19, ఏప్రిల్ 2015, ఆదివారం

చౌటుప్పల్ మండలం (Chowtuppal Mandal)

జిల్లాయాదాద్రి భువనగిరి జిల్లా
జనాభా73320
రెవెన్యూ డివి.చౌటుప్పల్
అసెంబ్లీ నియో.మునుగోడు అ/ని
లోకసభ నియో.భువనగిరి లో/ని
చౌటుప్పల్ యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మండలము. ఈ మండలము చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. ఇది జిల్లాలో పశ్చిమాన రంగారెడ్డి జిల్లా సరిహద్దులో ఉంది. మండలం 17°15' 00" -17°15' 50" ఉత్తర అక్షాంశం, 78° 53' 35" -78° 54' 10" తూర్పు రేఖాంశం మధ్యలో విస్తరించియుంది. మండల సాధారణ వార్షిక వర్షపాతం 693.0 మిమీ. మండలంలో పండించే ముఖ్య పంటలు ప్రత్తి, వరి, కందులు,  ఆముదం. పూనా-విజయవాడ (9వ నెంబరు) జాతీయ రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. మండలంలో 17 రెవెన్యూ గ్రామాలు, 25 గ్రామపంచాయతీలు ఉన్నాయి.

సరిహద్దులు:
చౌటుప్పల్ మండలం జిల్లాలో పశ్చిమాన రంగారెడ్డి జిల్లా సరిహద్దులో ఉంది. ఉత్తరాన పోచంపల్లి, వలిగొండ మండలాలు, తూర్పున రామన్నపేట, చిట్యాల మండలాలు, దక్షిణాన నారాయణ్ పూర్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి. మండలం 17°15' 00" -17°15' 50" ఉత్తర అక్షాంశం, 78° 53' 35" -78° 54' 10" తూర్పు రేఖాంశం మధ్యలో విస్తరించియుంది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 65825, 2011 నాటికి జనాభా 7495 పెరిగి 73320 కు పెరిగింది. 2001 ప్రకారము జిల్లాలో అత్యధిక జనాభా కల మండలాలలో 9వ స్థానంలో ఉండగా 2011 నాటికి 8వ స్థానానికి చేరింది.  2001 ప్రకారం మండలంలో ఎస్సీల సంఖ్య 9229. ఎస్టీల సంఖ్య 1035. అక్షరాస్యత శాతం 45.19%. జనసాంద్రత 249/చకిమీ. స్త్రీపురుష నిష్పత్తి 946. పట్టణ జనాభా 14001, గ్రామీణ జనాభా 51824. మండలంలో 5000 జనాభా పైబడి ఉన్నా గ్రామాల సంఖ్య 4.
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 73320. ఇందులో పురుషులు 37292, మహిళలు 36028. పట్టణ జనాభా 19113, గ్రామీణ జనాభా 54207. 2011 జనాభా ప్రకారం ఈ మండలం జిల్లాలో 8వ స్థానంలో ఉంది.

చౌటుప్పల్ స్థానం
రవాణా సౌకర్యాలు:
పూనా-విజయవాడ 9వ నెంబరు జాతీయ రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. రైల్వే మార్గం కూడా తూర్పున సరిహద్దు మండలాలైన రామన్నపేట, చిట్యాల మండలాల గుండా వెళ్ళుచున్నది.

రాజకీయాలు:
ఈ మండలము మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 1967 కంటె ముందు మండలంలోని చిన్నకొండూరు అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రంగా ఉండేది.
2011 వరకు జడ్పీటీసి సభ్యునిగా అందెల లింగం యాదవ్, మండల అధ్యక్షులుగా వెలగా సుజాత పనిచేశారు.

వ్యవసాయం, నీటిపారుదల:
మండలంలో పండించే ముఖ్య పంటలు ప్రత్తి, వరి, కందులు,  ఆముదం. మండలంలో నీటిపారుదల కొరకు కాలువలు, చెరువులు లేవు. బోరుబావుల ద్వారా కొంతవరకు సాగవుతుంది. మండల సాధారణ వార్షిక వర్షపాతం 946 మిమీ.

పరిశ్రమలు - ఖనిజాలు:
మండలంలోని ముఖ్యమైన పరిశ్రమలు: నైల్ లిమిటెడ్ (పంతంగి), ప్రతిష్ట ఇండస్ట్రీస్ (ఎస్.లింగోటం), దివిస్ లాబొరేటొరీస్ లిమిటెడ్ (లింగోజీగూడెం). మండలంలో ఎలాంటి ముఖ్య ఖనిజ వనరులు లేవు. క్వార్ట్జ్స్, ఫెల్స్పార్, మెటల్ రాయి మాత్రం లభిస్తుంది.

వాణిజ్యం, బ్యాంకులు:
మండలంలో జాతీయ బ్యాంకులకు చెందిన 2 శాఖలు, గ్రామీణ బ్యాంకుకు చెందిన 2 శాఖలు, ఒక సహకార బ్యాంకు శాఖ ఉంది.

చౌటుప్పల్ గ్రామం
విద్యాసంస్థలు:
మండలంలో 46 ప్రాథమిక పాఠశాలలు (మండల పరిషత్తు 36 + ప్రైవేటు 10), 7 ప్రాథమికోన్నత పాఠశాలలు (2 మండల పరిషత్తు + 5 ప్రైవేటు), 28 ఉన్నత పాఠశాలలు (2 రాష్ట్ర ప్రభుత్వ, 16 జిల్లా పరిషత్తు, 10 ప్రైవేటు), 9 జూనియర్ కళాశాలలు (ఒకటి ప్రభుత్వ + 8 ప్రైవేటు), 3 డిగ్రీ కళాశాలలు, 3 వృత్తివిద్యా కళాశాలలున్నాయి. ఒక ఆశ్రమ పాఠశాల, ఒక కస్తూర్బా బాలికల పాఠశాల ఉంది.
మొత్తం 17 గ్రామాలకు ప్రాథమిక పాఠశాలలు అందుబాటులో ఉండగా, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 13 గ్రామాలకు, జూనియర్ కళాశాల ఒక గ్రామానికి అందుబాటులో ఉన్నాయి.

మండలంలోని గ్రామాలు:
Allapuram, Chinna Kondur, Choutuppal, Devalamma Nagaram, Jai Kesaram, Khairathpur, Lakkaram, Lingojigudem, Malkapur, Nelapatla, Panthangi, Peepal Pahad, S.Lingotam, Tallasingaram, Thangadapally, Tupranpet, Yellagiri
 
మండలంలోని ముఖ్యమైన గ్రామాలు/పట్టణాలు
అంకిరెడ్డి గూడెం (Ankireddy gudem):
అంకిరెడ్డిగూడెం యాదాద్రి భువనగిరి జిలా చౌటుప్పల్ మండలమునకు చెందిన గ్రామము. ఈ గ్రామం ఆదర్శగ్రామంగా ప్రసిద్ధి చెందింది. ఆగస్టు 2015లో సంపుర్ణ అక్షరాస్యత సాధించగా, మార్చి 2017లో పూర్తి నగదురహిత గ్రామంగా పేరుసంపాదించింది. తెలంగాణలో పూర్తి అక్షరాస్యత సాధించిన తొలి గ్రామంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి సెప్టెంబరు 8, 2015న అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా సర్పంచి మల్లేష్ గౌడ్ అవార్డు స్వీకరించారు.
చిన్నకొండూరు (China Kondur):
చిన్నకొండూరు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలమునకు చెందిన గ్రామము. 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5945. 1967 కంటె ముందు ఇది అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రంగా ఉండేది. కొండా లక్ష్మణ్ బాపూజీ ఈ నియోజకవర్గానికి ప్రాటినిధ్యం వహించారు.
మల్కాపూర్ (Malkapur):
మల్కాపూర్ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల మండలమునకు చెందిన గ్రామము. దండు మల్కాపుర్ వద్ద అతిపెద్ద అతిపెద్ద పారిశ్రామికపార్కు ఏర్పాటుచేస్తున్నారు.
పంతంగి (Panthangi):
పంతంగి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలమునకు చెందిన గ్రామము. ఇది హైదరాబాదు-విజయవాడ జాతీయ రహదారి (No 65) పై ఉన్నది. గ్రామంలో జాతీయ రహదారి టోల్ గేట్ ఉంది.
పీపల్ పహాడ్ (Pipal Pahad):
పీపల్‌పహాడ్ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలమునకు చెందిన గ్రామము. మార్చి 2, 2020న ఈ గ్రామానికి చెందిన దివ్యాంగుడు చిదుగుళ్ల శేఖర్‌గౌడ్‌ ఆస్ట్రేలియాలో ఎత్తైన శిఖరం కొసిస్కోను అధిరోహించాడు.
 

ఫోటో గ్యాలరీ
c
c c



హోం,
;విభాగాలు:
యాదాద్రి భువనగిరి జిల్లా మండలాలు, చౌటుప్పల్ మండలం,


= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Nalgonda Dist, 2012,
  • Handbook of Census Statistics, Nalgonda District, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 247 తేది: 11-10-2016 
  • నల్గొండ జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక