  • 9. రెహ్మాన్ ఉన్నీసాబేగం
  • 10. ముజమిల్ మొయినుద్దీన్
  • 11. మహ్మద్ అలీ
  • 12. ప్రసన్న
  • 13. యశోధ
  • 14. రతంగ్ పాండురెడ్డి
  • 15. ఫరీదాబేగం
  • 16. అబ్దుల్ రశీద్
  • 17. జీబా ఫాతిమా
  • 18. అక్తార్ బేగం
  • 19. లింగమయ్య
  • 20. అలివేలమ్మ
  • 21. పద్మజ
  • 22. ఎస్.పద్మ
  • 23. బాలీశ్వర్
  • 24. బి.కల్పన
  • 25. అబ్దుల్ హాదీ
  • 26. కె.రాములు
  • 27. అజీదాబేగం
  • 28. శౌకత్ అలీ
  • 29.  అలివేలు
  • 30. శ్రావణి
  • 31. రేష్మాబేగం
  • 32. కె.నర్సింహ
  • 33. కిష్ట్యానాయక్
  • 34. శరత్ చంద్ర
  • 35. ఖాజాపాషా
  • 36. రాషద్ ఖాన్
  • 37. కృష్ణమోహన్
  • 38. రాధా అమర్
  • 39. లక్ష్మణ్ యాదవ్
  • 40. గంజి ఎంకన్న
  • 41. ఎ.జంగమ్మ


విభాగాలు: మహబూబ్‌నగర్ పట్టణం, మహబూబ్‌నగర్ జిల్లా పురపాలక సంఘాలు, తెలంగాణ పురపాలక సంఘాలు, 


 = = = = =



Tags: Mahabubnagar Muncipality, Palamuru Muncipality, 2014 Muncipality Councilors names,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక