14, జూన్ 2013, శుక్రవారం

చిత్తూరు లోకసభ నియోజకవర్గం (Chittore Loksabha Constituency)

చిత్తూరు లోకసభ నియోజకవర్గం
జిల్లాచిత్తూరు
ప్రస్తుత ఎంపిఎన్.రెడ్డప్ప
పార్టీవైకాపా


ఆంధ్రప్రదేశ్ లోని 25 లోకసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోకసభ నియోజకవర్గంలో చిత్తూరు జిల్లాకు చెందిన 7 అసెంబ్లీ నియోజకవర్గ సెగ్మెంట్లు ఉన్నాయి. 2019లో జరిగిన 17వ లోకసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి వైకాపాకు చెందిన ఎన్.రెడ్డప్ప ఎన్నికయ్యారు.


దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
  1. చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం
  2. నగరి అసెంబ్లీ నియోజకవర్గం
  3. గంగాధరనెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్సీ)
  4. చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం
  5. పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్సీ)
  6. పలమనేరు అసెంబ్లీ నియోజకవర్గం
  7. కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు 

లోక్‌సభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ
1వ 1952-57 టి.ఎన్.విశ్వనాథరెడ్డి కాంగ్రెస్ పార్టీ
2వ 1957-62 మాడభూషి అనంతశయనం అయ్యంగారు కాంగ్రెస్ పార్టీ
3వ 1962-67 ఎన్.జి.రంగా స్వతంత్ర
4వ 1967-71 ఎన్.పి.సి.నాయుడు కాంగ్రెస్ పార్టీ
5వ 1971-77 పి.నరసింహారెడ్డి కాంగ్రెస్ పార్టీ
6వ 1977-80 పి.రాజగోపాల నాయుడు కాంగ్రెస్ పార్టీ
7వ 1980-84 పి.రాజగోపాల నాయుడు కాంగ్రెస్ పార్టీ
8వ 1984-89 ఎన్.పి.ఝాన్సీ లక్ష్మి తెలుగుదేశం పార్టీ
9వ 1989-91 ఎమ్.జ్ఞానేంద్రరెడ్డి కాంగ్రెస్ పార్టీ
10వ 1991-96 ఎమ్.జ్ఞానేంద్రరెడ్డి కాంగ్రెస్ పార్టీ
11వ 1996-98 నూతనకల్వ రామకృష్ణరెడ్డి తెలుగుదేశం పార్టీ
12వ 1998-99 నూతనకల్వ రామకృష్ణరెడ్డి తెలుగుదేశం పార్టీ
13వ 1999-04 నూతనకల్వ రామకృష్ణరెడ్డి తెలుగుదేశం పార్టీ
14వ 2004-09 డి.కె.ఆదికేశవులు తెలుగుదేశం పార్టీ
15వ 2009-14 ఎన్.శివప్రసాద్ తెలుగుదేశం పార్టీ
16వ 2014-19 ఎన్.శివప్రసాద్ తెలుగుదేశం పార్టీ
17వ 2019- ఎన్.రెడ్డప్ప వైకాపా


2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన ఎన్.శివప్రసాద్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన ఎం.తిప్పేస్వామిపై 10,813 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. శివప్రసాద్‌కు 434065 ఓట్లు రాగా, తిప్పేస్వామికి 428252 ఓట్లు లభించాయి. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి టి.మనోహర్ 3వ స్థానంలో నిలిచారు.

2019 ఎన్నికలు:
2019 ఎన్నికలలో ఇక్కడి నుంచి వైకాపాకు చెందిన ఎన్.రెడ్డప్ప తన సమీప ప్రత్యర్థి, సిటింగ్ ఎంపీ అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన ఎన్.శివప్రసాద్ పై 1,37,271 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వైకాపా అభ్యర్థికి 6,86,792 ఓట్లు రాగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 5,49,521 ఓత్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన చీమల రంగప్ప 24,643 ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు.



హోం,
విభాగాలు: చిత్తూరు జిల్లా నియోజకవర్గాలు, చిత్తూరు లోకసభ నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్ లోకసభ నియోజకవర్గాలు




 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక