28, జూన్ 2014, శనివారం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)

ఆంధ్రప్రదేశ్
రాజధానిఅమరావతి
వైశాల్యం160205 చకిమీ
జనాభా4.96 కోట్లు


ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని 28 రాష్ట్రాలలో ఒకటి. ఈ రాష్ట్రానికి ఉత్తరాన తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాలు, తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన తమిళనాడు, పశ్చిమాన కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. ఇది భారతదేశంలో ఎనిమిదవ అతి పెద్ద రాష్ట్రము. గోదావరి, కృష్ణ, తుంగభద్ర మరియు పెన్నా నదులు ఈ రాష్ట్రం గుండా ప్రవహిస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 13 జిల్లాలు కలవు. రాష్ట్ర వైశాల్యం 160205 చకిమీ కాగా, జనాభా 4.96 కోట్లు. వైశాల్యంలో ఇది 8వ పెద్ద రాష్ట్రం మరియు జనాభాలో 10వ పెద్ద రాష్ట్రంగా ఉంది. తిరుపతి, శ్రీకాళహస్తి, విజయవాడ కనకదుర్గ ఆలయం, శ్రీశైలం, కాణిపాకం ఈ రాష్ట్రంలోని ముఖ్యమైన అధ్యాత్మిక క్షేత్రాలు. విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు, రైతు నాయకుడు ఎన్జీ రంగా, వ్యాపారవేత్త గ్రంథి మల్లికార్జునరావు, శాస్త్రవేత్త ఎల్లాప్రగడ సుబ్బారావు, తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి ఈ రాష్ట్రానికి చెందిన ప్రముఖులలో కొందరు.

బ్రిటీష్ కాలంలో మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉన్న ఈ ప్రాంతం 1953 అక్టోబర్ 1న మద్రాస్ రాష్ట్రంలోని తెలుగువారు ఎక్కువగా ఉన్న జిల్లాలను కలిసి ఆంధ్రరాష్ట్రంగా ఆవిర్భవించింది. 1956, నవంబర్ 1న అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతాన్ని మరియు ఆంధ్రరాష్ట్రాన్ని కలిసి హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. 58 సంవత్సరాల తరువాత జూన్ 2, 2014న తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా అవతరించుటలో 1956కు ముందున్న ఆంధ్రరాష్ట్ర భూభాగమే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నది. ఆంధ్రప్రదేశ్ అధికార భాష తెలుగు. దేశంలోనే 2వ అతి పెద్ద కోస్తా తీరం ఈ రాష్ట్రంలో ఉంది.

శ్రీశైలం డ్యాం
భౌగోళికం, సరిహద్దులు:
ఆంధ్రప్రదేశ్ 12°37', 19°54' ఉత్తర అక్షాంశాల మధ్య, 76°46', 84°46' తూర్పు రేఖాంశాల మధ్య వ్యాపించి ఉంది. భారత ప్రామాణిక రేఖాంశమైన 82°30' తూర్పు రేఖాంశం రాష్ట్రంలోని కాకినాడ మీదుగా పోతుంది. ఈ రాష్ట్రానికి ఉత్తరాన తెలంగాణ. ఒరిస్సా రాష్ట్రాలు, తూర్పున బంగాళా ఖాతం, దక్షిణాన తమిళనాడు, పశ్చిమాన కర్ణాటక రాష్ట్రాలు సరిహద్దులుగా ఉన్నాయి. 972 కిలోమీటర్ల పొడవున కోస్తాంధ్రలోని 9 జిల్లాలకు సముద్రతీరం ఉంది. గోదావరి, కృష్ణా, తుంగభద్ర లాంటి నదులు ఈ రాష్ట్రం గుండా ప్రవహించుచున్నవి. రాష్ట్ర వైశాల్యం 16205 చకిమీ. విశాఖపట్టణం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, రాజమండ్రి, మచిలీపట్నం, నెల్లూరు, కర్నూలు ఈ రాష్ట్రంలోని ప్రముఖ నగరాలు.

చరిత్ర:
ఆంధ్రప్రదేశ్ ప్రాచీనమైన చరిత్రను కలిగియుంది. క్రీ. పూ. 5వ శతాబ్దములో ప్రతీపాలపురం (భట్టిప్రోలు) రాజధానిగా కుబేరక అను రాజు పాలన చేసినట్లు ఆధారాలు లభ్యమైనాయి. మహావీరుడు, గౌతమ బుద్ధుడు ధాన్యకటకము (అమరావతి) సందర్శించారనడానికి ఆధారాలున్నాయి. మౌర్య చక్రవర్తి అశోకుని మరణానంతరం (క్రీ.పూ 232) ఆంధ్రులు వెలుగులోకి వచ్చారు. నవీన చరిత్రకారులు ఆంధ్రుల చరిత్ర ఆనాటి నుండి మొదలైనట్లుగా లెక్కిస్తున్నారు. ఆంధ్ర (శాతవాహన), శక, పల్లవ, ఇక్ష్వాక, తెలుగు చోళ, తూర్పు చాళుక్య, కాకతీయ, విజయనగర, కుతుబ్ షాహి, హైదరాబాదు నిజాంలు మొదలైన వంశాలకు చెందిన రాజులు ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించారు. క్రీ.శ 17వ శతాబ్దములో బ్రిటీషు వారు కోస్తా ఆంధ్రను నిజాం వద్ద గెలుచుకొని మద్రాసు రాష్ట్రములో (మద్రాసు ప్రెసిడెన్సీ) కలుపుకున్నారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చేనాటికి ఈ ప్రాంతం మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉండేది. మద్రాసు రాష్ట్రంలోని తెలుగువారు నివశించే ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు 58 రోజుల నిరాహార దీక్ష చేసి మరణించారు. చివరికి కర్నూలు రాజధానిగా 1953 అక్టోబరు 1న మద్రాసు రాష్ట్రంలో ఉత్తరాన ఉన్న 11 జిల్లాలతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం చేశారు. గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేసారు. టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. 1956, నవంబరు 1న హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలు మరియు ఆంధ్రరాష్ట్రం కలిపి ఆంధ్రప్రదేశ్ ను ఏర్పాటు చేసారు. కొత్త రాష్ట్రానికి హైదరాబాదు రాజధానిగా అవతరించింది. భాషప్రయుక్తంగా ఏర్పడిన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ మొదటిది. నీలం సంజీవరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రారంభంలో 20 జిల్లాలు ఉండగా 1970లో ప్రకాశం జిల్లా, 1978లో రంగారెడ్డి జిల్లా, 1979లో విజయనగరం జిల్లా ఏర్పాటుచేశారు.

1969లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికై పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభమైంది. కె.వి.రంగారెడ్డి, మర్రిచెన్నారెడ్డి లాంటివారు ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. కేంద్రం జోక్యం వల్ల మర్రిచెన్నారెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రజా సమితి పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబడి మర్రి చెన్నారెడ్డిని ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. దీనితో ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి తాత్కాలికంగా తెరపడిననూ 2001లో తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన కె.చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటుచేయడంతో మళ్ళీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తలెత్తింది. 2011-12 కాలంలో ఈ ఉద్యమం ఉధృతమైంది. ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు 44 రోజులపాటు విధులను బహిష్కరించి ఉద్యమంలో పాల్గొన్నారు. వందలాది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. చివరికి జూన్ 2, 2014న ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణకు చెందిన 10 జిల్లాలను విడదీసి తెలంగాణ రాష్ట్రం చేయడంతో ఆంధ్రప్రదేశ్‌లో 13 జిల్లాలు మాత్రమే మిగిలాయి.


ఒంగోలు వద్ద జాతీయ రహదారి
రవాణా సౌకర్యాలు:
దేశంలో పొడవైన 7వ నెంబరు (44) జాతీయ రహదారితో పాటు చెన్నై-కోల్‌కత 5వ నెంబరు జాతీయ రహదారి ఆంధ్రప్రదేశ్ గుండా వెళ్ళుచున్నది. అలాగే చైన్నై-బెంగుళూరు జాతీయ రహదారి, కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారులు కూడా ఈ రాష్ట్రం మీదుగా వెళ్ళుచున్నవి. రైల్వేల విషయంలో రాష్ట్రంలోని అధికభాగం దక్షిణ మధ్యరైల్వే పరిధిలోకి వచ్చిననూ ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతం ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. విజయవాడ, గుంటూరు, గుంతకల్ దక్షిణమధ్యరల్వే జోన్ లోని ముఖ్య డివిజన్లు. వాల్తేర్ డివిజన్ తూర్పు కోస్తా జోన్‌లో అత్యధిక రాబడినిచ్చే డివిజన్.
 
 
 
హోం,
విభాగాలు: భారతదేశ రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక