7, జూన్ 2016, మంగళవారం

మిర్యాలగూడ మండలం (Miryalaguda Mandal)

జిల్లానల్గొండ జిల్లా
అసెంబ్లీ నియో.మిర్యాలగూడ అ/ని,
లోకసభ నియో.నల్గొండ లో/ని,
జనాభా158910 (2001),
175817 (2011),
మిర్యాలగూడ నల్గొండ జిల్లాకు చెందిన మండలము. సికింద్రాబాదు-గుంటూరు రైల్వే లైన్ మండలం గుండా వెళ్ళుచున్నది. మండలంలో 24 రెవెన్యూ గ్రామాలు, 22 గ్రామపంచాయతీలు కలవు. ఈ మండలము మిర్యాలగూడ  అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది.

సరిహద్దులు:
ఈ మండలానికి తూర్పున సూర్యాపేట జిల్లా, దక్షిణాన దామరచర్ల మండలం, పశ్చిమాన త్రిపురారం మండలం, ఉత్తరాన వేములపల్లి మండలం సరిహద్దులుగా ఉన్నాయి. మండల తూర్పు సరిహద్దు గుండా మూసీనది ప్రవహిస్తోంది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 158910, 2011 నాటికి జనాభా 16907పెరిగి 175817కు పెరిగింది. 2001 మరియు 2011 ప్రకారము జిల్లాలో అత్యధిక జనాభా కల మండలాలలో రెండవస్థానంలో ఉంది.
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 175817. ఇందులో పురుషులు 88426, మహిళలు 87391. పట్టణ జనాభా 104956, గ్రామీణ జనాభా 70861. 2011 జనాభా ప్రకారం ఈ మండలం జిల్లాలో 2వ స్థానంలో ఉంది. అక్షరాస్యత శాతం 73.88%. ఇది జిల్లాలో అత్యధిక అక్షరాస్యత శాతం కల మండలాలలో మూడవ స్థానంలో ఉంది.

రాజకీయాలు:
ఈ మండలము మిర్యాలగూడ  అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది.
మండల విశిష్టతలు:
2011 జనాభా లెక్కల ప్రకారం ఈ మండలం జిల్లాలో అత్యధిక అక్షరాస్యత శాతం కలిగిన మండలాలలో మూడవ స్థానంలో ఉంది.



విభాగాలు: నల్గొండ జిల్లా మండలాలు, మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గం,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక