6, ఫిబ్రవరి 2013, బుధవారం

చిన్నచింతకుంట మండలము (China Chintakunta Mandal)

జిల్లా మహబూబ్ నగర్
రెవెన్యూ డివిజన్ నారాయణపేట
జనాభా44548 (2001),
50055 (2011)
అసెంబ్లీ నియోజకవర్గందేవరకద్ర
లోకసభ నియోజకవర్గంమహబూబ్‌నగర్
పర్యాటక ప్రాంతాలుకురుమూర్తి,
ముఖ్య పంటలువరి, ప్రత్తి
మండల ప్రముఖులుసీతాదయాకర్ రెడ్డి,
చిన్నచింతకుంత మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మండలము. ఇది నారాయణపేట రెవెన్యూ డివిజన్‌, దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగము. జిల్లాపరిషత్తు చైర్మెన్‌గా పనిచేసి, ప్రస్తుతం దేవరకద్ర ఎమ్మెలేగా ఉన్న సీతాదయాకర్ రెడ్డి ఈ మండలమునకు చెందినవారు. మండలంలో 19 గ్రామపంచాయతీలు, 23 రెవెన్యూ గ్రామాలున్నాయి. జిల్లాలో ప్రముఖమైన కురుమూర్తి శ్రీవెంకటేశ్వరాలయం ఈ మండలంలోనే ఉంది. నిజాంపోరాటంలో ప్రసిద్ధిచెందిన అప్పంపల్లి గ్రామం మండలానికి చెందినదే. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 50055.

మండల సరిహద్దులు:
చిన్నచింతకుంట మండలానికి తూర్పున దేవరకద్ర, కొత్తకోట మండలాలు, పశ్చిమాన నర్వ మండలం, దక్షిణాన ఆత్మకూరు మండలం, ఉత్తరాన ధన్వాడ మండలం సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 44548. ఇందులో పురుషులు 21853, మహిళలు 22695. మండలంలోని పెద్ద గ్రామాలు చిన్నచింతకుంట, ఉండ్యాల, దుప్పల్లి, లాల్‌కోట, ఫరీద్‌పూర్, వడ్డేమాన్.

2011 లెక్కల ప్రకారం మండల జనాభా 50055. ఇందులో పురుషులు 24718, మహిళలు 25337. పట్టణ జనాభా 5469, గ్రామీణ జనాభా 44586. జనాభాలో ఇది జిల్లాలో 47వ స్థానంలో ఉంది. స్త్రీపురుష నిష్పత్తిలో (1025/వెయ్యి పురుషులకు) ఈ మండలం జిల్లాలో ప్రథమ స్థానంలో ఉంది.

రవాణా సౌకర్యాలు:
హైదరాబాదు-రాయచూరు ప్రధాన రహదారి మండలంలోని ఉత్తరభాగం నుంచి వెళ్ళుచున్నది. మండలానికి రైలు సౌకర్యం లేదు కాని మండలం సమీపంలో నుంచి కొత్తకోట మరియు దేవరకద్ర మండలాల పై నుంచి రైల్వే లైన్ ఉంది. కురుమూర్తి పేరుతో రైల్వేస్టేషన్ ఉంది కాని ఇది దేవరకద్ర మండలంలో ఉంది. నిర్మాణంలో ఉన్న దేవరకద్ర-రాయచూరు రైల్వేలైన్ మండలం గుండా వెళ్ళుతుంది.

దేవరకద్ర నియోజకవర్గంలో
చిన్నచింతకుంట మండల స్థానం (పసుపురంగు)
రాజకీయాలు:
  • ఈ మండలము దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగము. 2006 జడ్పీటీసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వావిళ్ళ వెంకటేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. 
  • 2014 జడ్పీటీసి ఎన్నికల్లఓ ఐదుగురు పోటీచేశారు. తెరాసకు చెందిన లక్ష్మీ 885 ఓట్ల మెజారిటితో సమీప కాంగ్రెస్ పార్టీకి చెందిన అంజమ్మపై గెలుపొందారు. లక్ష్మీకి 8856 ఓట్లు, అంజమ్మకు 7971 ఓట్లు, తెదేపాకు చెందిన పుణ్యవతికి 5417 ఓట్లు లభించాయి. 
  • 2014లో జరిగిన ఎంపీటీసి ఎన్నికలలో 15 స్థానాలకుగాను కాంగ్రెస్ పార్టీ 5, తెరాస 5, తెదేపా 3, ఇండిపెండెంట్లు ముగ్గురు గెలుపొందారు.

విద్యాసంస్థలు:
2008-09 నాటికి మండలంలో 30 ప్రాథమిక పాఠశాలలు (26 మండల పరిషత్తు, 4 ప్రైవేట్), 8 ప్రాథమికోన్నత పాఠశాలలు (7 మండల పరిషత్తు, 1 ప్రైవేట్), 10 ఉన్నత పాఠశాలలు (1 ప్రభుత్వ, 7 జడ్పీ, 2 ప్రైవేట్), ఒక  ప్రైవేట్ జూనియర్ కళాశాల ఉన్నది.

వ్యవసాయం, నీటిపారుదల:
మండలం మొత్తం విస్తీర్ణం 20847 హెక్టార్లలో 49% భూమి వ్యవసాయ యోగ్యంగా ఉన్నది. మండలంలో పండించే ప్రధాన పంట వరి, ప్రత్తి. కందులు, వేరుశనగ కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 496 మిమీ. మండలంలో సుమారు 2600 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది.

చిన్నచింతకుంట మండలంలోని గ్రామపంచాయతీలు
1.అప్పంపల్లి8.తిర్మలాపూర్15.బందర్‌వెల్లి
2.అమ్మాపూర్9.దమగ్నాపూర్16.మచ్చింతల
3.అల్లిపూర్10.దాసరపల్లి17.మద్దూరు
4.ఉంద్యాల11.దూప్పల్లి18.లాల్‌కోట
5.కురుమూర్తి12.నెల్లికొండి19.వడ్డేమాన్
6.గూడూరు13.పల్లమర్రి
7.చిన్నచింతకుంట14.ఫరీద్‌పూర్


విభాగాలు: మహబూబ్ నగర్ జిల్లా మండలాలు,  చిన్నచింతకుంట మండలము, నారాయణపేట రెవెన్యూ డివిజన్, దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • తెలుగు వికీపీడియా,
  • ఆంగ్ల వికీపీడియా,
  • Handbook of Statistics, Mahabubnagar Dist, 2008,
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011. 
  • మహబూబ్‌నగర్ జిల్లా సర్వస్వము (రచన- బి.ఎన్.శాస్త్రి),
  • బ్లాగు రచయిత పర్యటించి తెలుసుకున్న విషయాలు,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక