22, జనవరి 2014, బుధవారం

అప్పంపల్లి (Appampally)

అప్పంపల్లి గ్రామము
గ్రామముఅప్పంపల్లి 
మండలముచిన్నచింతకుంట 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా2416 (2001)
2476 (2011)
అప్పంపల్లి మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము.

చరిత్ర:
నిజాం నిరంకుశ పోరాటంలో ఈ గ్రామంలో సంఘటన ప్రసిద్ధిగాంచినది. గ్రామప్రజలు నిజాంకు, రజాకార్లకు వ్యతిరేకంగా ఎదురొడ్డి పోరాడారు. 1947 అక్టోబరు 7న నిజాం సైనికులు జరిపిన విచక్షణారహిత కాల్పులలో 11మంది మరణించగా 25 మంది గాయపడ్డారు. 

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2416. ఇందులో పురుషులు 1232, మహిళలు 1184. గృహాల సంఖ్య 512.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 2476. ఇందులో పురుషులు 1243, మహిళలు 1233. గృహాల సంఖ్య 542. అక్షరాస్యత శాతం 49.07%. గ్రామ కోడ్ సంఖ్య 575822.

రాజకీయాలు:
2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా శ్రీనివాస్ రెడ్డి ఎన్నికయ్యారు.

అప్పంపల్లి సంఘటన:
భారతదేశానికి బ్రిటీష్ వారి నుండి స్వాతంత్ర్యం లభించిననూ తెలంగాణ ప్రజలు ఇంకనూ నిజాం నియంతృత్వ పాలనలో ఉన్నారు. 3 బాషా ప్రాంతాలుగా మొత్తం 16 జిల్లాలుగా ఉన్న నిజాం సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావడానికి జరిగిన పోరాటమే తెలంగాణ విమోచనోద్యమం. తెలంగాణ విమోచనోద్యమం కోసం మహబూబ్‌నగర్ జిల్లాలోనే అప్పంపల్లి సంఘటన అగ్రస్థానంలో నిలిచింది. ఉద్యమ సమయంలో అప్పంపల్లి గ్రామంలో 1947, అక్టోబర్ 7న జరిగిన పరిణామాలే అప్పంపల్లి సంఘటన గా చరిత్రలో నిలిచిపోయింది. ఆ రోజు ఆత్మకూరు, అమరచింత సంస్థాన పరిధిలోని అప్పంపల్లి గ్రామంలో తెలంగాణ భారతదేశంలో విలీనం చేయాలని బెల్లం నాగన్న నాయకత్వంలో నిజాం పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించారు. అప్పంపల్లి పరిసర గ్రామాలైన నెల్లికొండ, వడ్డేమాన్, దాసరపల్లి, లంకాల, అమరచింత ,నర్వ తదితర గ్రామాలకు చెందిన రెండువేల ఉద్యమకారులు తెలంగాణ విమోచన కొరకు సత్యాగ్రహం చేశారు. ఈ సత్యాగ్రహాన్ని అణచివేయడానికి నిజాం సైనికులకు చేతకాలేదు. మహబూబ్ నగర్ నుంచి రిజర్వ్‌డ్ దళాలను రప్పించి సైనిక చర్య జరిపారు. బెల్లంనాగన్నతో పాటు, బలరాం గౌడు, నాగిరెడ్డి, తెలుగు ఆశన్న, రామచంద్రారెడ్డి, బుచ్చారెడ్డిలను అరెస్టు చేయాలని నిజాం సైనికులు నిర్ణయించిననూ ప్రజలు ప్రతిఘటించడంతో తోకముడిచారు. ప్రజల్లో కటిక నాన్నమ్మ(నాగమ్మ) అనే మహిళ కారం పొడితో తిరుగబడింది. ఆ సాయంత్రం ఉద్యమకారులపై కాల్పులు జరిపడంతో 11 మంది ఉద్యమకారులు మరణించారు. వీరిలో మొదటి వీర మరణం చాకలి కుర్మన్నది. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో నెల్లికొండికి చెందిన కుక్కుల కిష్టన్న తన ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి తన ఘనకార్యాన్ని చాటి చెప్పాడు. అప్పటి తాలుకా గిర్దావర్ మరియు పోలీస్ ఇన్స్‌పెక్టర్ ఇతన్ని అరెస్టు చేసి తీసుకువెళ్తుండగా ప్రజల ప్రతిఘటనకు భయపడి కిష్టన్నను వదిలి పారిపోయారు.

గ్రామ ప్రముఖులు:
కుక్కల కిష్టన్న: తెలంగాణ విమోచనోద్యమంలో అప్పంపల్లి సంఘటనగా పేరు పొందిన ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన కిష్టన్న జైలుకు కూడా వెళ్ళినాడు. 1947. అక్టోబరు 7న అప్పంపల్లిలో విమోచనోద్యమానికి నాయకత్వం వహించి నిజాం సైనికులకు ముప్పుతిప్పలు పెట్టాడు. పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా ఏకం చేసి ఉద్యమాన్ని నిర్వహించి నిజాం పాలకులను గడగడలాడించాడు. జైలుశిక్ష కూడా పొందిన కిష్టన్న 1982లో మరణించాడు.

విభాగాలు: చిన్నచింతకుంట మండలంలోని గ్రామాలు, 


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist 2001,
  • Census Statistics, Mahabubnagar Dist, 2011,
  • బ్లాగురచయిత పర్యటించి తెలుసుకున్న, సేకరించిన విషయాలు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక