14, మార్చి 2017, మంగళవారం

శాలిగౌరారం మండలం (Shaligauraram Mandal)

శాలిగౌరారం మండలం
జిల్లానల్గొండ
రెవెన్యూ డివిజన్నల్గొండ
అసెంబ్లీ నియో.తుంగతుర్తి
లోకసభ నియోభువనగిరి
శాలిగౌరారం నల్గొండ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 20 రెవెన్యూ గ్రామాలు, 19 గ్రామపంచాయతీలు కలవు. కాకతీయుల సామంతరాజులు ఏలిన వల్లాల ఈ మండలంలో ఉంది. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, విమోచనోద్యమకారుడు పులిజాల వెంకటరంగారావు, తెలంగాణ సాయుధ పోరాటయోధుడు గార్లపాటి రఘుపతిరెడ్డి ఈ మండలమునకు చెందినవారు.

సరిహద్దులు:
ఈ మండలానికి దక్షిణాన నక్రేకల్ మండలం, పశ్చిమాన నార్కెట్‌పల్లి మరియు కట్టంగూరు మండలాలు, ఉత్తరాన యాదాద్రి భువనగిరి జిల్లా, తూర్పున సూర్యాపేట జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:

2001 లెక్కల ప్రకారం మండల జనాభా 42606, 2011 నాటికి జనాభా 4451 పెరిగి 47057 కు చేరింది 2001 జనాభా ప్రకారము జిల్లాలో 39వ స్థానంలో ఉండగా 2011 నాటికి 35వ స్థానానికి చేరింది.
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 47057. ఇందులో పురుషులు 23543, మహిళలు 23514.

రాజకీయాలు:
ఈ మండలము తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది.
మండలంలోని గ్రామాలు:
అడ్లూరు (Adluru), ఆకారం (Akaram), ఇటుకలపహాడ్ (Itukulapahad), ఉప్పలంచ (Uppalancha), ఉట్కూర్ (Utkur), ఎన్.జి.కొత్తపల్లి (N G kothapelly), గురిజాల (Gurijala), చింతలూరు (Chithaluru), తక్కెలపహాడ్ (Thakkellapahad), తుడిమిడి (Tudimudi), పాతకొండారం (Pathakondaram), పెర్కకొండారం (Perkakondaram), భైరవునిబండ (Bhairavunibanda),మనిమద్ద (Manimadde), మాధారం కలాన్ (Madharam kalan), వంగమర్తి (Vangamarthy), వడ్డిపాముల (Vaddipamula), వల్లాల (Vallala), శాలిగౌరారం (Shaligouraram), శాలిలింగోట (Shalilingota)

విభాగాలు: నల్గొండ జిల్లా మండలాలు, నల్గొండ రెవెన్యూ డివిజన్, 


 = = = = =


2 కామెంట్‌లు:

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక