22, జనవరి 2013, మంగళవారం

ధరూర్ మండలం (Dharur Mandal)

జిల్లా జోగులాంబ గద్వాల జిల్లా
రెవెన్యూ డివిజన్గద్వాల
జనాభా64612 (2011)
అసెంబ్లీ నియోజకవర్గంగద్వాల
లోకసభ నియోజకవర్గంనాగర్‌కర్నూల్
పర్యాటక ప్రాంతాలు
ముఖ్య పంటలుజొన్నలు, వరి
ధరూర్ జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన మండలము. ఇది గద్వాల రెవెన్యూ డివిజన్, గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. జిల్లాలోని ముఖ్యమైన ప్రాజెక్టు ప్రియదర్శినీ జూరాల ప్రాజెక్టు మండల పరిధిలోని రావులపల్లిలో ఉంది. గద్వాల నుంచి రాయచూరు వెళ్ళు రోడ్డు, గద్వాల నుంచి రాయచూరు రైలుమార్గం మండలం గుండా వెళ్తుంది. మండలంలో 25 రెవెన్యూ గ్రామాలు, 26 గ్రామపంచాయతిలు కలవు.

మండల సరిహద్దులు:
ధరూర్ మండలానికి ఉత్తరాన కృష్ణానది సరిహద్దుగా ఉంది. తూర్పున గద్వాల మండలం, దక్షిణమున ఘట్టు, మల్డకల్ మండలాలు సరిహద్దులుగా ఉండగా పశ్చిమాన కర్ణాటకలొని రాయచూరు జిల్లా సరిహద్దుగా ఉంది.

జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 64612. ఇందులో పురుషులు 32434, మహిళలు 32178. జనాభాలో ఇది జిల్లాలో 21వ స్థానంలో ఉంది. అక్షరాస్యత శాతం 40.29%. ఇది జిల్లాలో అత్యధిక అక్షరాస్యత శాతం కల మండలాలలో చివరి నుంచి రెండవ స్థానంలో ఉంది.

రవాణా సౌకర్యాలు:
గద్వాల నుంచి రాయచూర్ వెళ్ళు రహదారి ధరూర్ మీదుగా వెళ్ళుతుంది. గద్వాల నుంచి రాయచూరుకు నూతనంగా నిర్మించిన రైలుమార్గం మండలంలోని ధరూర్, కొండాపూర్, గువ్వలదిన్నెల మీదుగా వెళ్తుంది. మండల కేంద్రం సమీపంలో ప్రియదర్శిని జూరాలా ప్రాజెక్టు పేరుతో రైల్వేస్టేషన్ ఉంది.

గద్వాల నియోజకవర్గంలో
ధరూర్ స్థానం (పరుపు రంగు)
రాజకీయాలు:
ఈ మండలము గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2006 జడ్పీటీసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కరెన్న విజయం సాధించారు.

విద్యాసంస్థలు:
2008-09 నాటికి మండలంలో 52 ప్రాథమిక పాఠశాలలు (అన్నీ మండల పరిషత్తు), 11 ప్రాథమికోన్నత పాఠశాలలు (10 మండల పరిషత్తు, 1 ప్రైవేట్), 7 ఉన్నత పాఠశాలలు (1 ప్రభుత్వ, 6 జడ్పీ), ఒక ప్రైవేట్ జూనియర్ కళాశాల ఉన్నది. ఉప్పేరు, రేవులపల్లి, పాతపాలెం, కొండాపురం, మర్లబీడు, ధరూర్ లలో ఉన్నత పాఠశాలలు ఉన్నాయి.

వ్యవసాయం, నీటిపారుదల:
మండలం మొత్తం విస్తీర్ణం 24461 హెక్టార్లలో 59% భూమి వ్యవసాయ యోగ్యంగా ఉన్నది. మండలంలో పండించే ప్రధాన పంట జొన్నలు, వరి. కందులు, ప్రత్తి, వేరుశనగ  కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 559 మిమీ. మండలంలో సుమారు 4600 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది.

ధరూర్ మండలంలోని గ్రామపంచాయతీలు
1.ఆల్వాలపాడు10.గుడ్డంగడ్డ (హెచ్)19.పాతపాలెం
2.ఉప్పేరు11.గువ్వలదిన్నె20.పాల్చెర్ల
3.ఉమిత్యాల్12.చిన్నరేవుల21.పోతులగిద్ద
4.ఎర్కిచెడ్13.జాంపల్లి22.బ్యూరెడ్డిపల్లి
5.ఎర్లబండ14.ద్యాగదొడ్డి (హెచ్)23.మర్లబీడు
6.కొండాపూర్15.ధరూర్24.మానాపూర్
7.కొత్తపాలెం16.నీలహళ్ళి25.ర్యాలంపాడు
8.గంగన్ పల్లి17.నెట్టంపాడు26.వెంకటాపూర్
9.గార్లపాడు18.పాగుంట



విభాగాలు: జోగులాంబ గద్వాల జిల్లా మండలాలు,  ధరూర్ మండలము, గద్వాల రెవెన్యూ డివిజన్, గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Mahabubnagar Dist, 2008,
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • మహబూబ్‌నగర్ జిల్లా సర్వస్వము (రచన- బి.ఎన్.శాస్త్రి),
  • బ్లాగు రచయిత పర్యటించి తెలుసుకున్న విషయాలు,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక