3, ఫిబ్రవరి 2015, మంగళవారం

నెల్లూరు జిల్లా (Nellore District)

నెల్లూరు జిల్లా
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
వైశాల్యం13,076 చకిమీ
జనాభా29,66,082
మండలాలు46
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలలో ఒకటి. కోస్తా జిల్లాలలో అతి దక్షిణాన ఉన్న ఈ జిల్లా 13,076 చకిమీ వైశాల్యం మరియు 29,66,082 జనాభాను కలిగియుంది. పెన్నానది జిల్లా మధ్యగుండా ప్రవహిస్తుండగా 5వ నెంబరు జాతీయ రహదారి మరియు చెన్నై - కోల్‌కత రైలుమార్గం ఉత్తర-దక్షిణంగా జిల్లా గుండా వెళ్ళుచున్నవి. జిల్లాలో ఉదయగిరి కోట, పులికాట్ సరస్సు, శ్రీహరికోట, కృష్ణపట్నం ఓడరేవు, నేలపట్టు ప్రముఖ పర్యాటక కేంద్రాలు. పొట్టిశ్రీరాములు, ఎం.వెంకయ్యనాయుడు, పుచ్చలపల్లి సుందరయ్య, బెజవాడ గోపాలరెడ్డి, తిక్కన కవి, శ్రీనాథుడు, నేదురుమల్లి జనార్థన్ రెడ్డి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణిశ్రీ జిల్లాకు చెందిన ప్రముఖులు. జిల్లాలో 46 రెవెన్యూ డివిజన్లు, 10 అసెంబ్లీ నియోజకవర్గాలు కలవు.

భౌగోళికం, సరిహద్దులు:
నెల్లూరు జిల్లాకు తూర్పున బంగాళాఖాతం, ఉత్తరాన ప్రకాశం జిల్లా, పశ్చిమాన కడప జిల్లా, దక్షిణాన చిత్తూరు జిల్లా మరియు తమిళనాడు రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి. తూర్పు కనుములు జిల్లాలో విస్తరించియున్నాయి. పెన్నానది జిల్లాను ఉత్తర-దక్షిణాలుగా విభజిస్తున్నది. దక్షిణాన తమిళనాడు సరిహద్దులో పులికాట్ సరస్సు ఉంది.

ఉదయగిరి కోట
చరిత్ర:
నెల్లూరు జిల్లా చరిత్ర చాలా ప్రాచీనమైనది. చరిత్రలో ఈ ప్రాంతం ముండరాష్ట్రంగా పిలువబడింది. క్రీ.శ.3వ శతాబ్దిలో పల్లవులు, 7వ శతాబ్దిలో పశ్చిమా చాళుక్యులు అధీనంలోకి తెచ్చుకున్నారు. ఆ తర్వాత వేంగీ సామ్రాజ్యంలో, చోళ-చాళుక్య రాజ్యంలో భాగంగా కొనసాగింది. చోళులు ఇప్పటి నెల్లూరు పట్టణాన్ని విక్రమసింహపురి పేరుతో రాజధానిగా చేసుకొని పాలించారు. మనుమసిద్ధి కాలంలో పాండ్యరాజు ఆక్రమించగా గణపతిదేవుని సహాయంతో మళ్ళీ రాజ్యాన్ని పొందాడు. గజపతుల కాలంలో ఉదయగిరిలో వారి ప్రతినిధులు పాలించారు. కాకతీయ పాలనలో భాగంగా ఉన్నప్పుడు ఢిల్లీ సుల్తానులు కాకతీయ రాజ్యాన్ని వశపర్చుకొనడంతో ఇది కూడా వారి అధీనంలోకి వెళ్ళింది. తర్వాత విజయనగర రాజులు, గోల్కొండ సుల్తానులు, మొఘలులు పాలించారు. చివరికి బ్రిటీష్ పాలనలోకి వచ్చింది. 1953 వరకు మద్రాసు రాష్ట్రంలో, ఆ తర్వాత ఆంధ్రరాష్ట్రంలో, 1956 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ఉంది. 2008లో జిల్లాపేరును పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చారు.

పులికాట్ సరస్సు
రవాణా సౌకర్యాలు:
చెన్నై నుంచి కోల్‌కత వరకు ఉన్న ప్రధాన రైలుమార్గం జిల్లా గుండా ఉత్తర-దక్షిణాలుగా వెళ్ళుచున్నది. దాదాపు దానికి సమాంతరంగా 5వ నెంబరు జాతీయరహదారి కూడా వెళుతుంది. కావలి, గూడూరు, కొవ్వూరు, నెల్లూరు జాతీయరహదారిపై ఉన్న ప్రధాన పట్టణాలు. ఇవి కాకుండా ఉదయగిరి, ఆత్మకూరు, వెంకటగిరి తదితర పట్టణాలను కలుపుతూ రహదారులున్నాయి. గూడూరు నుంచి ఏర్పేడు వరకు మరో రైలుమార్గం కూడా ఉంది.

రాజకీయాలు:
ప్రముఖ రాజకీయ నాయకులు నేదురుమల్లి జనార్థన్ రెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య, బెజవాడ గోపాలరెడ్డి, ఎం.వెంకయ్యనాయుడు ఈ జిల్లాకు చెందినవారు. జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 లోకసభ నియోజకవర్గాలు కలవు. 2009లో తెలుగుదేశం పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీలు చెరో 5 స్థానాలలో విజయం సాధించగా, 2014 ఎన్నికలలో వైకాపా 7, తెలుగుదేశం పార్టీ 3 స్థానాలలో విజయం సాధించాయి.
 
 
ఇవి కూడా చూడండి:


హోం,
విభాగాలు:
ఆంధ్రప్రదేశ్ జిల్లా వ్యాసాలు, నెల్లూరు జిల్లా,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక