28, జులై 2014, సోమవారం

కాసు బ్రహ్మానందరెడ్డి (Kasu Brahmananda Reddy)

కాసు బ్రహ్మానందరెడ్డి
జననంజూలై 28, 1909
స్వస్థలంచిరుమామిళ్ళ (గుంటూరు జిల్లా)
పదవులుఏపి ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ఏఐసిసి అధ్యక్షుడు,
మరణంమే 20, 1994
ప్రముఖ సమరయోధుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాసు బ్రహ్మానందరెడ్డి జూలై 28, 1909 న గుంటూరు జిల్లా చిరుమామిళ్ళ గ్రామంలో జన్మించారు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని జైలుకు కూడా వెళ్ళారు. మద్రాసు శాసనసభ సభ్యుడిగా, ఆంధ్రరాష్ట్ర కాంగ్రెస్ కమిటి ప్రధాన కార్యదర్శిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా, 1964-71 కాలంలో ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత కేంద్రమంత్రిగా, ఏఐసిసి అధ్యక్షుడిగా పనిచేశారు. బ్రహ్మానందరెడ్డి మే 20, 1994న మరణించారు.

సమరయోధుడిగా:
బ్రహ్మానందరెడ్డి 12 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు మహాత్మాగాంధీ విజయవాడ కాంగ్రెసు సదస్సుకు విచ్చేసిన సందర్భంలో గాంధీజీ బోధనలు విని ప్రభావితుడైనారు. గాంధీజీ మరియు టంగుటూరి ప్రకాశం పంతులు బోధనలు అతనిని స్వాతంత్ర్య ఉద్యమం వైపు నడిపాయి. లా ప్రాక్టీసును పక్కనబెట్టి బ్రిటిషు వారిపై పోరాటానికి ఉత్సాహంగా కదిలారు. పోలీసు లాఠీ దెబ్బలు తినడమే కాకుండా సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని జైలుశిక్ష కూడా అనుభవించారు. 1942లో బ్రిటిషు వారికి వ్యతిరేకంగా కాంగ్రెసు పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్లారు.

రాజకీయ ప్రస్థానం:
బ్రహ్మానందరెడ్డి జిల్లాబోర్డు సభ్యునిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి 1946లో ఉమ్మడి మదరాసు రాష్ట్రంలో మొదటిసారిగా శాసన సభ్యునిగా ఎన్నికైనారు. ఆ తర్వాత ఆంధ్రరాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ శాసనసభలలో కూడా 1972 వరకు శాసనసభ్యుడిగా కొనసాగినారు. 1952నుండి 1956 వరకు ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు కమీటికి ప్రధాన కార్యదర్శిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిన తరువాత 1956లో నీలం సంజీవరెడ్డి మంత్రి వర్గంలో, ఆ తర్వాత దామోదరం సంజీవయ్య మంత్రి వర్గంలో కొనసాగినారు. 1964 వ సంవత్ఫరం ఫిబ్రవరి 29న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. తెలంగాణా ఉద్యమం ప్రభావంతో 1971 సెప్టెంబరు 15న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. తర్వాత కేంద్రమంత్రి వర్గంలో చేరి 1974 కమ్యూనికేషన్, హోం, పరిశ్రమల శాఖలను నిర్వహించారు. 1977 లోకసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పరాజయం పొందిన పిదప జరిగిన ఏఐసిసి ఎన్నికలలో సిద్ధార్థ శంకర్ రేపై పోటీచేసి ఎన్నికైనారు. ఆ తర్వాత ఇందిరాగాంధీతో అభిప్రాయబేధాలు ఏర్పడటంతో ఏకంగా ఇందిరాగాంధీనే కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించి సంచలనం సృష్టించారు. దీనితో కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయింది. ఒకదానికి ఇందిరాగాంధీ మరోదానికి కాసు సారథ్యం వహించారు. తర్వాత రెడ్డి కాంగ్రెస్‌ను కాంగ్రెస్ (ఐ) పార్టీలో విలీనం చేశారు.

విభాగాలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు, మహారాష్ట్ర గవర్నర్లు, కేంద్రమంత్రులు, ఏఐసిసి అధ్యక్షులు, గుంటూరు జిల్లా ప్రముఖులు, 1909లో జన్మించినవారు, 1994లో మరణించినవారు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక