22, జనవరి 2013, మంగళవారం

బిజినేపల్లి మండలము (Bijinepally Mandal)

జిల్లా నాగర్‌కర్నూల్
రెవెన్యూ డివిజన్ నాగర్ కర్నూల్
జనాభా61989 (2001)
72375 (2011),
అసెంబ్లీ నియోజకవర్గంనాగర్ కర్నూల్
లోకసభ నియోజకవర్గంనాగర్ కర్నూల్
పర్యాటక ప్రాంతాలువట్టెం,
ముఖ్య పంటలుమొక్కజొన్న
మండల ప్రముఖులుపాకాల యశోధారెడ్డి,
పాలెం సుబ్బయ్య,
గోరటి వెంకన్న,
బిజినేపల్లి నాగర్‌కర్నూల్  జిల్లాకు చెందిన మండలము. ఈ మండలము నాగర్ కర్నూల్ రెవెన్యూ డివిజన్, నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్ కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో భాగముగాఉన్నది. ఈ మండలంలో 24 రెవెన్యూ గ్రామాలు, 20 గ్రామపంచాయతీలు కలవు. పాలెంలో వ్యవసాయ పరిశోధన కేంద్రం ఉంది. వట్టెంలో ప్రముఖమైన శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. వట్టెంలో ఒకప్పుడు వేదవేదాంగాలు అభ్యసించిన పండితులకు, కవివరేణ్యులకు ప్రసిద్ధి. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 72375. ఖండవల్లి నరసింహశాస్త్రి, కవియిత్రి పాకాల యశోధారెడ్డి, పాలెం గ్రామాన్ని అభివృద్ధి పర్చిన తోటపల్లి సుబ్రహ్మణ్యశర్మ, ప్రజాకవి గోరటి వెంకన్న ఈ మండలమునకు చెందినవారు. చరిత్రలో నందివర్థమానపురంగా ప్రసిద్ధి చెందిన ఇప్పటి వడ్డెమాన్ ఈ మండలంలోనే ఉంది.

మండల సరిహద్దులు:
ఈ మండలమునకు ఉత్తరమున తిమ్మాజీపేట మండలము, తూర్పున తాడూరు, నాగర్ కర్నూల్  మండలములు, దక్షిణమున గోపాలపేట మండలము, పశ్చిమాన ఘనపూర్ మండలము సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 61989. ఇందులో పురుషులు 31629, మహిళలు 30360. 
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 72375. ఇందులో పురుషులు 36705, మహిళలు 35670. జనాభాలో ఇది జిల్లాలో 11వ స్థానంలో ఉంది.

రవాణా సౌకర్యాలు:
మహబూబ్‌నగర్  నుంచి శ్రీశైలం వెళ్ళు రహదారి మండలం లోని మంగనూరు, బిజినేపల్లి, పాలెం గుండా వెళ్ళుచున్నది. హైదరాబాదు నుంచి నాగర్ కర్నూల్ వెళ్ళే రహదారి కూడా బిజినేపల్లి వద్ద కలుస్తుంది. బిజినేపల్లి ఒక ప్రధాన రోడ్డు కూడలి. బిజినేపల్లి నుంచి వనపర్తి వెళ్ళుటకు కూడా రహదారి ఉంది.

చరిత్ర:
జిల్లాలోనే ఈ ప్రాంతం మహోన్నత చరిత్రను కలిగియుంది. కాకతీయుల కాలంలో వర్థమానపురంగా ప్రసిద్ధి చెందిన నేటి వడ్డెమాన్ రాజధానిగా విలసిల్లిన పట్టనము. వర్థమానపురాన్ని ఏలుతున్న ఉదయన చోడునికి వ్యతిరేకంగా కాకతీయ రుద్రదేవుడు వర్థమానపురంపైకి దండెత్తి పట్టణాన్ని సర్వనాశనం చేసి దున్నించి వెళ్ళాడు. ఆ తర్వాత వెలసినదే నేటి వడ్డెమాన్. ఇప్పటికీ గ్రామపరిసరాలలో ఆనాటి శిథిల శిల్పాలు, కోట ఆనవాళ్ళు కనిపిస్తాయి.

నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో
బిజినేపల్లి మండల స్థానం (ఆకుపచ్చ రంగు)
రాజకీయాలు:
ఈ మండలము నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2006 జడ్పీటీసి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన సి.వెంకటయ్య ఎన్నికయ్యారు.

విద్యాసంస్థలు:
2008-09 నాటికి మండలంలో 57 ప్రాథమిక పాఠశాలలు (3 ప్రభుత్వ, 49 మండల పరిషత్తు, 1 ప్రైవేట్ ఎయిడెడ్, 4 ప్రైవేట్ అన్-ఎయిడెడ్), 12 ప్రాథమికోన్నత పాఠశాలలు (8 మండల పరిషత్తు, 1 ప్రైవేట్ ఎయిడెడ్, 3 ప్రైవేట్ అన్-ఎయిడెడ్), 19 ఉన్నత పాఠశాలలు (1 ప్రభుత్వ, 11 జడ్పీ, 1 ప్రైవేట్ ఎయిడెడ్, 6 ప్రైవేట్ అన్-ఎయిడెడ్), ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉన్నది.

వ్యవసాయం, నీటిపారుదల:
మండలం మొత్తం విస్తీర్ణం 25903 హెక్టార్లలో 44% భూమి వ్యవసాయ యోగ్యంగా ఉన్నది. మండలంలో పండించే ప్రధాన పంట మొక్కజొన్న. వేరుశనగ, కూరగాయలు కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 625 మిమీ. మండలంలో సుమారు 800 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది.

కాలరేఖ:
  • 1975: పాలెం పారిశ్రామికవాడ మంజూరైంది.
  • 2002: బిజినేపల్లి మండలం వట్టెం గ్రామానికి బ్రిటన్ ప్రధానమంత్రి టోని బ్లెయిర్ వచ్చారు.

బిజినేపల్లి మండలంలోని గ్రామపంచాయతీలు
1.అల్లిపూర్8.పోలెపల్లి15.వట్టెం
2.కారుకొండ9.బిజినేపల్లి16.వడ్డెమాన్
3.ఖానాపూర్10.మంగనూరు17.వసంతపూర్
4.గంగారం11.మహాదేవన్ పేట్18.వెల్గొండ
5.గుడ్లనర్వ12.ముమాయిపల్లి19.శాయిన్ పల్లి
6.గౌరారం13.లట్ పల్లి20.సల్కర్ పేట్
7.పాలెం14.లింగసానిపల్లి


విభాగాలు: మహబూబ్ నగర్ జిల్లా మండలాలుబిజినేపల్లి మండలము,  నాగర్‌కర్నూల్ రెవెన్యూ డివిజన్, నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Mahabubnagar Dist, 2008,
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011. 
  • మహబూబ్‌నగర్ జిల్లా సర్వస్వము (రచన- బి.ఎన్.శాస్త్రి),
  • పాలమూరు ఆధునిక యుగ కవుల చరిత్ర (రచన- ఆచార్య ఎస్వీ రామారావు),
  • నాగర్‌కర్నూలు తాలుకా గ్రామాలు- చరిత్ర (రచన: కపిలవాయి కిశోర్ బాబు)
  • కాకతీయ చరిత్రము (రచన- తేరాల సత్యనారాయణ),
  • తొలి తెలంగాణం (1969 తెలంగాణ ఉద్యమ శంఖారావం)
  • బ్లాగు రచయిత పర్యటించి తెలుసుకున్న విషయాలు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక