2, ఏప్రిల్ 2014, బుధవారం

నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం (Nalgonda Assembly Constituency)

నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గ పరిధిలో 3 మండలాలున్నాయి. ఈ సెగ్మెంట్ నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 1985లో ఇక్కడి నుంచి ఎన్టీరామారావు పోటీచేసి విజయం సాధించారు.
ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు:
  • నల్గొండ,
  • తిప్పర్తి,
  • కనగల్,
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1967 చకిలం శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీ

1972 చకిలం శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీ

1978



1983



1985



1989



1994



1999 కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎన్.నరసింహారెడ్డి సీపీఎం
2004 కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ
2009 కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎన్.నరసింహారెడ్డి సీపీఎం
2014 కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ కె.భూపాల్ రెడ్డి ఇండిపెండెంట్
2018 కె.భూపాల్ రెడ్డి తెరాస కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ


2004 ఎన్నికలు:

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీకి అభ్యర్థి గుత్తా సుఖేందర్ రెడ్డిపై 22738 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వెంకటరెడ్డి 69818 ఓట్లు పొందగా, సుఖేందర్ రెడ్డి 47080 ఓట్లు సాధించారు. ఎన్నికల బరిలో మొత్తం 9 అభ్యర్థులు పోటీపడగా ప్రధానపోటీ కాంగ్రెస్, తెలుగుదేశం, సి.పి.ఎం.ల మధ్యనే కొనసాగింది. వీరు ముగ్గురు కలిసి మొత్తం పోలైన ఓట్లలో 97.56% ఓట్లు సాధించారు. రంగంలో ఉన్న మిగితా 6 అభ్యర్థులు డిపాజిట్టు కోల్పోయారు.

2009 ఎన్నికలు:
2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సమీప ప్రత్యర్థి, సీపీఎం పార్టికి చెందిన ఎన్.నరసింహారెడ్డిపై 8377 ఓట్ల ఆధిక్యతతో విజయం 3 వరస విజయాలతో హాట్రిక్ సాధించారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సమీప ప్రత్యర్థి, ఇండిపెండెంటుగా పోటీచేసిన కె.భూపాల్ రెడ్డిపై 10547 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి వరసగా 4వ సారి శాసనసభలో ప్రవేశించారు.

2018 ఎన్నికలు:
2018 ఎన్నికలలో తెరాస తరఫున కంచర్ల భూపాల్ రెడ్డి, భాజపా తరఫున శ్రీరామొజు షణ్ముఖ, ప్రజాకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పోటీచేశారు. తెరాసకు చెందిన కంచర్ల భూపాల్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై 23698 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.


విభాగాలు: నల్గొండ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, నల్గొండ లోకసభ నియోజకవర్గం, నల్గొండ నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక