2, మే 2014, శుక్రవారం

నేదురుమల్లి జనార్థన్ రెడ్డి (Nedurumalli Janardhana Reddy)

నేదురుమల్లి జనార్థన్ రెడ్డి
జననంఫిబ్రవరి 20, 1935
స్వస్థలంవాకాడు (నెల్లూరు జిల్లా)
పదవులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి (1990-92)
మరణంమే 9, 2014
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, పిసిసి అధ్యక్షునిగా పనిచేసిన నేదురుమల్లి జనార్థన్ రెడ్డి ఫిబ్రవరి 20, 1935న నెల్లూరు జిల్లా వాకాడులో జన్మించారు. 1972లో రాజకీయ ప్రవేశం చేసి, అంచెలంచెలుగా ఎదిగి, 3 సార్లు ఎంపీగా, 2 సార్లు పిసిసి అధ్యక్షునిగా, రాష్ట్ర మంత్రిగా, 1990-92 కాలంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు. మే 9, 2014న జనార్థన్ రెడ్డి మరణించారు. ఇతని భార్య రాజ్యలక్ష్మి రాష్ట్ర మంత్రిగా పనిచేశారు.

రాజకీయ ప్రస్థానం:
1972లో రాజ్యసభ సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన జనార్థనరెడ్డి ఆరేళ్ళ పాటు ఆ పదవిలో కొనసాగి 1978లో ఆంధ్రప్రదేశ్ విధానసభకు ఎన్నికై మంత్రివర్గంలో చోటుపొందారు. 1988లో ఆంధ్ర ప్రదేశ్ పిసిసి అధ్యక్షుడిగా నియమించబడ్డారు. 1989లో నెల్లూరు జిల్లా వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాష్ట్ర శాసనసభకు ఎన్నికై చెన్నారెడ్డి మంత్రివర్గంలో స్థానం పొందారు. మర్రి చెన్నారెడ్డి రాజీనామా తర్వాత 1990 డిసెంబరులో ముఖ్యమంత్రి బాధ్యతలు జనార్దనరెడ్డి చేపట్టి 1992 అక్టోబరులో రాజీనామా చేశారు. 1994లో వెంకటగిరి నుంచి పోటీచేసి ఓడిపోయారు. 1998లో 12వ లోక్‌సభకు బాపట్ల లోకసభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 1999లో 13వ లోక్‌సభకు నరసరావుపేట లోకసభ నియోజకవర్గం నుంచి ఎన్నికై రెండోసారి ఎంపి అయ్యారు. ఈ కాలంలో అనేక పార్లమెంటరీ కమిటీలలో సభ్యుడిగా పనిచేశారు. అతిముఖ్యమైన పబ్లిక్ అక్కౌంట్స్ కమిటీకి 1999 నుండి మూడేళ్ళ వరకు ప్రాతినిధ్యం వహించారు. 2004లో 14వ లోకసభకు విశాఖపట్టణం లోకసభ నియోజకవర్గం నుండి ఎన్నికై మూడవసారి లోక్‌సభకు వెళ్ళినారు. 2009లో స్వంత నియోజకవర్గం రిజర్వ్‌డ్ కావడంతో ఆతర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున 2009లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైనారు.



విభాగాలు: నెల్లూరు జిల్లా ప్రముఖులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు,  1935లో జన్మించినవారు, 2014లో మరణించినవారు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక