10, జులై 2014, గురువారం

సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar)

సునీల్ గవాస్కర్
జననంజూలై 10, 1949
రంగంక్రికెటర్
రాష్ట్రంమహారాష్ట్ర
భారతదేశానికి చెందిన ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడైన సునీల్ మనోహర్ గవాస్కర్ 1949 జూలై 10న జన్మించారు. సన్నీ అని ముద్దుగా పిల్వబడే ఈ ముంబాయికి చెందిన బ్యాట్స్‌మెన్ 1970' , 1980' దశాబ్దాలలో భారత క్రికెట్ జట్టుకు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ గా తన అపూర్వ సేవలందించారు. తన హయంలో 34 టెస్టు సెంచరీలతో అత్యధిక టెస్ట్ సెంచరీలు సాధించిన క్రికెటర్ గా మరియు 10122 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ్వ రికార్డు సృష్టించారు. ఆ సమయంలో తిరుగులేని జట్టుగా నిల్చిన వెస్ట్‌ఇండీస్ పైనే సెంచరీలపై సెంచరీలు సాధించి 65.45 సగటు పరుగులు సాధించడం అతని పోరాట పటిమను తెలియజేస్తుంది. 1983 ప్రపంచ కప్ సాధించిన భారత జట్టులో సభ్యుడే కాకుండా 1984 లో ఆసియా కప్ గెల్చిన భారత జట్టుకు ఇతడు నాయకత్వం వహించారు. ముంబాయి నగరానికి షరీఫ్‌గా వ్యవహరించిన ఘనతను కూడా పొందారు.

ప్రారంభ క్రీడా జీవితం:
చిన్న వయసులోనే క్రికెట్ బ్యాట్ చేతపట్టిన గవాస్కర్ 1966 లో దేశంలోనే బెస్ట్ స్కూల్ బాయ్ గా నిల్చినాడు. 1966-67లో వజీర్ సుల్తాన్ కోల్ట్స్ XI తరఫున తొలి ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడినాడు. 1970-71 లో వెస్ట్‌ఇండీస్ లో పర్యటించే భారత జట్టుకు ఎన్నికైనాడు.

క్రీడాప్రస్థానం:
గవాస్కర్ మొత్తం 125 టెస్టు మ్యాచ్‌లు ఆడి 34 సెంచరీలు, 10122 పరుగులతో ఆ నాటికి అత్యధిక పరుగులు సాధించిన ప్రపంచ రికార్డు సృష్టించాడు. తర్వాత ఆస్ట్రేలియాకు చెందిన అలాన్ బోర్డర్ అత్యధిక పరుగుల రికార్డును అధికమించిననూ టెస్ట్ క్రికెట్ లో 10 వేల పరుగులను సాధించిన తొలి క్రికెటర్ గా ఇతని రికార్డు మాత్రం ఎవరూ చెరపలేనిది. తొలిసారిగా వెస్ట్‌ఇండీస్ పర్యటనలో ఒకే సీరీస్ లో 774 పరుగులు చేసినప్పటి నుంచి చివరగా పాకిస్తాన్ తో బెంగుళారు టెస్టులో 96 పరుగులు చేసే వరకు అతని క్రీడాజీవితంలో ఎన్నో మైళ్ళురాళ్ళు. బ్యాట్స్‌మెన్లను గడగడలాడించే అరవీర భయంకర బౌలర్లను ఎదుర్కొని సుధీర్ఘ టెస్టు క్రికెట్ జీవితంలో 51.12 సగటుతో 34 సెంచరీలు, 45 అర్థ సెంచరీలు సాధించడం సామాన్యం కాదు.  కెప్టెన్ గా అతను అంతగా విజయం సాధించక పోయినా క్రీడాకారుడిగా అతని విజయాలు అమోఘమైనవి. మైకేల్ హోల్డింగ్ , ఆంబ్రోస్ , ఆండీ రాబర్ట్స్ , జెఫ్ థాంప్సన్ , డెన్నిస్ లిల్లీ , ఇమ్రాన్ ఖాన్ ల బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కొని భారత జట్టుకు అపురూప విజయాలు సాదించిన గవాస్కర్ లాంటి ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ లభించడం భారత జట్టుకు వరం లాంటిది. గవాస్కర్‌కు, కపిల్‌దేవ్‌కు మధ్య నాయకత్వ పోటీ ఏర్పడే సమయంలో టెస్టు జట్టు నుంచి నిష్క్రమించారు.

విభాగాలు: భారత క్రికెట్ క్రీడాకారులు, మహారాష్ట్ర క్రీడాకారులు, మహారాష్ట్ర ప్రముఖులు, ముంబాయి ప్రముఖులు, 1949లో జన్మించినవారు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక