29, జూన్ 2020, సోమవారం

వి.శ్రీనివాస్ గౌడ్ (V.Srinivas Goud)

జననంమార్చి 16, 1969
స్వస్థలంరాచాల
పదవులుఎమ్మెల్యే
నియోజకవర్గంమహబూబ్‌నగర్ అ/ని,
విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్ పాలమూరు జిల్లా అడ్డాకుల మండలం రాచాల గ్రామానికి చెందినవారు. మార్చి 16, 1969జ జన్మించిన శ్రీనివాస్ గౌడ్ 8వ తరగతి వరకు స్థానికంగా రాచాలలో అభ్యసించి 10వ తరగతి వికారాబాదులో, ఉన్నత విద్య హైదరాబాదులో పూర్తిచేశారు. సెప్టెంబరు 18న స్రీనివాస్ గౌడ్ అమెరికాకు చెందిన డే స్ప్రింగ్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.

1968లో మహబూబ్‌నగర్ పురపాలక సంఘంలో శానిటరీ ఇన్స్‌పెక్టర్‌గా ఆ తర్వాత హైదరాబాదులో కమీషనర్‌గా పనిచేశారు. తెలంగాణ గజిటెడ్ ఉద్యోగ సంఘం స్థాపనలో కీలకపాత్ర పోషించారు.

2011-13 కాలంలో జరిగిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఉద్యోగసంఘం నాయకుడిగా పాల్గొన్నారు. ప్రభుత్వ సర్వీసులో ఉండగానే రాజీనామా చేసి రాజకీయాలలో ప్రవేశించారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరఫున 2014 ఎన్నికలలో మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు. 2014లో పార్లమెంటరీ కార్యదర్శిగా నియమితులై 2015 మార్చి వరకు పనిచేశారు. 2018లో మరోసారి మహబూబ్‌నగర్ నుంచి శాసనసభకు ఎన్నికై 2019లో కేసీఆర్ మంత్రివర్గంలో స్థానం పొందారు.

ఇవి కూడా చూడండి:




విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయ నాయకులు, అడ్డాకుల మండలము, మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక