21, జనవరి 2013, సోమవారం

గోపాల్‌పేట మండలం (Gopalpet Mandal)

జిల్లా వనపర్తి
రెవెన్యూ డివిజన్వనపర్తి
జనాభా55907 (2001)
59100 (2011)
అసెంబ్లీ నియోజకవర్గంవనపర్తి
లోకసభ నియోజకవర్గంనాగర్‌కర్నూల్
పర్యాటక ప్రాంతాలుమున్ననూరు ఆంజనేయస్వామి ఆలయం,
ముఖ్య పంటలుమొక్కజొన్న
మండల ప్రముఖులునాగం జనార్థన్ రెడ్డి,
గోపాల్‌పేట వనపర్తి జిల్లాకు చెందిన మండలము. ఇది వనపర్తి రెవెన్యూ డివిజన్, వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. రాష్ట్ర మంత్రులుగా పనిచేసిన నాగం జనార్థన్ రెడ్డి, జి.చిన్నారెడ్డిలు, ఎమ్మెల్యేగా ఎన్నికైన డి.కిరణ్ కుమార్, గువ్వల బాలరాజ్, నిజాం వ్యతిరేక పోరాటయోధుడు ఆర్.నారాయణరెడ్డి, మండలంలో 20 రెవెన్యూ గ్రామాలు, 17 గ్రామపంచాయతీలు కలవు. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 59100. మండలకేంద్రం గోపాలపేట సంస్థానకేంద్రంగా ఉండేది. మున్ననూరు గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో 200 సంవత్సరాల నుంచి వెలుగుతున్న అఖండజ్యోతి ఉంది.

మండల సరిహద్దులు:
ఈ మండలమునకు ఉత్తరము బిజినేపల్లి, నాగర్ కర్నూల్ మండలములు, తూర్పున పెద్దకొత్తపల్లి మండలము, దక్షిణమున కోడేరు, పానగల్ మండలములు, పశ్చిమమున వనపర్తి మండలము సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 55907. ఇందులో పురుషులు 28418, మహిళలు 27489. 
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 59100. ఇందులో పురుషులు 29787, మహిళలు 29313. జనాభాలో ఇది జిల్లాలో 28వ స్థానంలో ఉంది.

రవాణా సౌకర్యాలు:
నాగర్ కర్నూల్ నుంచి వనపర్తి వెళ్ళు రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది.

వనపర్తి నియోజకవర్గంలో
గోపాల్‌పేట్ మండల స్థానం (నీలం రంగు)
రాజకీయాలు:
ఈ మండలము వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2006 ఎంపీటీసి ఎన్నికలలో కాంగ్రెస్, తెదేపాలకు చెరో 8 స్థానాలు లభించాయి. ఎంపీపీ ఎన్నికలో టాస్ వేయగా కాంగ్రెస్‌కు అధ్యక్షపీఠం లభించింది. 2006 జడ్పీటీసి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన బి.కోదండ రమణగౌడ్ ఎన్నికయ్యారు. 2006 సర్పంచి ఎన్నికలలో మండలంలోని 17 గ్రామపంచాయతీలకుగాను కాంగ్రెస్ పార్టీ 11, తెలుగుదేశం పార్టీ 6 పంచాయతీలలో విజయం సాధించాయి.

విద్యాసంస్థలు:
2008-09 నాటికి మండలంలో 43 ప్రాథమిక పాఠశాలలు (40 మండల పరిషత్తు, 3 ప్రైవేట్), 13 ప్రాథమికోన్నత పాఠశాలలు (11 మండల పరిషత్తు, 2 ప్రైవేట్), 8 ఉన్నత పాఠశాలలు (1 ప్రభుత్వ, 7 జడ్పీ), ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉన్నది.

వ్యవసాయం, నీటిపారుదల:
మండలం మొత్తం విస్తీర్ణం 25104 హెక్టార్లలో 45% భూమి వ్యవసాయ యోగ్యంగా ఉన్నది. మండలంలో పండించే ప్రధాన పంట మొక్కజొన్న. కందులు, వరి, జొన్నలు, ప్రత్తి, వేరుశనగ కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 630 మిమీ. మండలంలో సుమారు 2800 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది.

గోపాల్‌పేట మండలంలోని గ్రామపంచాయతీలు
1.ఏదుట్ల7.చిన్నూరు13.పొల్కిపాడు
2.ఏదుల8.చెరుకుపల్లి14.బండరాయిపాకుల
3.కేశంపేట9.జైన్‌తిర్మలాపూర్15.బుద్ధారం
4.గోపాల్‌పేట10.తల్పనూరు16.మున్ననూరు
5.చాకలపల్లి11.తాడిపర్తి17.రేవల్లి
6.చిన్నారం12.నాగాపూర్


విభాగాలు: వనపర్తి జిల్లా మండలాలు,  గోపాల్‌పేట్ మండలం,  వనపర్తి రెవెన్యూ డివిజన్,  వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం,  
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Mahabubnagar Dist, 2008,
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • మహబూబ్‌నగర్ జిల్లా సర్వస్వము (రచన- బి.ఎన్.శాస్త్రి),
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన విషయాలు,


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక