30, జూన్ 2016, గురువారం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District)

జిల్లా కేంద్రంకొత్తగూడెం
విస్తీర్ణం8951 చకిమీ
జనాభా13.34 లక్షలు
మండలాలు24
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి. అక్టోబరు 11, 2016న కొత్తగా అవతరించిన ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 24 మండలాలు ఉన్నాయి. ఈ జిల్లా పరిపాలనకేంద్రం కొత్తగూడెం. ప్రముఖమైన శ్రీసీతారామాలయం నెలకొనియున్న భద్రాచలం ఈ జిల్లాలో ఉంది. ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు ఖమ్మం జిల్లాకు చెందినవి. ఈ జిల్లా తెలంగాణలో అతి తూర్పు జిల్లాగా ఖ్యాతిచెందింది. కిన్నెరసాని ప్రాజెక్టు, ప్రాచీనకాలం నాటి రాక్షసగుళ్ళు లభించిన గుండాల మండలం ఈ జిల్లాలో ఉన్నాయి. గోదావరి నది, దాని ఉపనది అయిన కిన్నెరసాని నదులు జిల్లా గుండా ప్రవహిస్తున్నాయి.

జిల్లా సరిహద్దులు:
ఈ జిల్లాకు పశ్చిమాన జయశంకర్ జిల్లా, మహబూబాబాదు జిల్లా మరియు ఖమ్మం జిల్లాలు ఉండగా, ఉత్తరాన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం, తూర్పున మరియు దక్షిణాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి.

మండలాలు:
కొత్తగూడెం, పాల్వంచ, టేకులపల్లి, యెల్లందు, చంద్రుగొండ, అశ్వారావుపేట, ముల్కలపల్లి, దమ్మపేట, గుండాల, జూలుర్‌పాడు, సుజాతానగర్, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, ఆళ్ళపల్లి, అన్నపురెడ్డిపల్లి, భద్రాచలం, దుమ్ముగూడెం, చెర్ల, బూర్గంపహాడ్, అశ్వాపురం, మణుగూరు, పినపాక, కరకగూడెం.

పట్టణాలు:
జిల్లాలో కొత్తగూడెం, ఇల్లెందు, పాల్వంచ, మణుగూరు పురపాలక సంఘాలుగా ఉన్నాయి.
భద్రాచలం శ్రీసీతారామలయం

ప్రాజెక్టులు:
కిన్నెరసాని ప్రాజెక్టు, సీతారాంసాగర్ ప్రాజెక్టు, తాలిపేరు ప్రాజెక్టు, పెదవాగు ప్రాజెక్టు, సింగభూపాలెం, మూకమామిడి.

రాజకీయాలు:
ఈ జిల్లాపరిధిలోని శాసనసభ నియోజకవర్గాలు: కొత్తగూడెం, ఇల్లందు, పినపాక, అశ్వారావుపేట, భద్రాచలం. లోకసభ నియోజకవర్గాలు: ఖమ్మం, మహబూబాబాదు.

పర్యాటక ప్రాంతాలు:
భద్రాచలం శ్రీసీతారామలయం, పర్ణశాల, కిన్నెరసాని అభయారణ్యం, 


ఇవి కూడా చూడండి:

విభాగాలు: తెలంగాణ జిల్లాలు, కొత్తగూడెం జిల్లా,


 = = = = =
ఆధారాలు:
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Rt No 237 Dt: 11-10-2016


Tags: News Districts in telangana, Kothagudem Dist in Telugu, kothagudem dist telugulo, 27 dists in telangana in telugu

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక