24, జనవరి 2013, గురువారం

నాగర్ కర్నూల్ మండలము (Nagar Kurnool Mandal)

జిల్లా నాగర్‌కర్నూల్
రెవెన్యూ డివిజన్ నాగర్ కర్నూల్
జనాభా68538 (2001)
74692 (2011)
అసెంబ్లీ నియోజకవర్గంనాగర్ కర్నూల్
లోకసభ నియోజకవర్గంనాగర్ కర్నూల్
పర్యాటక ప్రాంతాలు
ముఖ్య పంటలుమొక్కజొన్న
మండల ప్రముఖులుకూచుకుళ్ళ దామొదర్ రెడ్డి,
వీఎన్ గౌడ్,
నాగర్ కర్నూల్ నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన మండలము. ప్జడ్పీ చైర్మెన్ గా పనిచేసిన కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి, 3 సార్లు ఎమ్మెల్యేగా అన్నికైన వీఎన్ గౌడ్, ప్రముఖ పాలమూరు జిల్లా కవి కపిలవాయి లింగమూర్తి, విమోచనోద్యమకారులు పాపయ్య పర్సా, పెంటమరాజు సుదర్శనరావు, పాలెంను అభివృద్ధి పర్చిన తోటపల్లి సుబ్రహ్మణ్యశర్మ, రచయిత పెంటమరాజు నరసింగరావు ఈ మండలమునకు చెందినవారు. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 74692. పాలెంలో వ్యవసాయ పరిశోధన కేంద్రం ఉంది. మండలంలో 25 రెవెన్యూ గ్రామాలు, 20 గ్రామపంచాయతీలున్నాయి. మండల పరిధిలోని ఎండబెట్ల, భీమారం, శ్రీపురంలలో పురాతనమైన దేవాలయాలున్నాయి. మండల కేంద్రం నాగర్ కర్నూల్ రెవెన్యూ డివిజన్, అసెంబ్లీ, లోకసభ నియోజకవర్గాలకు కేంద్రంగా ఉంది. మండల పరిధిలోని ఎండబెట్ల, భీమారం, శ్రీపురంలలో పురాతనమైన దేవాలయాలున్నాయి.

సరిహద్దులు:
ఈ మండలమునకు ఉత్తరమున తాడూరు మండలము, తూర్పున టెల్కపల్లి మండలము, దక్షిణాన పెద్దకొత్తపల్లి, గోపాలపేట మండలములు, పశ్చిమాన బిజినేపల్లి మండలము సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 68538. ఇందులో పురుషులు 34960, మహిళలు 33578.
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 74692. ఇందులో పురుషులు 37731, మహిళలు 36961. పట్టణ జనాభా 26759, గ్రామీణ జనాభా 47933. జనాభాలో ఇది జిల్లాలో 9వ స్థానంలో ఉంది.

రవాణా సౌకర్యాలు:
మహబూబ్ నగర్ నుంచి శ్రీశైలం వెళ్ళు రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. మండల కేంద్రం నుంచి కొల్లాపూర్, కల్వకుర్తి, గోపాలపేట్ లకు కూడా రహదారి సౌకర్యం ఉంది.

చరిత్ర:
నాగర్‌కర్నూల్  పూర్వనామం నాగనవోలు. 1883 వరకు ఈ పట్టణం జిల్లా కేంద్రంగా పనిచేసింది. నాగన, కందన సోదరులు ఈ ప్రాంతాన్ని పాలించారు.వారి పేరిట ఈ పట్టణానికి ప్రస్తుతనామం వచ్చినట్లు కథనం ప్రచారంలో ఉంది.

నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో
నాగర్ కర్నూల్ మండల స్థానం (ఎరుపు రంగు)
రాజకీయాలు:
ఈ మండలము నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2006 జడ్పీటీసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వెంకటేశ్వరం మణెమ్మ విజయం సాధించారు.

విద్యాసంస్థలు:
2008-09 నాటికి మండలంలో 54 ప్రాథమిక పాఠశాలలు (1 ప్రభుత్వ, 34 మండల పరిషత్తు, 4 ప్రైవేట్ ఎయిడెడ్, 15 ప్రైవేట్ అన్-ఎయిడెడ్), 20 ప్రాథమికోన్నత పాఠశాలలు (10 మండల పరిషత్తు, 10 ప్రైవేట్ అన్-ఎయిడెడ్), 30 ఉన్నత పాఠశాలలు (3 ప్రభుత్వ, 9 జడ్పీ, 3 ప్రైవేట్ ఎయిడెడ్, 15 ప్రైవేట్ అన్-ఎయిడెడ్), 8 జూనియర్ కళాశాలలు (2 ప్రభుత్వ, 6 ప్రైవేట్) ఉన్నవి.

వ్యవసాయం, నీటిపారుదల:
మండలంలో పండించే ప్రధాన పంట మొక్కజొన్న. ప్రత్తి, వరి, వేరుశనగ, జొన్నలు కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 628 మిమీ. మండలంలో సుమారు 1800 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది.

కాలరేఖ:
  • 1972: నాగర్‌కర్నూలులో కొత్త బస్టాండు ప్రారంభమైంది.
  • 1979 మార్చి 10: పుట్టపర్తి సాయిబాబా పట్టణానికి విచ్చేసి సాయిబాబా విగ్రహ ప్రతిష్ట చేశారు.
  • 2011: నాగర్‌కర్నూల్‌ను మేజర్ గ్రామపంచాయతి నుంచి పురపాలక సంఘంగా హోదా పెంచబడింది 


ఫోటో గ్యాలరీ




విభాగాలు: మహబూబ్ నగర్ జిల్లా మండలాలు,  నాగర్‌కర్నూల్ మండలము, నాగర్‌కర్నూల్ రెవెన్యూ డివిజన్, నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • నాగరకర్నూలు తాలుకా గ్రామాలు-చరిత్ర (రచయిత కపిలవాయి కిశోర్ బాబు)
  • Handbook of Statistics, Mahabubnagar Dist, 2008,
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • మహబూబ్‌నగర్ జిల్లా సర్వస్వము (రచన- బి.ఎన్.శాస్త్రి),
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక