3, జనవరి 2014, శుక్రవారం

దుద్దిల్ల శ్రీధర్ బాబు (Duddilla Sridhar Babu)

 దుద్దిల్ల శ్రీధర్ బాబు
జననంమే 30, 1969
పదవులు3 సార్లు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి,
నియోజకవర్గంమంథని అ/ని,


దుద్దిల్ల శ్రీధర్ బాబు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. మే 30, 1969న జన్మించిన శ్రీధర్ బాబు తండ్రి దుద్దిల్ల శ్రీపాదరావు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకరుగా పనిచేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి న్యాయవాద పట్టా పొందిన శ్రీధర్ బాబు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కొంతకాలం ప్రాక్టీసు చేసి 29 సంవత్సరాల వయస్సులోనే రాజకీయాలలో ప్రవేశించారు.

రాజకీయ ప్రస్థానం:
తండ్రి శ్రీపాదరావు మరణానంతరం రాజకీయాలలో ప్రవేశించి తొలిసారి 1999లో మంథని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికయ్యారు. 2004లో రెండోసారి, 2009లో మూడో పర్యాయం అదే స్థానం నుంచి శాసనసభకు విజయం సాధించారు. 2009లో వైఎస్సార్ మంత్రివర్గంలో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా నియమితులైనారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో పౌరసరఫరాలు, శాసనసభ వ్యవహారాల మంత్రిగా పదవి పొందారు.

కుటుంబం:
శ్రీధర్ బాబు తండ్రి దుద్దిల్ల శ్రీపాదరావు 3 సార్లు మంథని నుంచి గెలుపొందారు. శాసనసభ స్పీకరుగా కూడా పనిచేశారు. శ్రీధర్ బాబు భార్య ఐఏఎస్ అధికారిణి.


ఇవి కూడా చూడండి:



విభాగాలు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రముఖులు, 11వ శాసనసభ సభ్యులు, 12వ శాసనసభ సభ్యులు, 13వ శాసనసభ సభ్యులు, 13వ శాసనసభ మంత్రులు,


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక