22, జనవరి 2013, మంగళవారం

ధన్వాడ మండలం (Dhanwada Mandal)

జిల్లా నారాయణపేట
రెవెన్యూ డివిజన్ నారాయణపేట
జనాభా53242 (2001),
63979 (2011),
అసెంబ్లీ నియోజకవర్గంనారాయణపేట
లోకసభ నియోజకవర్గంమహబూబ్‌నగర్
పర్యాటక ప్రాంతాలు
ముఖ్య పంటలుకందులు
మండల ప్రముఖులుచిట్టెం నర్సిరెడ్డి,
కె.వీరారెడ్డి
ధన్వాడ నారాయణపేట జిల్లాకు చెందిన మండలము. ఇది నారాయణపేట రెవెన్యూ డివిజన్, నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగము. స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ శాసనసభ్యుడు చిట్టెం నర్సిరెడ్డి, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన డి.కె.అరుణ, మాజీ శాసనసభ్యుడు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సహకార సంఘం (ఆప్కాబ్) చైర్మెన్ గా పనిచేసిన కె.వీరారెడ్డి ఈ మండలమునకు చెందినవారు. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 63979. మహబూబ్ నగర్ నుంచి నారాయణపేట వెళ్ళు రహదారి మండలం గుండా వెళుతుంది.

అక్టోబరు 16, 2016న జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ధన్వాడ మండలాన్ని విభజించి కొత్తగా మరికల్ మండలాన్ని ఏర్పాటుచేశారు. ఇప్పుడు మండలంలో 9 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఈ మండలం ఫిబ్రవరి 17, 2019న ఈ మండలం కొత్తగా ఏర్పాటుచేసిన నారాయణపేట జిల్లాలో కలిసింది.

మండల సరిహద్దులు:
ఈ మండలమునకు ఉత్తరమున కోయిలకొండ మండలము, తూర్పున దేవరకద్ర మండలము, దక్షిణమున చిన్నచింతకుంట, నర్వ మండలములు, నైరుతి వైపున మక్తల్ మండలము, పశ్చిమాన ఉట్కూరు, నారాయణపేట మండలములు సరిహద్దులుగాఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 53242. ఇందులో పురుషులు 26603, మహిళలు 26639.
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 63979. ఇందులో పురుషులు 31784, మహిళలు 32195. జనాభాలో ఇది జిల్లాలో 23వ స్థానంలో ఉంది.

రవాణా సౌకర్యాలు:
మహబూబ్‌నగర్ నుంచి నారాయణపేట వెళ్ళు ప్రధాన రహదారి మండలం మీదుగా వెళ్ళుచున్నది.

చరిత్ర:
ఈ ప్రాంతం లోకాయపల్లి సంస్థానంలో భాగంగా ఉండేది. సంస్థానానికి ఇది ధనాగారం కూడా ఉండేదని కొన్ని ఆధారాల వల్ల తెలుస్తోంది. దానివల్లనే ధన్వాడ పేరువచ్చినట్లు కథనం. 1947-48లో ఈ ప్రాంతంలో విమోచనోద్యమం చురుకుగా సాగింది. 1948లో రామానందతీర్థ కూడా ఇక్కడికి వచ్చి ప్రసంగించారు. ఆ ప్రసంగానికి ఉత్తేజితులై ఆనేకమంది యువకులు ఉద్యమం పట్ల ఆకర్షితులైనారు. వారిలో చాలా మంది ఉద్యమకారులుగా, తర్వాత రాజకీయ నాయకులుగా చెలామణి అయ్యారు. సమరయోధుడిగా పేరుపొందిన చిట్టెం నర్సిరెడ్డి, కంచె సాయన్న ఇక్కడివారే. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఈ మండలం ఫిబ్రవరి 17, 2019న ఈ మండలం కొత్తగా ఏర్పాటుచేసిన నారాయణపేట జిల్లాలో కలిసింది.

నారాయణపేట నియోజకవర్గంలో
ధన్వాడ మండల స్థానం (ఆకుపచ్చ రంగు)
రాజకీయాలు:
ఈ మండలము నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2006 జడ్పీటీసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వెంకటరెడ్డి విజయం సాధించారు. ఈ మండలం నుంచి వివిధ నియోజకవర్గాలకు ఇప్పటివరకు 6 గురు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 2013లో ఆంధ్రప్రదేశ్ సహకార సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన కె.వీరారెడ్డి ఈ మండలమునకు చెందినవారు.
మండలంలో 16 ఎంపీటీసి స్థానాలున్నాయి. 2006 ఎంపీటీసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 7, తెలుగుదేశం పార్టీ 7, భాజపా 2 స్థానాలలో విజయం సాధించగా, భాజపా మద్దతుతో కాంగ్రెస్ పార్టీ ఎంపీపీ స్థానం పొందింది. భాజపాకు వైస్-ఎంపీపీ లభించింది.

ధన్వాడ మండల పరిషత్తు కార్యాలయము
విద్యాసంస్థలు:
2008-09 నాటికి మండలంలో 41 ప్రాథమిక పాఠశాలలు (32 మండల పరిషత్తు, 9 ప్రైవేట్), 19 ప్రాథమికోన్నత పాఠశాలలు (11 మండల పరిషత్తు, 8 ప్రైవేట్), 13 ఉన్నత పాఠశాలలు (2 ప్రభుత్వ, 8 జడ్పీ, 3 ప్రైవేట్), ఉన్నవి.

వ్యవసాయం, నీటిపారుదల:
మండలం మొత్తం విస్తీర్ణం 18604 హెక్టార్లలో 58% భూమి వ్యవసాయ యోగ్యంగా ఉన్నది. మండలంలో పండించే ప్రధాన పంట కందులు. వరి, ప్రత్తి, వేరుశనగ కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 564 మిమీ. మండలంలో సుమారు 3500 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది.

కాలరేఖ:
  • 1948: ధన్వాడకు రామానందతీర్థ వచ్చి ప్రసంగించారు.  
  • 2009 ఏప్రిల్ 19: ధన్వాడ మాజీ మండల అధ్యక్షులు (2001-06 కాలంలో తెదేపా తరఫున) చిట్టెం శకుంతల ప్రతాపరెడ్డి మరణించారు.  
  • 2012, నవంబరు7: చంద్రబాబు నాయుడు "మీకోసం" పాదయాత్ర మండలంలో సాగింది.
  • 2013, మార్చి 12: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిచే మందిపల్లి గ్రామంలో రెవెన్యూ సదస్సులు ప్రారంభించబడింది.  
  • 2013: ఆంధ్రప్రదేశ్ సహకార సంఘం చైర్మెన్‌గా ఈ మండలానికి చెందిన కె.వీరారెడ్డి ఎన్నికయ్యారు. 
  • 2013, నవంబరు 2: మరికల్‌లో ద్విచక్ర వాహనం లారీ కిందపడి ముగ్గురు మరణించారు. 
  • 2014, జూన్ 2: మండలం తెలంగాణ రాష్ట్రంలో భాగమైంది.
  • 2019, ఫిబ్రవరి 11: మండలం కొత్తగా ఏర్పాటైన నారాయణపేట జిల్లాలో భాగమైంది.

  ధన్వాడ మండలములోని రెవెన్యూ గ్రామాలు
(Revenue Villages in  Devarkadra Mandal)
  1. ధన్వాడ (Dhanwada),
  2. గోటూర్ (Gotur),
  3. గున్ముక్ల (Gunmukla),
  4. కంసాన్‌పల్లి (Kamsanpalle),
  5. కిష్టాపూర్ (Kistapur),
  6. కొండాపూర్ (Kondapur),
  7. మందిపల్లి (Mandipalle),
  8. యమ్నన్‌పల్లి (Yamnanpalle),
  9. పాతపలి (Pathapalli),



ఇవి కూడా చూడండి:


హోం,
విభాగాలు: నారాయణపేట జిల్లా మండలాలు,  ధన్వాడ మండలము, నారాయణపేట రెవెన్యూ డివిజన్, నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గం
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Mahabubnagar Dist, 2008,
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011. 
  • మహబూబ్‌నగర్ జిల్లా సర్వస్వము (రచన- బి.ఎన్.శాస్త్రి),
  • మహబూబ్‌నగర్ జిల్లా స్వాతంత్ర్యోద్యమ చరిత్ర,
  • బ్లాగు రచయిత పర్యటించి తెలుసుకున్న విషయాలు, 
  • https://narayanpet.telangana.gov.in/ (Narayanapet Dist official website)

3 కామెంట్‌లు:

  1. I appreciate the author for providing profile of Dhanwada mandal
    Thanking you
    Shankar
    Native of Dhanwada

    రిప్లయితొలగించండి
  2. Other famous people from Dhanwada Village & Mandal are Kavali Raju Yadav, Ex-Sarpanch and the present Sarpanch is Kavali Indiramma. Sri Kavali Raju Yadav brought political awareness among common people in Dhanwada and he is often regarded as people's leader.

    రిప్లయితొలగించండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక