8, జులై 2020, బుధవారం

భీమదేవరపల్లి మండలం (Bheemadevarapalli Mandal)

భీమదేవరపల్లి మండలం
జిల్లా వరంగల్ పట్టణ
రెవెన్యూ డివిజన్ వరంగల్
అసెంబ్లీ నియోజకవర్గంహుస్నాబాదు
లోకసభ నియోజకవర్గంకరీంనగర్
భీమదేవరపల్లి వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 13 ఎంపీటీసి స్థానాలు, 22 గ్రామపంచాయతీలు, 12 రెవెన్యూ గ్రామాలు కలవు. ప్రధానమంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన పి.వి.నరసింహారావు ఈ మండలమునకు చెందినవారు. ముత్తారంలో కాకతీయుల కాలం నాటి శివాలయం ఉంది. ఈ మండలము హుస్నాబాదు అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండల పరిధిలోని ముల్కనూరు సహకార బ్యాంకు దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. 

2016 జిల్లాల పునర్విభజనకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో ఉండేది. అక్టోబరు 11, 2016న వరంగల్ పట్టణ జిల్లాలో భాగమైంది. అదేసమయంలో ఈ మండలం కరీంనగర్ రెవెన్యూ డివిజన్ పరిధి నుంచి వరంగల్ రెవెన్యూ డివిజన్ పరిషిలోకి వచ్చింది.


భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి తూర్పున ఎల్కతుర్తి మండలం, దక్షిణాన వేలేరు మండలం, ఉత్తరాన కరీంనగర్ జిల్లా, పశ్చిమాన సిద్ధిపేట జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 55595. ఇందులో పురుషులు 27492, మహిళలు 28103. అక్షరాస్యుల సంఖ్య 31759.

రాజకీయాలు:
ఈ మండలము హుస్నాబాదు అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండలానికి చెందిన పి.వి.నరసింహారావు ప్రధానమంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2019లో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన జక్కుల అనిత, జడ్పీటీసిగా తెరాసకు చెందిన వంగా రవి విజయం సాధించారు.



మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Vangara, Bheemadevarpalle, Ratnagiri, Manikyapur, Koppur, Kothapalle, Mulkanoor, Mutharam (P.K), Gatlanarsingapur, Kothakonda, Mallaram, Musthafpur


ప్రముఖ గ్రామాలు / పట్టణాలు



కొత్తకొండ (Kothakonda):

కొత్తకొండ వరంగల్ పట్టణ జిల్లా భీమదేవరపల్లి మండలమునకు చెందిన గ్రామము. ఇక్కడ శ్రీవీరభద్రస్వామి దేవాలయం ఉంది.
ముత్తారం (Muttaram):
ముత్తారం వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలమునకు చెందిన గ్రామము. ఇక్కడ కాకతీయుల కాలం నాటి పురాతన శివాలయం ఉంది. ఇది హన్మకొండలోని వేయిస్తంభాల దేవాలయాన్ని పోలిఉంటుంది.
ముల్కనూరు (Mulkanur):
ముల్కనూరు వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలమునకు చెందిన గ్రామము. మహిళా సహకార డెయిరీ వల్ల గ్రామం ప్రసిద్ధి చెందింది.2012లో ముల్కనూరు డెయిరీ దేశంలోనే ఉత్తమ డెయిరీగా ఎంపికైంది.
వంగర (Vangara):
వంగర వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలమునకు చెందిన గ్రామము. భారతదేశ ప్రధానమంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన పి.వి.నరసింహారావు ఈ గ్రామమునకు చెందినవారు.



ఇవి కూడా చూడండి:


ఫోటో గ్యాలరీ
c c
c c


హోం
విభాగాలు: వరంగల్ పట్టణ జిల్లా మండలాలు,  భీమదేవరపల్లి మండలము,
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Warangal Dist, 2016,
  • Handbook of Census Statistics, Warangal District, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 232 తేది: 11-10-2016 
  • కరీంనగర్ జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర,
  • https://warangalurban.telangana.gov.in/ (Official Website of Warangal Urban Dist),


Bheemadevarpalli Mandal in Telugu, Warangal Urban Dist (district) Mandals in telugu, Warangal Dist Mandals in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక