1, ఫిబ్రవరి 2015, ఆదివారం

ఆదిలాబాదు (Adilabad)

ఆదిలాబాదు
జిల్లాఆదిలాబాదు జిల్లా
జనాభా1,17,388 (2011)
పిన్‌కోడ్504001
ఆదిలాబాదు జిల్లా పరిపాలన కేంద్రమైన ఆదిలాబాదు పట్టణం జిల్లాలో ఉత్తరం భాగాన 44వ నెంబరు (పాతపేరు 7) జాతీయ రహదారిపై ఉంది. రంజన్ల తయారీకి పేరుగాంచిన ఈ పట్టణం చరిత్రలో ఏదులాపురంగా పిలువబడి ఆసిల్‌షా పేరిట ప్రస్తుత పేరుకు మార్చబడింది. 2011 లెక్కల ప్రకారం 1,17,388 జనాభా కలిగియున్న ఈ పట్టణం జిల్లాలో ప్రథమస్థానంలోనూ, తెలంగాణలో 9వ స్థానంలోనూ ఉంది. ముద్‌ఖేడ్ పింపల్‌కుట్టి రైలుమార్గం ఆదిలాబాదు పట్టణం గుండా వెళ్ళుచున్నది. ఇది ఆదిలాబాదు అసెంబ్లీ మరియు ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గాలకు కేంద్రస్థానంగా ఉంది.

భౌగోళికం:
భౌగోళికంగా ఆదిలాబాదు పట్టణం తెలంగాణలో అతి ఉత్తరాన ఉంది. పెన్‌గంగ నది మరియు మహారాష్ట్ర సరిహద్దు సమీపంలో ఉన్నాయి. సముద్ర మట్టానికి 264 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పట్టణం సమీపంలో సహ్యాద్రి పర్వతాలు విస్తరించియున్నాయి. 

చరిత్ర:
శాతవాహనుల కాలం నుంచి ప్రాచీన చరిత్రను కలిగిన ఈ ప్రాంతాన్ని మౌర్యులు, చాళుక్యులు పాలించారు. గోదావరి నదికి ఉత్తర భాగంలో ఉండుటచే మధ్యయుగంలో తెలంగాణ చరిత్రతో ఎక్కువ సంబంధం లేదు. ఆ తర్వాత బీజాపూర్ సుల్తానులు, నిజాంలచే పాలించబడి 1948లో భారత యూనియన్‌లో భాగమైంది. 1948-56 కాలంలో హైదరాబాదు రాష్ట్రంలోనూ, 1956-2014 కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా కొనసాగి ప్రస్తుతం తెలంగాణలో ఒక ప్రముఖ పట్టణంగా విలసిల్లుతోంది.

ఆదిలాబాదు రైల్వేస్టేషన్
రవాణా సౌకర్యాలు:
44వ నెంబరు జాతీయ రహదారి (పాతపేరు7వ నెంబరు) ఆదిలాబాదు పట్టణం గుండా వెళ్ళుచున్నది. ఇక్కడి నుంచి జిల్లాలోని మరియు సమీప మహారాష్ట్రలోని ప్రధాన పట్టణాలకు మంచి రవాణా సౌకర్యాలున్నాయి. ముద్‌ఖేడ్ - పింపల్‌కుట్టి రైలుమార్గం కూడా పట్టణం మీదుగా వెళ్ళుచున్నది. ఆదిలాబాదు నుంచి జాతీయ రహదారికి సమాంతరంగా నిర్మల్ మీదుగా నిజామాబాదు వరకు రైలుమార్గం నిర్మించాలనే ప్రతిపాదన కూడా ఉంది.

రాజకీయాలు:
పూర్వం పట్టణంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండగా 1983లో తెలుగుదేశం పార్టీ అవతరణ తర్వాత ఆ పార్టీ ఆధిక్యం నిలుపుకుంది. ఇటీవలి కాలంలో తెలంగాణ రాష్ట్ర సమితి పట్టణంలో బలంగా మారింది.


సంస్కృతి:
ఆదిలాబాదు పట్టణం మహారాష్ట్ర సరిహద్దుకు సమీపంలో ఉండుట మరియు చరిత్రలో చాలా కాలం మహారాష్ట్ర ప్రాంతాలతో సంబంధం ఉండుటచే ఇక్కడ భాష మరియు వేషధారణలో మరాఠి ప్రభావం అధికంగా ఉంది. తెలుగు, ఉర్దూలతో పాటు మరాఠి మాటలు కూడా ఇక్కడ వినిపిస్తుంటాయి.
ఆదిలాబాదు జిల్లా జనరల్ నాలెడ్జి

ఇవి కూడా చూడండి:



విభాగాలు: ఆదిలాబాదు జిల్లా, తెలంగాణ పట్టణాలు, తెలంగాణ జిల్లా పరిపాలన కేంద్రాలు,


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • ఆదిలాబాదు జిల్లా అధికారిక వెబ్‌సైట్,
  • ఆంధ్రప్రదేశ్ దర్శిని,
  • 2011 జనాభా గణాంకాలు,
  • ఆదిలాబాదు జిల్లా స్వాతంత్ర్యోద్యమ చరిత్ర,
  • రైల్వే వెబ్‌సైట్,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక