8, ఏప్రిల్ 2017, శనివారం

భారతదేశంలో అతి పెద్దవి (Largest in India)

భారతదేశంలో అతి పెద్దవి 
(Largest in India)
 1. అతిపెద్ద ఎడారి → థార్ ఎడారి
 2. అతిపెద్ద ఓడరేవు → ముంబాయి
 3. అతిపెద్ద కేంద్రపాలితప్రాంతం → అండమాన్ నికోబార్ దీవులు
 4. అతిపెద్ద గుహాలయం → ఎల్లోరా (మహారాష్ట్ర)
 5. అతిపెద్ద గ్రంథాలయం → నేషనల్ లైబ్రేరీ (కోల్‌కత)
 6. అతిపెద్ద చర్చి → సెయింట్ కేథెడ్రల్ (గోవా)
 7. అతిపెద్ద జిల్లా → కచ్ (గుజరాత్)
 8. అతిపెద్ద జైలు → తీహార్ జైలు (ఢిల్లీ)
 9. అతిపెద్ద డెల్టా → సుందర్‌బన్స్
 10. అతిపెద్ద డోమ్‌ → గోల్‌గుంబజ్ (బీజాపూర్)
 11. అతిపెద్ద నదీద్వీపం → మజులీద్వీపం (అసోం)
 12. అతిపెద్ద పశువుల సంత → సోనేపూర్ (బీహార్)
 13. అతిపెద్ద పీఠభూమి → దక్కన్ పీఠభూమి
 14. అతిపెద్ద బ్యాంక్ → స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
 15. అతిపెద్ద మసీదు → జామామసీదు (ఢిల్లీ)
 16. అతిపెద్ద రాష్ట్రం → రాజస్థాన్
 17. అతిపెద్ద విమానాశ్రయం → ఛత్రపతి శివాజీ విమానాశ్రయం
 18. అతిపెద్ద సరస్సు → ఊలర్ సరస్సు
 19. అతిపెద్ద స్టేడియం → యువభారతి (సాల్ట్‌లేక్) కోల్‌కత
 20. అతిపెద్ద గుహలు → అమర్‌నాథ్ గుహలు (జమ్మూకశ్మీర్)

   విభాగాలు: జనరల్ నాలెడ్జి,
   ------------ 

   19, మార్చి 2017, ఆదివారం

   వెంకటాపురం మండలం (Venkatapuram)

   వెంకటాపురం మండలం
   జిల్లాజయశంకర్ జిల్లా
   జనాభా38900 (2011)
   అసెంబ్లీ నియో.ములుగు అ/ని,
   లోకసభ నియో.మహబూబాబాద్ లో/ని,
   వెంకటాపురం జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మండలము. కాకతీయుల కాలం నాటి ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయం, రామప్ప సరస్సు మండలంలోని పాలంపేటలో ఉంది. మండల వ్యవస్థకు ముందు ఇది ములుగు తాలుకాలో భాగంగా ఉండేది. ఇది ములుగు రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది. మండలంలోని పాలంపేట గ్రామం కాకతీయుల కాలంలో రాజధానిగా విలసిల్లింది. రామానుజాపూర్‌లో కాకతీయుల కాలం నాటి పంచకూటాలయం ఉంది. మండలంలో 11 ఎంపీటీసి స్థానాలు, 12 గ్రామపంచాయతీలు, 10 రెవెన్యూ గ్రామాలు కలవు.
   జిల్లాల పునర్విభజనకు ముందు ఈ మండలం వరంగల్ జిల్లాలో ఉండేది. అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా కొత్తగా ఏర్పడిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భాగమైంది. రెవెన్యూ డివిజన్ కూడా పరకాల నుంచి ములుగు డివిజన్‌లోకి వచ్చింది.
   చరిత్ర:
   కాకతీయుల కాలంలో ఈ ప్రాంతం వైభవంగా వెలుగొందింది. కాకతీయుల కాలం నాటి ప్రసిద్ధమైన పాలంపేట దేవాలయం, పాలంపేట చెరువు, పంచకూటాలయం మండల పరిధిలో ఉన్నాయి. కాకతీయుల పతనానంతరం కొన్ని దేవాలయాలు విధ్వంసానికి గురయ్యాయి. ప్రారంభంలో వరంగల్ జిల్లాలో భాగంగా ఉన్న ఈ మండలం 2016లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా కొత్తగా ఏర్పడిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భాగమైంది.

   జనాభా:
   2001 లెక్కల ప్రకారం మండల జనాభా 36559. ఇందులో పురుషులు 18481, మహిళలు 18078.
   2011 లెక్కల ప్రకారం మండల జనాభా 38900. ఇందులో పురుషులు 19448, మహిళలు 19452.

   రాజకీయాలు:
   ఈ మండలము ములుగు అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగము.

   మండలంలోని గ్రామాలు:
   అడవి రంగాపూర్ (Adavirangapur), తిమ్మాపూర్ (Thimmapur), నర్సాపురం (Narasapuram), నల్లగుంట (Nallagunta), పాలంపేట (Palampeta), బండ్లపహాడ్ (Bandlapahad), రామనాథపల్లి (Ramanathapalle), రామానుజాపూర్ (Ramanujapuram), లక్ష్మీదేవిపేట (Laxmidevipeta), వెంకటాపూర్ (Venkatapur),


   విభాగాలు: జయశంకర్ జిల్లా మండలాలు, వెంకటాపురం మండలం, ములుగు అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గం,


    = = = = =


   14, మార్చి 2017, మంగళవారం

   శాలిగౌరారం మండలం (Shaligauraram Mandal)

   శాలిగౌరారం మండలం
   జిల్లానల్గొండ
   రెవెన్యూ డివిజన్నల్గొండ
   అసెంబ్లీ నియో.తుంగతుర్తి
   లోకసభ నియోభువనగిరి
   శాలిగౌరారం నల్గొండ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 20 రెవెన్యూ గ్రామాలు, 19 గ్రామపంచాయతీలు కలవు. కాకతీయుల సామంతరాజులు ఏలిన వల్లాల ఈ మండలంలో ఉంది. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, విమోచనోద్యమకారుడు పులిజాల వెంకటరంగారావు ఈ మండలమునకు చెందినవారు.

   జనాభా:

   2001 లెక్కల ప్రకారం మండల జనాభా 42606, 2011 నాటికి జనాభా 4451 పెరిగి 47057 కు చేరింది 2001 జనాభా ప్రకారము జిల్లాలో 39వ స్థానంలో ఉండగా 2011 నాటికి 35వ స్థానానికి చేరింది.
   2011 లెక్కల ప్రకారం మండల జనాభా 47057. ఇందులో పురుషులు 23543, మహిళలు 23514.

   రాజకీయాలు:
   ఈ మండలము తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది.

   మండలంలోని గ్రామాలు:
   అడ్లూరు (Adluru), ఆకారం (Akaram), ఇటుకలపహాడ్ (Itukulapahad), ఉప్పలంచ (Uppalancha), ఉట్కూర్ (Utkur), ఎన్.జి.కొత్తపల్లి (N G kothapelly), గురిజాల (Gurijala), చింతలూరు (Chithaluru), తక్కెలపహాడ్ (Thakkellapahad), తుడిమిడి (Tudimudi), పాతకొండారం (Pathakondaram), పెర్కకొండారం (Perkakondaram), భైరవునిబండ (Bhairavunibanda),
   మనొమద్ద (Manimadde), మాధారం కలాన్ (Madharam kalan), వంగమర్తి (Vangamarthy), వడ్డిపాముల (Vaddipamula), వల్లాల (Vallala), శాలిగౌరారం (Shaligouraram), శాలిలింగోట (Shalilingota)

   విభాగాలు: నల్గొండ జిల్లా మండలాలు, నల్గొండ రెవెన్యూ డివిజన్, 


    = = = = =


   10, మార్చి 2017, శుక్రవారం

   APPSC Degree Lecturers Syllabus

   APPSC Degree Lecturers SYLLABUS
   (PAPER-1: GENERAL STUDIES & MENTAL ABILITY  )
   1. Events of national and international importance.
   2. Current affairs- international, national and regional.
   3. General   Science   and   it   applications   to   the   day   to   day   life   Contemporary
   developments in Science & Technology and Information Technology
   4. Social-  economic  and  political  history  of  modern  India  with  emphases  on  Indian
   national movement.
   5. Indian  polity  and  governance:  constitutional  issues,  public  policy,  reforms
   and  e-governance initiatives.
   6. Economic development in India since independence.
   7. Physical geography of India sub-continent.
   8. Disaster management: vulnerability profile, prevention and mitigation strategies,
   Application of  Remote Sensing and GIS in the assessment of Disaster
   9. Sustainable Development and Environmental Protection
   10. Logical reasoning, analytical ability and data interpretation.
   11. Data Analysis:
   Tabulation of data
   Visual representation of data
   Basic data analysis (Summary Statistics such as mean and variance coefficient of
   variation etc.,) and Interpretation
   12.  Bifurcation    of    Andhra    Pradesh    and    its    Administrative,    Economic, Social,
   Cultural, Political, and legal implications/problems, including
   a).  Loss  of  capital  city,  challenges  in building  new  capital  and  it’s
   financial implications.
   b). Division and rebuilding of common Institutions.
   c). Division of employees, their relocation and nativity issues.
   d). Effect of bifurcation on commerce and entrepreneurs.
   e). Implications to financial resources of state government.
   f).  Task  of  post-bifurcation  infrastructure  development  and  opportuni
   ties  for investments.
   g). Socioeconomic, cultural and demographic impact of bifurcation.
   h). Impact of bifurcation on river water sharing and consequential
   issues.
   i).  AP  REORGANISATION  ACT,  2014  on  AP  and  the  arbitrariness  of certain provisions.
   Categories: APPSC

   3, మార్చి 2017, శుక్రవారం

   ఉడుపి రామచంద్రరావు (U.R.Rao)

   యు.ఆర్.రావు
   జననం10 మార్చి 1932
   రంగంఅంతరిక్ష శాస్త్రవేత్
   సంక్షిప్తంగా యు.ఆర్.రావుగా పిలువబడే ఉడుపి రామచంద్రరావు 10 మార్చి 1932న కర్ణాటకలో జన్మించారు. 1984-94 కాలంలో భారతదేశ అంతరిక్ష శాస్త్రవేత్త. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) కు చైర్మన్‌గా పనిచేశారు. ఈయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1976 లో పద్మభూషన్, 2017లో పద్మవిభూషణ్ పురస్కారాలను ప్రధానం చేసింది. ఆయన పేరు వాషింగ్టన్ లోని శాటిలైట్ హాల్ ఆఫ్ ఫ్రేమ్‌లో 2013లో చేర్చబడి ఈ ఘనత పొందిన తొలి భారతీయుడయ్యారు. 2016లో ఇంతర్నేషనల్ అస్ట్రానాటిక్స్ ఫెడరేషన్‌కు ఎన్నికై ఇందులో కూడా తొలి భారతీయుడిగా అవతరించారు.

   విభాగాలు: భారతదేశ శాస్త్రవేత్తలు, కర్ణాటక ప్రముఖులు, 1932లో జన్మించినవారు,


    = = = = =


   26, ఫిబ్రవరి 2017, ఆదివారం

   కె.సి.శేఖర్ బాబు (K.C.Sekhar Babu)

   కె.సి.శేఖర్ బాబు
   రంగంసినీ నిర్మాత
   స్వస్థలంకోలవెన్ను
   ప్రముఖ సినీ నిర్మాత కె.సి.శేఖర్ బాబు పూర్తిపేరు కంచర్ల చంద్రశేఖర్ రావు. కృష్ణా జిల్లా కోలవెన్ను గ్రామానికి చెందిన శేఖర్ బాబు 1973లో మమత చిత్రం ద్వారా నిర్మాతగా మారారు. సంసార బంధం, గోపాలరావుగారి అమ్మాయి, పక్కింటి అమ్మాయి, జగ్గు, సర్దార్, సాహస సామ్రాట్, ముఠామేస్త్రీ, సుబ్బరాజుగారి కుటుంబం చిత్రాలను నిర్మించారు. ఫిలిం సెంట్రల్ బోర్డ్ చైర్మెన్‌గా, దక్షిణ భారతదేశ చలనచిత్ర మండలి సభ్యుడిగా పనిచేశారు. ఫిబ్రవరి 25, 2017న మరణించారు.

   విభాగాలు: కృష్ణా జిల్లా ప్రముఖులు, 2017లో మరణించినవారు,


    = = = = =


   25, ఫిబ్రవరి 2017, శనివారం

   భీమదేవరపల్లి మండలం (Bheemadevarapalli Mandal)

   భీమదేవరపల్లి మండలం
   జిల్లావరంగల్ పట్టణ
   జనాభా
   అసెంబ్లీ నియో.హుస్నాబాదు
   లోకసభ నియో.కరీంనగర్
   భీమదేవరపల్లి వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన మండలము. ప్రధానమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన పి.వి.నరసింహారావు ఈ మండలమునకు చెందినవారు. ముత్తారంలో కాకతీయుల కాలం నాటి శివాలయం ఉంది. ఈ మండలము హుస్నాబాదు అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండల పరిధిలోని ముల్కనూరు సహకార బ్యాంకు దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. మండలంలో 12 రెవెన్యూ గ్రామాలు కలవు. 2016 జిల్లాల పునర్విభజనకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో ఉండేది. అక్టోబరు 11, 2016న ఈ మండలం వరంగల్ పట్టణ జిల్లా పరిధిలోకి వచ్చింది.

   మండల ప్రముఖులు:
   • పి.వి.నరసింహారావు (ప్రధానమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు)
   • పి.వి.రంగారావు: శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా పనిచేశారు.

   మండలంలోని గ్రామాలు:

   కొత్తకొండ, కొత్తపల్లి, కొప్పూర్, గట్లనర్సింగాపూర్, భీమదేవరపల్లి, మల్లారం, మాణిక్యాపూర్, ముత్తారం (పి.కె), ముల్కనూర్, ముస్తాపూర్, రత్నగిరి, వంగర,
    

   విభాగాలు: వరంగల్ అర్బన్ జిల్లా మండలాలు, భీమదేవరపల్లి మండలం,


    = = = = =   Tags: Bheemadevarpalli Mandal in Telugu, Bheemadevarpalli Mandal information, Vangara village in Telugu, bheemadevarpally samacharam.

   19, ఫిబ్రవరి 2017, ఆదివారం

   మాక్స్ ప్లాంక్ (Max Planck)

   మాక్స్ ప్లాంక్
   జననంఏప్రిల్ 23, 1858
   రంగంభౌతిక శాస్త్రవేత్త
   ప్రత్యేకతక్వాంటం సిద్ధాంత ప్రతిపాదకుడు
   మరణంఅక్టోబర్ 4,1947
   మాక్స్ ప్లాంక్ జర్మనీకి చెందిన భౌతిక శాస్త్రవేత్త. ఏప్రిల్ 23, 1858న కీల్‌లో జన్మించిన మాక్స్ ప్లాంక్ భౌతికశాస్త్రంలో కీలకమైన క్వాంటం సిద్ధాంతాన్ని కనుగొని 1918లో నోబెల్ బహుమతి పొందాడు. 17 సం.ల వయస్సులోనే ప్రయోగాలు చేసి, 31వ ఏట బెర్లిన్ విశ్వవిద్యాలయంలో భౌతికశాస్త్ర విభాగానికి అధిపతి అయ్యాడు. 89 సం.ల వయస్సులో అక్టోబర్ 4,1947న మరణించాడు.

   క్వాంటం సిద్ధాంతం:
   శక్తి అవిచ్ఛిన్నంగా కాకుండా విడివిడిగా అతి చిన్న పరిమాణాల్లో కణాల రూపంలో ఉంటుంది. ఈ పరిమాణాన్ని క్వాంటమ్ శక్తి అంటారు. ఇది ఆవర్తన పట్టికను విపులీకరిస్తుంది. రసాయనిక చర్యలు ఎందుకు జరుగుతాయో వివరిస్తుంది. జీవశాస్త్రంలో డీఎన్‌ఏ కణాల స్థిరత్వాన్ని, పరమాణు కేంద్రం నుంచి ఆల్ఫా కణాల వికిరణాలను వివరిస్తుంది. లేజర్ కిరణాలు, కంప్యూటర్ రంగానికి మూలాధారమైన మైక్రోచిప్స్, అతివాహకత, కాంపాక్ట్ డిస్క్ ల ఆవిష్కరణకు ఈ సిద్ధాంతం నాంది పలికింది.
   విభాగాలు: శాస్త్రవేత్తలు, జర్మనీ ప్రముఖులు, 1858లో జన్మించినవారు, 1947లో మరణించినవారు, ఆవిష్కర్తలు, నోబెల్ బహుమతి గ్రహీతలు, భౌతిక శాస్త్రవేత్తలు


    = = = = =


   Tags: Famous Scientists in Telugu, Alexander Fleming in Telugu, Nobel Prize winners in Telugu, World Famous Persons in telugu,

   Index


   తెలుగులో విజ్ఞానసర్వస్వము
   వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
   సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
   సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
   సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
   ప్రపంచము,
   శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
   క్రీడలు,  
   క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
   శాస్త్రాలు,  
   భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
   ఇతరాలు,  
   జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

     విభాగాలు: 
     ------------ 

     stat coun

     విషయసూచిక