3, ఏప్రిల్ 2020, శుక్రవారం

ధర్మపురి మండలం (Dharmapuri Mandal)

ధర్మపురి మండలం
జిల్లా జగిత్యాల జిల్లా
రెవెన్యూ డివిజన్ జగిత్యాల
అసెంబ్లీ నియోజకవర్గంధర్మపురి
లోకసభ నియోజకవర్గంపెద్దపల్లి
ధర్మపురి జగిత్యాల జిల్లాకు చెందిన మండలము. ఇది జిల్లాలో ఉత్తరాన గోదావరి నది సరిహద్దులో ఉంది. మండల కేంద్రం ప్రముఖ అధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. మండలంలో 13 ఎంపీటీసి స్థానాలు, 25  గ్రామపంచాయతీలు, 13 రెవెన్యూ గ్రామాలు కలవు. రాష్ట్ర మంత్రిగా పనిచేసిన జువ్వాడి రత్నాకర్ రావు ఈ మండలమునకు చెందినవారు.

ఈ మండలం అక్టోబరు 11, 2016కు ముందు కరీంనగర్ జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన జగిత్యాల జిల్లాలోకి మారింది. అదేసమయంలో ఈ మండలాన్ని రెండుగా విభజించి 11 రెవెన్యూ గ్రామాలతో కొత్తగా బుగ్గారం మండలాన్ని ఏర్పాటుచేశారు.

భౌగోళికం, సరిహద్దులు:
భౌగోళికంగా ఈ మండలం జిల్లాలో ఈశాన్యాన మంచిర్యాల జిల్లా సరిహద్దులో గోదావరి తీరాన ఉంది. ఈ మండలానికి దక్షిణాన బుగ్గారం మండలం, పశ్చిమాన బీర్పూర్ మరియు సారంగాపూర్ మండలాలు, నైరుతిన జగిత్యాల గ్రామీణ మండలం, ఉత్తరాన మరియు తూర్పున మంచిర్యాల జిల్లా సరిహద్దుగా ఉంది.

రవాణా సౌకర్యాలు:
నిజామాబాదు-జగదల్ పూర్ జాతీయ రహదారి ఈ మండలం మీదుగా పోవుచున్నది.

రాజకీయాలు:
ఈ మండలము ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. రాష్ట్ర మంత్రిగా పనిచేసిన జువ్వాడి రత్నాకర్ రావు ఈ మండలమునకు చెందినవారు.

జనాభా:
2001 ప్రకారం మండల జనాభా 73230. ఇందులో పురుషులు 36124, మహిళలు 37106. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 76416. ఇందులో పురుషులు 37810, మహిళలు 38606.


ధర్మపురి మండలం  కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి

మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Arepalli, Dharmapuri, Donthapur, Donur, Jaina, Kamalapur, Nagaram, Nerella, Rajaram, Rayapatnam, Theegaladharmaram, Thimmapur, Thummenala

ప్రముఖ గ్రామాలు / పట్టణాలు

ధర్మపురి (Dharmapuri):
ధర్మపురి జగిత్యాల జిల్లాకు చెందిన పట్టణము మరియు మండల కేంద్రము. ధర్మపురిలో ప్రాచీనమైన శ్రీలక్ష్మీనరసింహాస్వామి ఆలయం ఉంది. 1425లో ప్రాచీన నరసింహాలయం ధ్వసం కాగా 1724-50 మధ్య ధర్మపురి వాసులు తిరిగి ఆలయాన్నినిర్మించారు. ఈ ఆలయం ప్రక్కనే రామలింగేశ్వరస్వామి గుడి ఉంది. దీనితో శైవ-వైష్ణవ ఆలయాలుగా ప్రసిద్ధి చెందింది. ధర్మపురి ఒకప్పుడు బ్రాహ్మణ అగ్రహారం. నరసింహ శతకం రాసిన కవి ఈ గ్రామానికి చెందినవారు. ఒకప్పుడు ఇచ్చట వేదపండితులు అధికంగా ఉండేవారు.
తిమ్మాపూర్ (Thimmapur):
తిమ్మాపూర్ జగిత్యాల జిల్లా ధర్మపురి మండలమునకు చెందిన గ్రామము. రాష్ట్ర మంత్రిగా పనిచేసిన జువ్వాడి రత్నాకర్ రావు ఈ గ్రామమునకు చెందినవారు.


ఇవి కూడా చూడండి:


ఫోటో గ్యాలరీ
ధర్మపురి స్థానం
జువ్వాడి రత్నాకర్ రావు

c c


హోం
విభాగాలు: జగిత్యాల జిల్లా మండలాలు,  ధర్మపురి మండలము,
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Karimnagar Dist, 2014,
  • Handbook of Census Statistics, Karimnagar District, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 226 తేది: 11-10-2016 
  • కరీంనగర్ జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర,
  • http://Jagitial.telangana.gov.in/ (Official Website of Jagityal Dist),


Dharmapuri Mandal, jagityal Dist (district) Mandal in telugu, JagityalaDist Mandals in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక