14, సెప్టెంబర్ 2014, ఆదివారం

జయలలిత (Jayalalitha)

 జయలలిత
జననంఫిబ్రవరి 24, 1948
జన్మస్థానంమైసూరు
రంగంసినీనటి, రాజకీయాలు,
పదవులు3సార్లు తమిళనాడు ముఖ్యమంత్రి,
మరణం
డిసెంబరు 5, 2016
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న జె.జయలలిత ఫిబ్రవరి 24, 1948న మైసూరులో జన్మించారు. జయలలిత అసలు పేరు కోమలవల్లి. ఈమె అలనాటి సినీ నటి సంధ్య కూతురు. రాజకీయాలలోకి చేరకముందు సినీనటిగా రాణించింది. ఈమెను అభిమానులు జయలలితను అమ్మ అని, పురచ్చి తలైవి (విప్లవాత్మక నాయకురాలు) అని పిలుస్తుంటారు. 1981లో రాజకీయాలలో ప్రవేశించి అప్పటి ముఖ్యమంత్రి ఎం.జి.రామచంద్రన్‌కు సన్నిహితంగా ఉంటూ రాజకీయాలపై పట్టు సాధించింది. 1991లో తొలిసారిగా తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జయలలిత 2002లో రెండోసారి, 2011లో మూడవసారి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించగా సెప్టెంబరు 27, 2014న బెంగుళూరు కోర్టు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తీర్పు ఇవ్వడంతో ముఖ్యమంత్రి పదవి కోల్పోయారు. మే 23, 2015న మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. డిసెంబరు 5, 2016న మరణించారు

సినీప్రస్థానం:
జయలలిత రాజకీయ రంగప్రవేశానికి మునుపు తమిళ చిత్ర రంగములో విజయవంతమైన సినీ నటి. కుటుంబ పరిస్థితులవలన ఈమె తల్లి బలవంతముతో తన 15వ యేట సినిమా రంగములో ప్రవేశించినది. జయలలిత తొలి సినిమా చిన్నడ గొంబె కన్నడ చిత్రము పెద్ద హిట్టయ్యింది. ఈమె తొలి తెలుగు సినిమా మనుషులు మమతలు ఈమెను పెద్దతార స్థాయికి తీసుకెళ్లింది. 1972లో తమిళనాడు ప్రభుత్వము జయలలితను కళైమామణి పురస్కారముతో సత్కరించినది.

రాజకీయ ప్రస్థానం:
1981లో తమిళనాడు రాజకీయాలలో ప్రవేశించి, 1984లో తమిళనాడు నుంచి రాజ్యసభ ఎన్నికైనది. అప్పటి ముఖ్యమంత్రి యం.జి.రామచంద్రన్ కు సన్నిహితంగా మెలిగింది. ఎం.జి.రామచంద్రన్ మరణానంతరం ఆయన భార్య జానకి రామచంద్రన్ తమిళనాడు ముఖ్యమంత్రి అయిననూ ఆమె ఎక్కువ రోజులు పదవిలో కొనసాగలేకపోయింది. గ్లామర్ వల్ల జయలలిత 1989 అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి తొలి మహిళా ప్రతిపక్ష నాయకురాలిగా స్థానం సంపాదించింది. 1991లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించింది. 5 సంవత్సరాలు పూర్తి కాలం పదవిలో ఉన్నరు. ఆ తర్వాత 2002 నుంచి 2006 వరకు ముఖ్యమంత్రి పదవి నిర్వహించారు. 2011లో పార్టీని విజయపథంలో నడిపించి మూడవసారి పదవి చేపట్టగా సెప్టెంబరు 27, 2014న బెంగుళూరు కోర్టు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తీర్పు ఇవ్వడంతో ముఖ్యమంత్రి పదవి కోల్పోయారు.కర్ణాటక కోర్టు నిర్దోషిగా తీర్పు ఇవ్వడంతో మళ్ళీ మే 23, 2015న మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
 
 
 



విభాగాలు: తమిళనాడు ముఖ్యమంత్రులు, భారతదేశ ప్రముఖ మహిళలు, భారతదేశ రాజకీయ నాయకులు, 1948లో జన్మించినవారు, మహిళా ముఖ్యమంత్రులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక