14, అక్టోబర్ 2014, మంగళవారం

జి.వెంకట స్వామి (G.Venkata Swamy)

జి.వెంకట స్వామి (కాకా)
జననం5 అక్టోబరు, 1929
జిల్లాకరీంనగర్ జిల్లా
పదవులు7 సార్లు ఎంపి, కేంద్రమంత్రి, పిసిసి అధ్యక్షుడు,
మరణండిసెంబరు 22, 2014
5 అక్టోబరు, 1929న హైదరాబాదులో జన్మించిన గడ్డం వెంకటస్వామి లేదా గుడిసెల వెంకటస్వామి (కాకా) తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. ఆరు దశాబ్దాల సుధీర్ఘ రాజకీయ జీవితంలో వెంకటస్వామి 7 సార్లు లోకసభకు ఎన్నికయ్యారు. పిసిసి అధ్యక్షుడిగా, కేంద్రమంత్రిగానూ పనిచేశారు.డిసెంబరు 22, 2014న మరణించారు.

రాజకీయ ప్రస్థానం:
హైదరాబాదులో కార్మిక నాయకుడిగా రాజకీయ ప్రస్థానం ఆరంభించిన వెంకటస్వామి తొలిసారి 1957లో సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. 1967లో సిద్ధిపేట లోకసభ నియోజకవర్గం నుంచి ఎన్నికై 1969, 1971, 1977లలో అదే స్థానం నుంచి ఎంపి అయ్యారు. 1989, 1991, 1996లలో పెద్దపల్లి నియోజకవర్గం నుంచి లోకసభకు ఎన్నికయ్యారు. 1998, 1999లలో ఓడిపోయారు. చివరిసారిగా 2004లో కూడా పెద్దపల్లి నుంచి గెలుపొంది 2009లో వయోభారం వల్ల పోటీచేయక ఆయన కుమారుడు గడ్డం వినోద్‌కు టికెట్ ఇప్పించి గెలిపించారు.

కుటుంబం:
వెంకటస్వామి కుమారులు కూడా రాజకీయ రంగంలో ఉన్నారు. గడ్డం వినోద్ 2009లో పెద్దపల్లి నుంచి లోకసభకు ఎన్నికయ్యారు. 

విభాగాలు: కరీంనగర్ జిల్లా రాజకీయ నాయకులు, సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం, సిద్ధిపేట లోకసభ నియోజకవర్గం, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులు, 4వ లోకసభ సభ్యులు, 5వ లోకసభ సభ్యులు, 6వ లోకసభ సభ్యులు, 9వ లోకసభ సభ్యులు, 10వ లోకసభ సభ్యులు, 11వ లోకసభ సభ్యులు, 14వ లోకసభ సభ్యులు, 


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక