9, మే 2013, గురువారం

పాతమొల్గర (Pathamolgara)

 పాతమొల్గర గ్రామము
గ్రామముపాతమొల్గర 
మండలముభూత్పూర్
జిల్లామహబూబ్‌నగర్
జనాభా1171 (2011)
1134 (2001)
పాతమొల్గర మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1171. గ్రామ పరిధిలో 214 ఎకరాల ఆయకట్టు ఉన్న చింతలచెరువు ఉంది. 2015 మార్చిలో మిషన్ కాకతీయలో భాగంగా చెరువు పునరుద్దరణకు నిధులు విడుదలైనాయి. ఈ గ్రామంలో గీతకార్మికులు అధికంగా ఉన్నారు.

భౌగోళికం, సరిహద్దులు:
ఈ గ్రామానికి ఉత్తరాన కొత్తమొల్గర, తూర్పున మద్దిగట్ల, పశ్చిమాన కప్పెట, దక్షిణాన ఘన్‌పూర్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1134. ఇందులో పురుషులు 553, మహిళలు 581. గృహాల సంఖ్య 246.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1171. ఇందులో పురుషులు 593, మహిళలు 578. గృహాల సంఖ్య 253. అక్షరాస్యత శాతం 51.75%. గ్రామ కోడ్ సంఖ్య 575554.

రవాణా సౌకర్యాలు:
ఈ గ్రామం మీదుగా ఎలాంటి ప్రధాన రహదారులు లేవు. అయిననూ 44వ నెంబరు జాతీయ రహదారి మరియు మహబూబ్‌నగర్-శ్రీశైలం రహదారి సమీపం నుంచి వెళ్ళుచున్నాయి. 2007లో ఈ గ్రామానికి బస్సు సౌకర్యం ప్రారంభమైంది.

రాజకీయాలు:
2006 సర్పంచి ఎన్నికలలో చిన్న కృష్ణయ్య (తెలుగుదేశం పార్టీ మద్దతు) గెలుపొందినారు. 2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో సర్పంచిగా బి.శ్రీనివాసులు గౌడ్ ఎన్నికయ్యారు.

విద్యాసంస్థలు:
గ్రామంలో ఒక మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల, ఒక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఉన్నాయి.

విభాగాలు: భూత్పూర్ మండలంలోని గ్రామాలు


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist 2001,
  • Census Statistics, Mahabubnagar Dist, 2011,
  • బ్లాగురచయిత పర్యటించి తెలుసుకున్న, సేకరించిన విషయాలు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక