22, జనవరి 2013, మంగళవారం

కొత్తూరు మండలం (Kothur Mandal)

జిల్లా మహబూబ్ నగర్
రెవెన్యూ డివిజన్ మహబూబ్ నగర్
జనాభా56129 (2001)
65199 (2011)
అసెంబ్లీ నియోజకవర్గంషాద్ నగర్
లోకసభ నియోజకవర్గంమహబూబ్ నగర్
పర్యాటక ప్రాంతాలు
ముఖ్య పంటలుమొక్కజొన్న
మండల ప్రముఖులు
కొత్తూరు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మండలము. ఇది మహబూబ్‌నగర్ జిల్లా ఈశాన్య భాగంలో హైదరాబాదుకు సమీపంలో ఉంది. జిల్లాలో అతిపెద్ద పారిశ్రామిక వాడ కొత్తూరులోనే ఉంది. 2010 నవంబరు 3న మండలమునకు చెందిన రవికుమార్ గుప్తా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌గా నియమితులైనారు. మండలం గుండా సికింద్రాబాదు - డోన్ రైల్వేలైన్ వెళ్ళుచున్నది. మండల కేంద్రం కొత్తూరు మరియు తిమ్మాపూర్ లలో రైల్వేస్టేషన్లు ఉన్నాయి. ఈ మండలము మహబూబ్‌నగర్ రెవెన్యూ డివిజన్, షాద్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. మండలంలో 16 రెవెన్యూ గ్రామాలు, 17 గ్రామపంచాయతీలు కలవు. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 65199. మండల పరిధిలోని మామిడిపల్లిలో పురాతనమైన కోదండరామస్వామి ఆలయం, ఇన్ముల్‌నర్వలో జహంగీర్ పీర్ దర్గా ఉన్నాయి.

మండల సరిహద్దులు:

ఈ మండలమునకు దక్షిణమున షాద్ నగర్, కేశంపేట మండలములు సరిహద్దుగా ఉండగా మిగితా అన్నివైపులా రంగారెడ్డి జిల్లా సరిహద్దుగా ఉన్నది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 56127. ఇందులో పురుషులు 29151, మహిళలు 26976. 
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 65199. ఇందులో పురుషులు 33957, మహిళలు 31242. పట్టణ జనాభా 10520, గ్రామీణ జనాభా 54679. జనాభాలో ఇది జిల్లాలో 20వ స్థానంలో ఉంది. స్త్రీపురుష నిష్పత్తిలో (920/వెయ్యి పురుషులకు) ఈ మండలం జిల్లాలో చివరి స్థానంలో ఉంది.

రవాణా సౌకర్యాలు:
సికింద్రాబాదు-డోన్ రైలుమార్గం మండలం నుంచి వెళ్ళుచున్నది. తిమ్మాపూర్ మరియు కొత్తూర్ లలో రైల్వేస్టేషన్లు ఉన్నాయి. 44వ నెంబరు జాతీయరహదారి కూడా మండలం నుంచి వెళ్ళుచున్నది. హైదరాబాదుకు సమీపంలో ఉండుటచే రవాణాసౌకర్యాలు మెండుగా ఉన్నాయి.

రాజకీయాలు:
ఈ మండలము షాద్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2001 జడ్పీటీసి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన మామిడి శ్యాంసుందర్ రెడ్డి, 2006 జడ్పీటీసి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన చిర్ర మల్లయ్య  విజయం సాధించారు.

షాద్‌నగర్ నియోజకవర్గంలో
కొత్తూరు మండల స్థానం (నీలం రంగు)
విద్యాసంస్థలు:
2008-09 నాటికి మండలంలో 56 ప్రాథమిక పాఠశాలలు (50 మండల పరిషత్తు, 1 ప్రైవేట్ ఎయిడెడ్, 5 ప్రైవేట్ అన్-ఎయిడెడ్), 18 ప్రాథమికోన్నత పాఠశాలలు (7 మండల పరిషత్తు, 11 ప్రైవేట్), 13 ఉన్నత పాఠశాలలు (9 జడ్పీ, 1 ప్రైవేట్ ఎయిడెడ్, 3 ప్రైవేట్ అన్-ఎయిడెడ్) ఉన్నవి.

వ్యవసాయం, నీటిపారుదల:
మండలం మొత్తం విస్తీర్ణం 18760 హెక్టార్లలో 36% భూమి వ్యవసాయ యోగ్యంగా ఉన్నది. మండలంలో పండించే ప్రధాన పంట మొక్కజొన్న. కందులు, జొన్నలు, వరి, ప్రత్తి కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 639 మిమీ. మండలంలో సుమారు 1700 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది.

కాలరేఖ:
  • 2009, జనవరి 16: బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొత్తూరు మండలం వీర్లపల్లి గ్రామానికి చెందిన అశోక్ కుమార్ నియమితులైనారు. 
  • 2014, ఫిబ్రవరి 5: మేకగూడలోని నాట్కోల్యాబ్స్ పరిశ్రమను టాంజేనియా అధ్యక్షుడు సందర్శించారు. 

కొత్తూరు మండలంలోని గ్రామపంచాయతీలు
1.ఇన్ముల్ నర్వ7.తీగాపుర్13.మేకగూడ
2.ఏదులపల్లి8.నందిగామ14.రంగాపుర్
3.కొత్తూర్9.నర్సప్పగూడ15.వీర్లపల్లి
4.కోడిచర్ల10.పింజెర్ల16.శేరిగూడ బంద్రాయిపల్లి
5.గూడూర్11.మల్లాపూర్17.సిద్ధాపూర్
6.చేగూర్12.మామిడిపల్లి


విభాగము: కొత్తూరు మండలంలోని గ్రామాలు
(Portal: Villages in Kothur Mandal)
  1. చేగూర్ (Chegur),
  2. ఏదులపల్లి (Edulapally),
  3. గూడూర్ (Gudur),
  4. ఇన్ముల్‌నర్వ (Inmulnarva),
  5. ఖాజీగూడ (Khajiguda),
  6. కొడిచెర్ల (Kodicherla),
  7. కొత్తూర్ (Kothur),
  8. మల్లాపూర్ (Mallapur),
  9. మామిడిపల్లి (Mamidipally),
  10. నందిగాం (Nandigam),
  11. పెంజెర్ల (Penjerla),
  12. సేరిగూడ భద్రాయిపల్లి (Seriguda Bhadraipally),
  13. సిద్ధాపూర్ (Siddapur),
  14. తీగాపూర్ (Theegapur),
  15. తిమ్మాపూర్ (Thimmapur),
  16. వీర్లపల్లి (Veerlapally),
 రెవెన్యూ గ్రామాలు కాని పంచాయతీలు
  1. ఇన్ముల్‌నర్వ (Inmulnarwa),
  2. మేకగూడ (Mekaguda),
  3. నర్సప్పగూడ (Narsappaguda),
  4. రంగాపూర్ (Rangapur),
అనుబంధ గ్రామాలు
  1. అంతిరెడ్డిగూడ (Anthireddyguda),


విభాగాలు: మహబూబ్ నగర్ జిల్లా మండలాలు,  కొత్తూరు మండలము, మహబూబ్‌నగర్ రెవెన్యూ డివిజన్, షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • తెలుగు వికీపీడియా,
  • ఆంగ్ల వికీపీడియా,
  • Handbook of Statistics, Mahabubnagar Dist, 2008,
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  •  మహబూబ్‌నగర్ జిల్లా సర్వస్వము (రచన- బి.ఎన్.శాస్త్రి),
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక