3, సెప్టెంబర్ 2013, మంగళవారం

బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గం (Banswada Assembly Constituency)

బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గం నిజామాబాదు జిల్లాకు చెందిన 9 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గ పరిధిలో 5 మండలాలు కలవు. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ జహీరాబాదు లోకసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది.

నియోజకవర్గ పరిధిలోని మండలాలు:
2009 నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఈ నియోజకవర్గం పరిధిలో 4 మండలాలు కలవు.
  • బాన్సువాడ, 
  • బిర్కూరు, 
  • కోటగిరి, 
  • వర్ని,

సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1952



1957 యల్లాప్రగడ సీతాకుమారి కాంగ్రెస్ పార్టీ

1962



1967



1972



1978



1983



1985



1989



1994 పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలుగుదేశం పార్టీ

1999 పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలుగుదేశం పార్టీ

2004 బాజిరెడ్డి గోవర్థన్ కాంగ్రెస్ పార్టీ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలుగుదేశం పార్టీ
2009 పోచారం శ్రీనివాస్ రెడ్డితెలుగుదేశం పార్టీ బాజిరెడ్డి గోవర్థన్ కాంగ్రెస్ పార్టీ
2011* పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి సంగెం శ్రీనివాసగౌడ్ కాంగ్రెస్ పార్టీ
2014 పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి బాల్‌రాజ్ కాంగ్రెస్ పార్టీ
2018 పోచారం శ్రీనివాస్ రెడ్డి తెరాస కాసుల బాలరాజు కాంగ్రెస్ పార్టీ

2009 ఎన్నికలు:
2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టి అభ్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ పై 26103 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. పోచారంకు 69వేల ఓట్లు రాగా, బాజిరెడ్డికి 43 వేల ఓట్లు లభించాయి. తెలంగాన ఉద్యమ నేపథ్యంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీకి, పదవికి రాజీనామా చేసి 2011 ఉప ఎన్నికలలో తెరాస తరఫున పోటిచేసి విజయం సాధించారు.

2011 ఉప ఎన్నికలు:
2011 ఉప ఎన్నికలలో 2009లో విజయం సాధించి రాజీనామా చేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి తెరాస తరఫున పోటీచేసి, సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సంగెం శ్రీనివాస్ గౌడ్ పై 49,889 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికలలో భాజపా తెరాసకు మద్దతు ఇవ్వగా, తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు.

2014 ఎన్నికలు:
2014 శాసనసభ ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాసకు చెందిన సిటింగ్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన బాల్‌రాజ్‌పై 24168 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి 5వ సారి ఎమ్మెల్యే అయ్యారు.

2018 ఎన్నికలు:
2018 ఎన్నికలలో తెరాస తరఫున పోచారం శ్రీనివాస్ రెడ్డి, భాజపా తరఫున నాయుడు ప్రకాశ్, జనకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన కాసుల బాలరాజు పోటీచేశారు. తెరాసకు చెందిన పోచారం శ్రీనివాస్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన కాసుల బాలరాజు పై 18485 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

విభాగాలు: నిజామాబాదు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, జహీరాబాదు లోకసభ నియోజకవర్గం, బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక