8, మే 2013, బుధవారం

కప్పెట (Kappeta)

 కప్పెట గ్రామము
గ్రామముకప్పెట 
మండలముభూత్పూర్
జిల్లామహబూబ్‌నగర్
జనాభా1668 (2011)
1332 (2001)
కప్పెట మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలమునకు చెందిన గ్రామము. 2011 ప్రకారం గ్రామ జనాభా 1668. ఇది పంచాయతి కేంద్రము.

భౌగోళికం, సరిహద్దులు:
ఈ గ్రామానికి తూర్పున కొత్తమొల్గర, పాతమొల్గర, ఉత్తరాన గోపాలపూర్, పశ్చిమాన రావులపల్లి, వాయువ్యాన పోతులమడుగు గ్రామాలు, దక్షిణాన ఘన్‌పూర్ మండలం, నైరుతిన అడ్డాకల్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1332. ఇందులో పురుషులు 662, మహిళలు 670. గృహాల సంఖ్య 259.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1668. ఇందులో పురుషులు 851, మహిళలు 817. గృహాల సంఖ్య 353. అక్షరాస్యత శాతం 49.46%. గ్రామ కోడ్ సంఖ్య 575553.

రవాణా సౌకర్యాలు:
ఈ గ్రామం మీదుగా ఎలాంటి ప్రధాన రహదారి లేదు. అయిననూ 44వ నెంబరు జాతీయ రహదారి మరియు మహబూబ్‌నగర్-శ్రీశైలం రహదారులు సమీపం నుంచి వెళ్ళుచున్నాయి.

రాజకీయాలు:
2006 సర్పంచి ఎన్నికలలో హెచ్.బుచ్చయ్య (ఇండిపెండెంట్) గెలుపొందినారు. 2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో సర్పంచిగా టి.మాధవి ఎన్నికయ్యారు.

విద్యాసంస్థలు:
గ్రామంలో ఒక మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల, ఒక మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల కలవు.

విభాగాలు: భూత్పూర్ మండలంలోని గ్రామాలు


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist 2001,
  • Census Statistics, Mahabubnagar Dist, 2011,
  • బ్లాగురచయిత పర్యటించి తెలుసుకున్న, సేకరించిన విషయాలు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక