9, ఆగస్టు 2014, శనివారం

కర్ణాటక (Karnataka)

కర్ణాటక
రాజధానిబెంగళూరు
విస్తీర్ణము192,000 చ.కి.మీ
జనాభా6,11,30,704
అధికార భాషకన్నడ
భారతదేశంలోని 28 రాష్ట్రాలలో ఒకటైన కర్ణాటక రాష్ట్రము దక్షిణ భారతదేశంలో పశ్చిమం వైపున అరేబియా సముద్రం తీరాన ఉంది. 1973 వరకు మైసూరు రాష్ట్రముగా వ్యవహరించబడిన ఈ రాష్ట్రం 1956లో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా కన్నడ మాట్లాడే ప్రాంతాలు కలుపుకొని ఏర్పడింది. కర్ణాటక రాజధాని మరియు పెద్ద నగరము బెంగళూరు. మైసూరు, మంగుళూరు, హుబ్లి-ధార్వాడ్, బళ్ళారి మరియు బెళగామ్‌ రాష్ట్రములోని ఇతర ముఖ్య నగరాలు. కన్నడ ఈ రాష్ట్ర అధికార భాష. రాష్ట్ర విస్తీర్ణము 192,000 చ.కి.మీ. 2011 లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 6,11,30,704. రాష్ట్రంలో 30 జిల్లాలు కలవు. కృష్ణా మరియు కావేరి రాష్ట్రం గుండా ప్రవహించే ముఖ్యమైన నదులు. దక్షిణ భారతదేస చరిత్రలో ప్రముఖ స్థానం వహించిన విజయనగర సామ్రాజ్యం కర్ణాటక దక్షణ భాగంలో విలసిల్లింది. రాష్ట్రపతిగా పనిచేసిన బి.డి.జెట్టి, ప్రధానమంత్రిగా పనిచేసిన దేవెగౌడ, జ్ఞాన్‌పీఠ్ పురస్కార గ్రహీతలు కువెంపు (కె.వి.పుట్టప్ప), శివరాం కారంత్, యు.ఆర్.అనంతమూర్తి, ప్రముఖ క్రికెట్ క్రీడాకారులు అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్, జవగళ్ శ్రీనాథ్, గుండప్ప విశ్వనాథ్, ఈ.ఏ.ఎస్.ప్రసన్న, బి.చంద్రశేఖర్ కర్ణాటకకు చెందినవారు.

భౌగోళికం, సరిహద్దులు:
కర్ణాటక రాష్ట్రానికి పశ్చిమాన అరేబియా సముద్రం, వాయువ్యాన గోవా, ఉత్తరాన మహారాష్ట్ర, ఈశాన్యాన తెలంగాణ, తూర్పున ఆంధ్రప్రదేశ్, ఆగ్నేయాన తమిళనాడు, నైరుతిన కేరళ రాష్ట్రాలు సరిహద్దులుగా ఉన్నాయి. రాష్ట్ర వైశాల్యము 191,791 చకిమీ. దేశంలో ఇది 7వ పెద్ద రాష్ట్రము.

గోమటేశ్వర విగ్రహం
చరిత్ర:
కర్ణాటక చరిత్ర పురాణ కాలమునాటిది. రామాయణములో వాలి, సుగ్రీవుడు మరియు వానర సేన యొక్క రాజధాని ప్రస్తుత బళ్లారి జిల్లాలోని హంపి అని భావిస్తారు. క్రీ.పూ. 4వ శతాబ్దములో శాతవాహనులు ఈ ప్రాంతమున అధికారమునకు వచ్చి దాదాపు 300 సంవత్సరాలు పరిపాలించారు. ఈ వంశము క్షీణించడముతో ఉత్తరమున కాదంబులు, దక్షిణమున గాంగులు అధికారమునకు వచ్చారు. అత్యంత ఎత్తైన గోమటేశ్వరుని ఏకశిలా విగ్రహము గాంగుల కాలమునాటి కట్టడమే. బాదామీ చాళుక్యులు క్రీ.శ.500 - 735 వరకు నర్మదా నదీ తీరమునుండి కావేరీ నది వరకు గల విస్తృత ప్రాంతాన్ని పరిపాలించారు. బాదామీ చాళుక్యులు బాదామీ, ఐహోల్ మరియు పట్టడకళ్ లో అద్భుతమైన రాతి కట్టడాలను కట్టించారు. వీరి తరువాత 753 నుండి 973 వరకు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన మల్ఖేడ్ కు చెందిన రాష్ట్రకూటులు కనౌజ్ పాలకులపై కప్పము విధించారు. ఈ కాలములో కన్నడ సాహిత్యము ఎంతగానో అభివృద్ధి చెందినది. క్రీ.శ. 973 నుండి 1183 వరకు పరిపాలించిన కళ్యాణీ చాళుక్యులు మరియు వీరి సామంతులైన హళిబేడు హొయసలులు అనేక అద్భుతమైన దేవాలయాలను కట్టించి సాహిత్యము మొదలైన కళలను ప్రోత్సహించారు. వీరశైవ మతగురువైన బసవేశ్వర కళ్యాణీలోనే మంత్రిగా ఉండేవాడు. విజయనగర సామ్రాజ్యము దేశీయ సాంప్రదాయాలకు పెద్దపీట వేసి కళలను, మతమును, సంస్కృత, కన్నడ, తెలుగు మరియు తమిళ భాషలలో సాహిత్యమును ప్రోత్సహించారు. ఇతర దేశాలతో వాణిజ్యము అభివృద్ధి చెందినది. గుల్బర్గా బహుమనీ సుల్తానులు మరియు బీజాపూరు ఆదిల్‌షాహీ సుల్తానులు ఇండో-సార్సెనిక్ శైలిలో అనేక కట్టడములు కట్టించినారు మరియు ఉర్దూ, పర్షియన్ సాహిత్యాలను ప్రోత్సహించారు. మరాఠాపీష్వా మరియు టిప్పూ సుల్తాన్ల పతనముతో మైసూరు రాజ్యము (కర్ణాటక) బ్రిటీషు పాలనలోకి వచ్చినది.

మైసూర్ ప్యాలెస్
భారత స్వాతంత్రానంతరము, మైసూరు ఒడియార్ మహారాజు తన రాజ్యాన్ని భారత దేశములో విలీనము చేశాడు. 1950లో మైసూరు రాష్ట్రముగా అవతరించింది. నవంబర్ 1, 1956న కూర్గ్ రాజ్యాన్ని, చుట్టుప్రక్కల ఉన్న మద్రాసు, హైదరాబాదు మరియు బొంబాయి లలోని కన్నడ మాట్లాడే ప్రాంతాలను కలుపుకొని మైసూరు రాష్ట్రము విస్తరించి ప్రస్తుత రూపు సంతరించుకొన్నది. 1973 నవంబర్ 1 న రాష్ట్రము పేరు కర్ణాటక అని మార్చబడింది.

రవాణా సౌకర్యాలు:
బెంగళూరు, మంగళూరు, హుబ్లీ, బెల్గాం, హంపి, బళ్ళారి, మైసూరులలో విమానాశ్రాయాలున్నాయి. 3000 కిలోమీటర్లకు పైగా నిడివి కల రైలుమార్గాలు కర్ణాటకలో ఉన్నాయి. హుబ్లీ నైరుతి రైల్వే జోన్ ప్రధానకేంద్రంగా ఉంది. పశ్చిమాన విశాలమైన సముద్రతీరంలో 11 నౌకాశ్రయాలు కలవు. అందులో న్యూమంగళూరు మేజర్ నౌకాశ్రయము. సుమారు 4000 కిలోమీటర్ల పొడవైన 16 జాతీయ రహదారులు రాష్ట్రం గుండా వెళ్ళుచున్నాయి. అందులో ప్రధానమైనవి చెన్నై-బెంగళూరు జాతీయ రహదారి, వారణాసి, కన్యాకుమారి జాతీయ రహదారి, పూనె-విజయవాడ జాతీయరహదారులు.

క్రీడలు:
క్రికెట్ ఈ రాష్ట్రపు జనాదరణ కలిగిన క్రీడ. భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ప్రముఖ క్రీడాకారులు అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్, జవగళ్ శ్రీనాథ్, గుండప్ప విశ్వనాథ్, ఈ.ఏ.ఎస్.ప్రసన్న, బి.చంద్రశేఖర్ లు ఈ రాష్ట్రానికి చెందినవారు. అనిల్ కుంబ్లే భారత్ తరఫున అత్యధిక టెస్ట్ వికెట్లు సాధించిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. కొడుగు జిల్లా హాకీ క్రీడకు పేరుగాంచింది. ఈ జిల్లా నుంచి పలువురు జాతీయ హాకీజట్టుకు ప్రాతినిధ్యం వహించారు.

ఇవి కూడా చూడండి:

హోం,
విభాగాలు: భారతదేశ రాష్ట్రాలు, కర్ణాటక


 = = = = =


Tags: about Karnataka state information

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక