19, ఆగస్టు 2013, సోమవారం

కొప్పుల ఈశ్వర్ (Koppula Eeshwar)

 కొప్పుల ఈశ్వర్
స్వస్థలంకుమ్మరికుంట
జిల్లాపెద్దపల్లి జిల్లా
పదవులు2 సార్లు ఎమ్మెల్యే
నియోజకవర్గంమేడారం అ/ని, ధర్మపురి అ/ని,
కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. జూలపల్లి మండలం కుమ్మరికుంట గ్రామానికి చెందిన ఈశ్వర్ తండ్రి సింగరేణి ఉద్యోగి కావడంతో గోదావరిఖనిలో స్థిరపడ్డారు. 1977-84 వరకు సిపిఐ (చండ్రపుల్లారెడ్డి వర్గం) అనుబంధ కార్మిక సంఘంలో పనిచేశారు.2004లో తొలిసారిగా మేడారం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో పదవికి రాజీనామా సమర్పించి 2008లో జరిగిన ఉప ఎన్నికలలో పోటీచేసి విజయం సాధించారు.

నియోజకవర్గాల పునర్విభజనలో మేడారం స్థానం రద్దు కావడంతో 2009లో కొత్తగా ఏర్పడిన  తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున ధర్మపురి నుంచి పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, జిల్లా పరిషత్తు చైర్మెన్ అయిన ఎ.లక్ష్మణ్ కుమార్‌పై విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో మరోసారి రాజీనామా చేసి 2010 ఉప ఎన్నికలలో మళ్ళీ గెలుపొందినారు. 2014 ఎన్నికలలో మళ్ళీ తెరాస తరఫున ధర్మపురి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. డిసెంబరు 13, 2014న చీఫ్ విప్‌గా నియమితులైనారు.



విభాగాలు: కరీంనగర్ జిల్లా రాజకీయ నాయకులు, జూలపల్లి మండలము, మేడారం అసెంబ్లీ నియోజకవర్గం, ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం, 12వ శాసనసభ సభ్యులు, 13వ శాసనసభ సభ్యులు


 = = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక