29, జనవరి 2015, గురువారం

వరంగల్ (Warangal)

 వరంగల్
రాష్ట్రంతెలంగాణ
జనాభా7,59,594 (2011)
చరిత్రలో ఓరుగల్లుగా, ఏకశిలానగరంగా పిలువబడిన వరంగల్ నగరం వరంగల్ జిల్లాకు పరిపాలన కేంద్రముగా ఉంది. హైదరాబాదుకు ఈశాన్యంలో 150 కిమీ దూరంలో ఉన్న వరంగల్ తెలంగాణ సాంస్కృతిక రాజధానిగా విలసిల్లుతోంది. కాకతీయ సామ్రాజ్యానికి రాజధానిగా ఉంటూ చరిత్రలో ప్రఖ్యాతిగాంచిన ఈ నగరంలో మరియు పరిసరాలలో పలు చారిత్రక ఆధారాలు లభ్యమైనాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నంగా ఉన్న ఓరుగల్లు శిలాతోరణం ఈ నగరానికి చెందినదే. కాకతీయులు, బహమనీలు, గోల్కొండ సుల్తానులు, ఆసఫ్‌జాహీలు, నిజాంషాహీలచే పాలించబడిన ఈ నగరం 1948లో హైదరాబాదు సంస్థాన విమోచనం అనంతరం హైదరాబాదు రాష్ట్రంలోనూ, 1956-2014 కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ఉండి ప్రస్తుతం తెలంగాణలో రెండో పెద్ద నగరంగా కొనసాగుతోంది. 2011 లెక్కల ప్రకారం నగర జనాభా 7,59,594. ప్రసిద్ధి చెందిన కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్ నిట్, కాజీపేట జంక్షన్‌లు నగర పరిధిలో ఉన్నాయి.


భౌగోళికం:
వరంగల్ 18.0° ఉత్తర అక్షాంశం, 79.58° తూర్పు రేఖాశంపై ఉంది. సముద్ర మట్టానికి 302 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ నగరం తెలంగాణ రాష్ట్రంలో దాదాపు మధ్యలో ఉంది. నగర పరిధి 409 చదరపు కిలోమీటర్లు. సముద్రానికి దూరంగా ఉండుట వల్ల ఇక్కడ వాతావరణం వేడిగా ఉంటుంది. జూన్ నుంచి సెప్టెంబరులలో రుతుపవనాల వల్ల వర్షపాతం కురుస్తుంది.

చరిత్ర:
క్రీ.శ.12-14 శతాబ్దాలలో పరిపాలించిన కాకతీయుల సామ్రాజ్యానికి వరంగల్ రాజధానిగా కొనసాగింది. కాకతీయుల నిర్మించిన ఎన్నో కట్టడాలు ఈ నగరంలో మరియు నగర పరిసరాలలో ఉన్నాయి. వరంగల్ కోట, వేయిస్థంభాల గుడి, వీటిలో ముఖ్యమైనవి. కాకతీయుల పాలన గురించి ఓరుగల్లు నగర వైభవం గురించి ఇటలీ యాత్రికుడు మార్కోపోలో తన రచనలలో రాసాడు. 14 వ శతాబ్దంలో ఢిల్లీ తుగ్లక్ సుల్తానుల చేతిలో కాకతీయులు ఓడిపోవడంతో ఇది ముసునూరి నాయకులు, రేచెర్ల నాయకులు, బహమనీ సుల్తానులు, గోల్కొండను పాలించిన దక్కను సుల్తానుల పాలనలోకి వచ్చింది. ఔరంగజేబు గోల్కొండను 1687 లో ఆక్రమించినపుడు ఇది మొగలు సామ్రాజ్యంలో భాగమయింది. తరువాత 1724లో ఈ సామ్రాజ్యంలోని దక్షిణ ప్రాంతం విడివడి హైదరాబాదు రాజ్యం ఏర్పడినపుడు వరంగల్లు ఆ రాజ్యంలో భాగమైంది. 1948లో తెలంగాణ విమోచనోద్యమం ఫలితంగా హైదరాబాదు సంస్థానంతో పాటు వరంగల్లు కూడా భారతదేశంలో యూనియన్‌లో కలిసిపోయింది. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా హైదరాబాదు రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రంతో కలిసి ఆంధ్ర ప్రదేశ్‌ ఏర్పడటంతో ఈ నగరం ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా కొనసాగి జూన్ 2, 2014న తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణలో హైదరాబాదు తర్వాత రెండో పెద్ద నగరంగా కొనసాగుతోంది.

జనాభా:
2011 లెక్కల ప్రకారం నగర జనాభా 7,59,594. మెట్రోపాలిటన్ జనభా 9,18,809. పరిసరాలలోని 44 గ్రామల విలీనంతో నగర జనాభా 10లక్షలు దాటింది. 28 జనవరి 2014న ఈ నగరానికి గ్రేటర్ హోదా కల్పించబడింది.  నగర అక్షరాస్యత శాతం 82.56%. 

వరంగల్ నగర పాలక సంస్థ
పాలన:
వరంగల్ నగర పాలన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్‌చే కొనసాగుతుంది. దీని పరిధిలో 3 నగరాలు (వరంగల్, హన్మకొండ, కాజీపేట) మరియు పలు గ్రామాలు ఉన్నాయి. పూర్వం పురపాలక సంఘంగా ఉన్న వరంగల్ 1994లో కార్పోరేషన్ హోదా పొందింది. 2014 జనవరిలో గ్రేటర్ హోదా కల్పించబడింది. నగర పరిధిలో 58 డివిజన్లు, 67 రెవెన్యూ వార్డులు కలవు.

వరంగల్ రైల్వేస్టేషన్
రవాణా సౌకర్యాలు:
గ్రేటర్ వరంగల్‌లో భాగంగా ఉన్న కాజీపేట దక్షిణ మధ్యరైల్వేలోనే ప్రముఖ రైల్వే జంక్షన్‌లలో ఒకటి. ఉత్తర భారతదేశానికి, దక్షిణ భారతానికి అనుసంధానంగా వ్యహరించే ఈ జంక్షన్ నుంచి రీజూ 100కు పైగా రైళ్ళు దేశంలోని అని ప్రాంతాలను వెళ్ళుతాయి. ఇదే కాకుండా నగర పరిధిలో వరంగల్ స్టేషన్, కాజీపేట సిటి, హసన్‌పర్తి రోడ్, వంచనగిరి స్టేషన్లు ఉన్నాయి. రోడ్డు పరంగా కూడా వరంగల్‌కు మంచి సౌకర్యాలు కలవు. హైదరాబాదు నుంచి భూపాలపట్నం వెళ్ళు జాతీయ రహదారి సంఖ్య 163 (పాతపేరు 202) నగరం గుండా వెళ్ళుచున్నది. ఇకడి నుంచి హైదరాబాదు, ఖమ్మం, కరీంనగర్, విజయవాడ, నిజామాబాదు తదితర నగరాలకు మంచి రవాణా సౌకర్యముంది. కాజీపేట దక్షిణ మధ్యరైల్వేలో డివిజన్ కేంద్రంగా ఉంది. నగరంలో విమానాశ్రయం ఏర్పాటుకు సన్నాహాలు కూడా జరుగుతున్నాయి.

పర్యాటక ప్రాంతాలు:
12వ శతాబ్ది నాటి వేయిస్తంభాల దేవాలయం, కాకతీయుల కాలం నాటి ఓరుగల్లు కోట, నగరం నడిబొడ్డున ఉన్న 7వ శతాబ్ది నాటి భద్రకాళి దేవాలయం నగరంలో ఉండగా నగర పరిసరాలలో పలు పురాతన ఆలయాలు, చెరువులు ఉన్నాయి.

వరంగల్ నిట్
విద్యాసౌకర్యాలు:
తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ విశ్వవిద్యాలయాలో ఒకటైన కాకతీయ విశ్వవిద్యాలయం ఈ నగరంలోనే ఉంది.  దేశంలోనే అత్యుత్తమైన సాంకేతిక సంస్థలలో ఒకటైన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఈ నగరానికి చెందినదే. కాకతీయ మెడికల్ కాలేజి, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయంతో పాటు పలు విద్యాసంస్థలు, శిక్షణా సంస్థలు నగర పరిధిలో ఉన్నాయి.


హోం,
విభాగాలు:
భారతదేశ నగరాలు, తెలంగాణ నగరాలు, వరంగల్ జిల్లా, వరంగల్, కాకతీయ సామ్రాజ్యం,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక