15, జనవరి 2017, ఆదివారం

సుర్జీత్ సింగ్ బర్నాలా (Surjit Singh Barnala)

సుర్జీత్ సింగ్ బర్నాలా
జననంఅక్టోబరు 21, 1925
రాష్ట్రంపంజాబ్,
పదవులుముఖ్యమంత్రి, గవర్నరు, కేంద్రమంత్రి,
మరణంజనవరి 14, 2017
భారతదేశపు ప్రముఖ రాజకీయ నాయకులలో ఒకరైన సుర్జీత్ సింగ్ బర్నాలా అక్టోబరు 21, 1925న పంజాబ్ లోని అటెలిలో జన్మించారు. పంజాబ్ ముఖ్యమంత్రిగా, తమిళనాడు, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవుల గవర్నరుగా, కేంద్రమంత్రిగా పనిచేశారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలోనూ పాల్గొన్నారు. 91 సంవత్సరాల వయస్సులో జనవరి 14, 2017న చండీగఢ్‌లో మరణించారు.

రాజకీయ ప్రస్థానం:

1969లో తొలిసారిగా హర్యానా మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఈయన హయంలోనే అమృత్‌సర్‌లో గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయం స్థాపించబడింది. 1977లో పార్లమెంటుకు ఎన్నికై మురార్జీదేశాయ్ మంత్రివర్గంలో వ్యవసాయ మరియు ఇతర శాఖలను నిర్వహించారు. 1978లో బంగ్లాదేశ్‌తో జరిగిన ఫరక్కా ఒప్పందంపై భారత్ తరఫున బర్మాలా సంతకం చేశారు. 1985-87 కాలంలో పంజాబ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.

1990-91 కాలంలో తమిళనాడు గవర్నరుగా, 1990-93 కాలంలో అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నరుగా విధులు నిర్వహించారు. 1998లో పార్లమెంటుకు ఎన్నికై వాజపేయి ప్రభుత్వంలో రసాయన & ఎరువుల శాఖ మంత్రిపదవి పొందారు. 2000-03 కాలంలో ఉత్తరాఖండ్ రాష్ట్ర తొలి గవర్నరుగా, 2003-04 కాలంలో ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా, అదే సమయంలో కొంతకాలం ఒరిస్సా గవర్నరుగా అదనపు బాధ్యతలు, ఆ తర్వాత 2011 వరకు తమిళనాడు గవర్నరుగా పదవి  నిర్వహించారు. తమిళనాడు గవర్నరుగా ఉన్న కాలంలో పుదుచ్చేరి గవర్నరుగా అదనపు బాధ్యతలు కూడా చేపట్టారు.
సుర్జీత్ సింగ్ బర్నాలా జనరల్ నాలెడ్జి


హోం,
విభాగాలు: 1925లో జన్మించినవారు, 2017లో మరణించినవారు, పంజాబ్ ముఖ్యమంత్రులు, తమిళనాడు గవర్నర్లు, ఆంధ్రప్రదేశ్ గవర్నర్లు, ఉత్తరాఖండ్ గవర్నర్లు, కేంద్రమంత్రులు


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక