12, జనవరి 2014, ఆదివారం

బిజినేపల్లి (Bijinepalli)

బిజినేపల్లి గ్రామము
గ్రామముబిజినేపల్లి 
మండలముబిజినేపల్లి
జిల్లామహబూబ్‌నగర్
జనాభా6430 (2001)
7329 (2011)
బిజినేపల్లి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. ఇది మహబూబ్ నగర్ నుంచి శ్రీశైలం వెళ్ళు రహదారిపై ఉంది. ఇది ఒక ముఖ్య కూడలి. హైదరాబాదు-వనపర్తి రహదారి కూడా బిజినేపల్లి గుండా వెళ్ళుతుంది. ఈ గ్రామం మహబూబ్ నగర్ నుంచి 45 కిమీ దూరంలో ఉంది. ప్రముఖ కవియిత్రి పాకాల యశోధారెడ్డి ఈ గ్రామానికి చెందినవారు.

భౌగోళికం, సరిహద్దులు:
భౌగోళికంగా ఈ గ్రామం మండలంలో మధ్యగా ఉన్నది. ఈ గ్రామానికి ఉత్తరాన వెలుగొండ, వట్టెం, తూర్పున పాలెం, గుడ్లనర్వ, ఆగ్నేయాన ఖానాపూర్, దక్షిణాన బోయపూర్, పశ్చిమాన పోలెపల్లి గ్రామాలు సరిహద్దులుగాఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6430. ఇందులో పురుషులు 3328, మహిళలు 3102, గృహాలసంఖ్య 1269.
2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7329. ఇందులో పురుషులు 3730, మహిళలు 3599, గృహాల సంఖ్య 1586. అక్షరాస్యత శాతం 53.49%. గ్రామ కోడ్ సంఖ్య 575756.

రవాణా సౌకర్యాలు:
ఈ గ్రామం ముఖ్యమైన రోడ్డుకూడలి. మహబూబ్‌నగర్ నుంచి శ్రీశైలం వెళ్ళు రహదారి మరియు హైదరాబాదు నుంచి వనపర్తి వెళ్ళు రహదారులు ఇక్కడే కలుస్తాయి. గ్రామానికి నాలుగువైపులా నాలుగు ప్రధాన పట్టణాలకు వెళ్ళు రహదారులు ఉండుటచే రోడ్డు సౌకర్యము బాగుగా ఉన్నది. 

రాజకీయాలు:
2013, జూలై 31న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా గంగముని తిరుపతయ్య ఎన్నికయ్యారు.

విద్యాసంస్థలు:

గ్రామంలో 4 మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలు, మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల, ఆల్ సెయింట్ ప్రాథమికోన్నత పాఠశాల, గురురాఘవేంద్ర ప్రాథమికోన్నత పాఠశాల, సిద్ధార్థ గ్రామర్ స్కూల్, 2 జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలు (బాలుర మరియు బాలికల), ప్రగతి విద్యాలయ, శ్రీసరస్వతి విద్యానికేతన్ ఉన్నాయి.

విభాగాలు: బిజినేపల్లి మండలంలోని గ్రామాలు


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist 2001,
  • Census Statistics, Mahabubnagar Dist, 2011,
  • నాగర్‌కర్నూల్ గ్రామాలు, చరిత్ర (రచన:కపిలవాయి కిశోర్ బాబు),
  • బ్లాగురచయిత పర్యటించి తెలుసుకున్న, సేకరించిన విషయాలు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక